BigTV English

TVS Apache Electric: టీవీఎస్ అపాచీ నుంచి ఎలక్ట్రిక్ బైక్.. పవర్ చూస్తే మతిపోతుంది!

TVS Apache Electric: టీవీఎస్ అపాచీ నుంచి ఎలక్ట్రిక్ బైక్.. పవర్ చూస్తే మతిపోతుంది!

TVS Apache Electric: TVS మరోసారి భారతదేశంలో రేసింగ్ కోసం తన ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్‌ను విడుదల  చేసింది. ఈ కొత్త Apache RTE అనేది ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్, ఇది గంటకు 200 కిమీ కంటే ఎక్కువ వేగాన్ని అందుకోగలదు. ఈ బైక్‌లో చాలా ప్రత్యేకమైన ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో కార్బన్ ఫైబర్ ఛాసిస్ ఉపయోగించారు. ఇది బ్యాటరీ కేస్‌గా కూడా యూజ్ అవుతుంది. దీని సీటు పూర్తి కార్బన్ ఫైబర్ యూనిట్‌పై ఆధారపడి ఉంటుంది. ఇది సబ్‌ఫ్రేమ్‌గా కూడా పనిచేస్తుంది.


హోసూర్ ఆధారిత కంపెనీ RTEని Ohlins సస్పెన్షన్, బ్రెంబో బ్రేకింగ్ సిస్టమ్ వంటి అనేక టాప్-స్పెక్ పార్ట్స్‌తో తయారు చేశారు. రోడ్డుపై మెరుగైన గ్రిప్ కోసం పిరెల్లి సూపర్ కోర్సా టైర్లను ఇందులో ఉపయోగించారు. కార్బన్ ఫైబర్ వీల్స్ అత్యధిక పవర్-టు-వెయిట్ రేషియో కోసం వినియోగించారు. అపాచీ ఆర్‌టీఈ పర్ఫామెన్స్ విషయానికి వస్తే ఈ బైక్ ఫుల్ ఛార్జ్‌పై దాదాపు 50కిమీల రేంజ్‌ను అందిస్తుంది. దీన్ని 1 నుండి 2 గంటల మధ్యలో ఫుల్ ఛార్జ్ చేయవచ్చు. వన్ మేక్ ఛాంపియన్‌షిప్ సమయంలో ఈ ఎలక్ట్రిక్ బైక్ 1 నిమిషం 48 సెకన్లలో పూర్తి వేగాన్ని సాధించింది.

అయితే TVS ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను మార్కెట్లో లాంచ్ చేయడానికి ఇంకా చాలా సమయం పడుతుంది. కంపెనీ ఇప్పటికే Apache RTE బ్రాండ్‌ను కలిగి ఉంటుంది. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ బైక్‌లను అభివృద్ధి చేయడంలో బ్రాండ్‌కు సహాయపడే ఈ రేస్ బైక్ నుండి నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి. ప్రస్తుతం TVS భారతీయ మార్కెట్ కోసం దాని పోర్ట్‌ఫోలియోలో కేవలం iQube ఎలక్ట్రిక్ స్కూటర్ మాత్రమే ఉంది. ఓలా ఎలక్ట్రిక్ తర్వాత ఇది రెండో స్థానంలో ఉంది.


Also Read:హీరో ఎక్స్‌ట్రీమ్ బైక్ కొంటున్నారా?.. అయితే ఈ రివ్యూపై ఓ లుక్కేయండి!

ఓలా తన మొదటి ఈ-బైక్‌ను ఎఫ్‌వై 26లో విడుదల చేయనుంది. ఓలా ఎలక్ట్రిక్ 2026 ఆర్థిక సంవత్సరం Q1లో తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఓలా తన పోర్ట్‌ఫోలియోలో 4 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను చేర్చింది. డైమండ్‌హెడ్, అడ్వెంచర్, రోడ్‌స్టర్, క్రూయిజర్ మోడళ్లు ఇందులో ఉన్నాయి. దీని ఆధారంగా కంపెనీ ఈ-మోటార్‌సైకిల్ విభాగంలో 30 శాతం కంటే ఎక్కువ మార్కెట్ వాటాను కలిగి ఉంటుంది.

Related News

Best bikes under 1 lakh: ఒక్క లక్షలోపు బెస్ట్ బైక్‌లు.. 2025 టాప్ బైక్స్ ఇవే..

Flipkart Big Billion Days: కేవలం రూ.1కే ప్రీబుక్ ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2025

Jio Anniversary Offer: జియో వార్షికోత్సవ గిఫ్ట్.. 2 నెలల ఉచిత ట్రయల్ ఆఫర్ వివరాలు

DMart Scam: డిమార్ట్ చాటున బడా మోసం.. ఇలా చేశారంటే మీ డబ్బులన్నీ లూటీ!

Motorola Edge 60 Pro: ఇంత పవర్‌ఫుల్ ఫోన్‌నా? మోటరోలా కొత్త బ్లాస్ట్

Airtel Offer: ఎయిర్‌టెల్ సూపర్ ఆఫర్.. ఇంటర్నెట్, టీవీ, ఓటీటీ అన్నీ ఒక్క ప్లాన్‌లోనే!

Big Stories

×