HHVM Release in 2300 Theatres: పాన్ ఇండియా మోస్ట్ అవైయిటెడ్ చిత్రం హరి హర వీరమల్లు మరికొన్ని గంటల్లో థియటేర్లలో సందడి చేయబోతుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన బజ్ పెంచుకున్న ఈ సినిమా రిలీజ్ తర్వాత రికార్డుల మోత మోగిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. బుక్కింగ్స్ లో వీరమల్లు భారీ రెస్పాన్స్ వస్తోంది. టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఓపెన్ అయిన కొన్ని గంటల్లోనే హౌజ్ ఫుల్ బోర్డ్స్ పెట్టాశారు. ఆఫ్ లైన్, ఆన్ లైన్ లోనూ టికెట్స్ అన్ని సోల్డ్ అవుట్ అయ్యాయి. ప్రస్తుతం మూవీకి ఉన్న రెస్పాన్స్ చూస్తుంటే వీరమల్లు.. తొలి రోజు వసూళ్లు ఏ రేంజ్ లో ఉంటాయనేది అంచన కూడా వేయలేకోపోతున్నారు.
వరల్డ్ వైడ్ గా 2300 థియేటర్లలో
ఎన్నో వాయిదాల తర్వాత హరి హర వీరమల్లు జూలై 24న విడుదలకు సిద్దమౌవుతోంది. అసలు విడుదల అవుతుందో లేదో అనుకున్న ఈ చిత్రం భారీ స్థాయిలో థియేటర్లలో రిలీజ్ అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 2300 వేల థియేటర్లలో హరి హర వీరమల్లు విడుదల కాబోతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి సుమారు 900 స్క్రిన్స్ లో విడుదల మూవీ ప్రదర్శితం కానుంది. ఇక ప్రీమియర్స్ కి ఈ రోజు రాత్రి 9 గంటల 40 నిమిషాల నుంచి మొదలు కానున్నాయి. తొలి షోలు విదేశాల్లోనే పడనున్నాయి.
Also Read: Suriya 46: సూర్య బర్త్ డే ట్రీట్ అదుర్స్.. వెంకీ అట్లూరి మూవీ నుంచి ఫస్ట్ లుక్..
ఓవర్సిస్, యూకే తొలి షో వివరాలు..
నార్త్ అమెరికా, యూకే, యూరప్, కువైట్ దేశాల్లో 9 గంటల 30 నిమిషాలకు మొదటి షో పడనున్నాయి. ప్రస్తుతం అమ్ముడైన టికెట్లను బట్టి చూస్తే తొలిరోజు హరి హర వీరమల్లు రికార్డు ఒపెనింగ్స్ ఇచ్చేలా కనిపిస్తోంది. ఫస్ట్ డే ఈ చిత్రం రూ. 50 కోట్ల వరకు ఒపెనింగ్స్ ఇచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచన వేస్తున్నాయి. కాగా హరి హర వీరమల్లు లాభాల బాట పట్టాలంటే సుమారు రూ. 250 కోట్ల గ్రాస్ చేయాల్సి ఉంటుందట. కాగా ఒకవేళ మూవీ అనుకున్న దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వస్తే థియేటర్ల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కూడా ఉందంట. ఒకవేళ అదే జరిగితే మాత్రం బాక్సాఫీసు వద్ద వీరమల్లు దూకుడు మామూలుగా ఉండదు.
అందరి అంచనాలు, లెక్కలన్ని మారిపోవాల్సిందే అంటున్నారు ఫ్యాన్స్. కాగా క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ దర్శకత్వంలో పీరియాడికల్ యాక్షన్ డ్రామా హరి హర వీరమల్లు అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కింది. ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించగా.. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ప్రతి కథానాయకుడి పాత్ర పోషించాడు. సునీల్, సుబ్బరాజు, అర్జున్ రాంపాల్, పూజిత పొన్నాడ వంటి నటీనటులు ముఖ్యపాత్రలు పోషించారు. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ లో ఏఎం రత్నం హరి హర వీరమల్లును నిర్మించారు.
Also Read: Pawan Kalyan: ఆడియన్స్ అలాంటి సినిమాలనే ఇష్టపడుతున్నారు.. అందుకే ‘హరి హర వీరమల్లు’కు బజ్ లేదు.. పవన్