BigTV English

Cheapest Electric Scooters: బడ్జెట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. రూ.10 ఖర్చుతో 100 కిమీ నడుస్తాయి!

Cheapest Electric Scooters: బడ్జెట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. రూ.10 ఖర్చుతో 100 కిమీ నడుస్తాయి!

Cheapest Electric Scooters: ఇప్పుడు దేశంలో బడ్జెట్ ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. మార్కెట్‌లో కొత్త మోడల్స్ నిరంతరం విడుదల అవుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ ధర కూడా పెట్రోల్ స్కూటర్‌తో సమానంగా వచ్చింది. ఓలా, ఏథర్, బజాజ్, టీవీఎస్ వంటి కంపెనీలు తమ స్కూటర్ల ధరలను భారీగా తగ్గించాయి. కైనెటిక్ గ్రీన్ తన ఇ-లూనా రూ. 10 ఛార్జీతో 100 కిలోమీటర్లు రేంజ్ ఇస్తుందని పేర్కొంది. మీరు బడ్జెట్ ప్రైస్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేయాలని చూస్తున్నట్లయితే వీటి గురించి తెలుసుకోండి.


Kinetic E- Luna
ఎలక్ట్రిక్ లూనా ఒక ఆఫర్డ్‌బుల్ మోపెడ్. దీని ధర రూ 69,990 నుండి ప్రారంభమవుతుంది. ఇది 2kwh లిథియం అయాన్ బ్యాటరీని కలిగి ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 110 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. పూర్తిగా ఛార్జ్ కావడానికి దాదాపు 4 గంటల సమయం పడుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 50 కిలోమీటర్లు. రూ.10 ఖర్చుతో 100 కిలోమీటర్లు నడుస్తుందని కంపెనీ పేర్కొంది. దీనికి 16 అంగుళాల పెద్ద వీల్స్ ఉన్నాయి. రైడ్ కోసం ఇది ముందు భాగంలో టెలిస్కోపిక్ సస్పెన్షన్‌ను కలిగి ఉంది. వెనుక ప్రయాణీకులు లైట్ గ్రాబ్‌ను చూస్తారు. మీరు దానిపై 150 కిలోల వరకు వస్తువులను లోడ్ చేయవచ్చు.

Also Read: టీవీఎస్ అపాచీ నుంచి ఎలక్ట్రిక్ బైక్.. పవర్ చూస్తే మతిపోతుంది!


Ola S1
ఓలా S1 ఈ స్కూటర్ ధర రూ.69,999. అంటే ఈ ధరలో రానున్న తొలి హైస్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే అవుతుంది. ఇందులో 2kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. ఈ స్కూటర్ ఫుల్ ఛార్జింగ్ పై 95 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. ఇది 4.3 అంగుళాల డిస్‌ప్లే కలిగి ఉంది. దీని గరిష్ట వేగం 85kmph. ఈ స్కూటర్ ఫీచర్లను అందించే ధర వద్ద ఇది బెస్ట్ ఆప్షన్.

TVS iQube
టీవీఎస్ iQube 3.4 kwh బ్యాటరీ ప్యాక్‌ని కలిగి ఉంది. ఈ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.20 లక్షలు. ఈ హై స్పీడ్ స్కూటర్ కేవలం 4.2 సెకన్లలో 0 నుండి 40కిమీ/గం వేగాన్ని అందుకుంటుంది. స్కూటర్ గరిష్ట వేగం గంటకు 78 కి.మీ. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 100 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. ఇందులో అల్లాయ్ వీల్స్, డిస్క్ బ్రేక్, డ్యూయల్ కలర్ ఆప్షన్ ఉన్నాయి. ఈ స్కూటర్ 5 అంగుళాల డిస్‌ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీతో వస్తుంది.

Also Read: సేఫ్టీ ముఖ్యం బిగులు.. ఫ్యామిలీ కోసం బెస్ట్ కార్లు ఇవే!

Bajaj Chetak 2901
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు చాలా తక్కువ ధరకు లభిస్తుంది. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఈ స్కూటర్ దాదాపు 123 కిమీ రేంజ్ ఇస్తుంది. ఈ స్కూటర్‌ను రూ. 95,998 ఎక్స్-షోరూమ్ ధరకు కొనుగోలు చేయవచ్చరు. ఇది డిజిటల్ కన్సోల్‌ని కలిగి ఉంటుంది. స్కూటర్‌లో LED లైట్లు, డిజైనర్ టెయిల్‌లైట్లు కూడా ఉన్నాయి.ఇందులో ఎకో మరియు స్పోర్ట్స్ అనే రెండు రైడింగ్ మోడ్‌లు ఉంటాయి.బజాజ్ చేతక్ 2901 2.9 kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. ఈ మిడ్ సెగ్మెంట్ స్కూటర్ గరిష్టంగా 63 kmph వేగాన్ని అందిస్తుంది. ఇది ఆరు గంటల్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది.

Tags

Related News

లోన్ యాప్స్ చట్టబద్ధమేనా..? ఇల్లీగల్ లోన్ యాప్స్ ఎలా గుర్తించాలి..?

క్రెడిట్ కార్డు బిల్స్ ఈఎంఐ పద్ధతిలో చెల్లిస్తున్నారా..దీని వల్ల కలిగే నష్టాలేంటి..? ప్రత్యామ్నాయాలేంటి…?

Redmi Note 15 Pro Plus: రెడ్‌మి 200 మెగా పిక్సెల్ కెమెరా.. మార్కెట్‌లో సంచలనం

Oppo Offers: ఒప్పో దీపావళి 2025 ఆఫర్లు వచ్చేశాయి.. స్మార్ట్‌ఫోన్లపై భారీ తగ్గింపులు

Mobile Data: మొబైల్ డేటా ఇట్టే అయిపోతుందా? ఈ టిప్స్ పాటిస్తే ఇక నో టెన్షన్!

Samsung Galaxy: ఏముంది భయ్యా.. సామ్‌సంగ్ గెలాక్సీ A17 5G కొత్త ఫోన్‌

Big Stories

×