BigTV English

Coal Mines Auction: సింగరేణిని మరింత అభివృద్ధి చేస్తాం: కిషన్ రెడ్డి

Coal Mines Auction: సింగరేణిని మరింత అభివృద్ధి చేస్తాం: కిషన్ రెడ్డి

Coal Mines Auction: దేశీయ బొగ్గు ఉత్పత్తిని పెంపొందించడానికి, దేశానికి ఇంధన భద్రతను నిర్ధారించడానికి ముఖ్యమైన చర్యగా, బొగ్గు మంత్రిత్వ శాఖ శుక్రవారం హైదరాబాద్‌లో కోల్ బ్లాక్ వేలం తదుపరి విడతను ప్రారంభించింది.


ఈ చొరవ బొగ్గు రంగంలో పారదర్శకత, పోటీతత్వం, స్థిరత్వాన్ని పెంపొందించడానికి సిద్ధంగా ఉన్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ కార్యక్రమానికి కేంద్ర బొగ్గు గని శాఖ మంత్రి కిషన్ రెడ్డి, సహాయ మంత్రి సతీష్ చంద్ర దూబె, తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరయ్యారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ బొగ్గు గనుల వేలం వలన రాష్ట్ర ప్రభుత్వాలకు లబ్ది చేకూరుతుందని అన్నారు. బొగ్గు గనుల వేలాన్ని ప్రారంభించిన కిషన్ రెడ్డి సింగరేణి ఉద్యోగులు, కార్మికులకు నష్టం కలగకుండా చూస్తామన్నారు.


సింగరేణిని అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు లోబడే బొగ్గు గనుల వేలం చేపట్టామని.. ఆదాయం కోసం అసలే వేలం వేయడం లేదని తెలిపారు. దేశవ్యాప్తంగా బొగ్గు గనుల వేలం విషయంలో కేంద్రం ఒకే పాలసీని అమలు చేస్తోందన్నారు. సింగరేణికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సింగరేణికి కొత్త గనులు కేటాయించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరారు. గత ప్రభుత్వ పాలనలో కొయ్యగూడెం, సత్తుపల్లిలోని 6 కోల్ బ్లాకులను తమ విధేయులకు కట్టబెట్టారని భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఈ ఆరు బ్లాకులను సింగరేణికి కేటాయిస్తే అనువుగా ఉంటుందని అన్నారు.

Also Read: సింగరేణి.. ఉద్యోగాల గని.. తెలంగాణకే తలమానికం: భట్టి విక్రమార్క

ఈ విషయమై కిషన్ రెడ్డి ప్రధాని మోదీని ఒప్పించాలని భట్టి కోరారు. అవసరమైతే ప్రధానితో మాట్లాడేందుకు తాను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రావడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఇక బొగ్గు గనుల వేలంలో సింగరేణికి రిజర్వేషన్ కల్పించాలని భట్టి కోరారు. అనంతరం కిషన్ రెడ్డికి భట్టి వినతి పత్రం సమర్పించారు.

Tags

Related News

Hyderabad News: హైదరాబాద్ సిటీ.. కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు, నేటి సాయంత్రానికి పూర్తి

GHMC Hyderabad: హైదరాబాద్‌లో.. ఇన్ని లక్షల గణేషుడి ప్రతిమలా! జీహెచ్ఎంసీ కీలక ప్రకటన!

Hyderabad Tank Bund: గణనాథుడి నినాదాలతో మార్మోగిన హైదరాబాద్.. శోభాయాత్రలో పోలీసుల డాన్స్

Hyderabad Water: హైదరాబాద్‌లో రెండు రోజులు నీళ్లు బంద్.. ఏ ఏరియాల్లో అంటే?

CM Revanth Reddy: సామాన్యుడిలా ట్యాంక్ బండ్ వద్దకు సీఎం రేవంత్ రెడ్డి

Hyderabad Drug: హైదరాబాద్‌లో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. 12 వేల కోట్ల మాదక ద్రవ్యాలు సీజ్

Big Stories

×