OTT Movie : మలయాళం సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కి ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. సరికొత్త స్టోరీలతో ఈ సినిమాలను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా కేరళ నుంచి విదేశాలకు వలస వెళ్లే యువత, తండ్రి-కొడుకు బంధం, స్వదేశంలోనే ఉండి అవకాశాలు సాధించాలనే ఆలోచనతో ఆకట్టుకుంటోంది. ఈ సినిమా కేరళ నుంచి 2.5 లక్షల మంది యువత విదేశాలకు వలస వెళ్తున్న సమస్యను, స్థానికంగా ఉండి అవకాశాలను సాధించే విధంగా ముగుస్తుంది. ఈ సినిమా రీసెంట్ గా ఓటీటీలోకి వచింది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలోకి వచింది ? అనే వివరాల్లోకి వెళితే …
అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్
ఈ మలయాళ ఫ్యామిలీ డ్రామా మూవీ పేరు ‘United Kingdom of Kerala’ (UKOK). 2025లో విడుదలైన ఈ సినిమాకి అరుణ్ వైగ దర్శకత్వం వహించారు. ఇందులో రంజిత్ సజీవ్, జానీ ఆంటోనీ, ఇంద్రన్స్, మనోజ్ కె. జయన్, సంగీత, మీరా వాసుదేవన్, మంజు పిళ్లై, అల్ఫోన్స్ పుత్రన్ నటించారు. ఈ చిత్రం 2025 జూన్ 20న థియేటర్లలో విడుదలై, జులై 19 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళంలో ఉన్న ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ డబ్బింగ్‌లలో కూడా అందుబాటులో ఉంది. 2 గంటల 11 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ సినిమాకి IMDb లో 6.2/10 రేటింగ్ ఉంది.
స్టోరీలోకి వెళితే
ఈ కథ కేరళలోని కట్టప్పనలో జరుగుతుంది. టోనీ (రంజిత్ సజీవ్) ఒక కాలేజ్ స్టూడెంట్. ఏ బాధ్యతలు లేని ఒక యువకుడు. అతని తండ్రి రాయ్ (జానీ ఆంటోనీ) ఒక సాధారణ వ్యక్తి. అతని భార్య మరియా (మీరా వాసుదేవన్) చిన్నప్పుడే టోనీని, అతన్ని వదిలి UKకి వెళ్లిపోవడంతో ఒంటరిగానే టోనీని పెంచుతాడు. రాయ్‌కి ఒకే ఆలోచన ఉంటుంది. టోనీని విదేశాలకు పంపి, అక్కడ మంచి జీవితం ఇవ్వాలని అనుకుంటూ ఉంటాడు. అందుకోసం అతను తన ఆస్తులను అమ్మి, టోనీ IELTS కోచింగ్ కోసం డబ్బు సేకరిస్తాడు. కానీ టోనీకి విదేశాలకు వెళ్లే ఆలోచన ఉండదు. అతను కేరళలోనే ఉండి, తన జీవితాన్ని తనదైన రీతిలో నడపాలని కోరుకుంటాడు.
ఇక ఈ సినిమా 1990 చివర్లో రాయ్, మరియా వయసులో ఉన్నప్పుడు జరిగే లవ్ ట్రాక్ మొదలవుతుంది. ఒక పెద్ద అపార్థం వల్ల వాళ్లిద్దరూ విడిపోతారు. ఇది వాళ్ల జీవితాలను పూర్తిగా మార్చేస్తుంది. ప్రస్తుత కాలంలో టోనీ, స్థానిక ఇసుక మాఫియాతో చిన్న చిన్న ఇల్లీగల్ పనులు చేస్తూ డబ్బు సంపాదిస్తూ, స్థానిక రౌడీలతో కలిసి తిరుగుతుంటాడు. ఈ క్రమంలో అతను స్థానిక రాజకీయ నాయకులు, పోలీసులతో గొడవల్లో చిక్కుకుంటాడు. ఇది అతని తండ్రి రాయ్‌కి నిరాశను కలిగిస్తుంది.
సినిమా రెండవ భాగంలో టోనీ తన జీవితంలో మార్పు కోరుకుంటాడు. అతను కేరళలోనే ఉండి, సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాలని నిర్ణయించుకుంటాడు. కానీ స్థానిక రాజకీయ ఒత్తిళ్లు అతని ఆలోచనలకు అడ్డంకిగా నిలుస్తాయి. టోనీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని తండ్రి తీవ్రంగా వ్యతిరేకిస్తాడు. కానీ అతని ధైర్యం, కేరళలోని యువతలో ఒక కొత్త ఉద్యమానికి నాంది పలుకుతుంది. వాళ్ళు విదేశాలకు వెళ్లకుండా స్వదేశంలోనే అవకాశాలను సృష్టించాలని అనుకుంటారు.
క్లైమాక్స్‌లో టోనీ జీవితం ఒక ఊహించని మలుపు తిరుగుతుంది. అతని నిర్ణయాలు, పోరాటం కేరళ యువతలో స్ఫూర్తిని రగిలిస్తాయి. కానీ అతని వ్యక్తిగత జీవితంలో ఒక ఎమోషనల్ ట్విస్ట్ వస్తుంది. ఇది తండ్రి-కొడుకు బంధాన్ని హైలైట్ చేస్తుంది. టోనీ సొంతంగా సక్సెస్ అవుతాడా ? అతడు యువతకి ఎలాంటి మోటివేషన్ ఇస్తాడు ? క్లైమాక్స్ ట్విస్ట్ ఏమిటి ? అనే విషయాలను ఈ మూవీని చూసి తెలుసుకోండి.
Read Also : ఫ్రెండ్ భార్యపైనే కన్ను… ఆపుకోలేక అడ్డమైన పనులు… పార్ట్స్ ప్యాక్ అయ్యే క్లైమాక్స్