Big Stories

Electric Vehicles: ఎలక్ట్రిక్ వాహనాల జోరు.. రానున్న రెండేళ్లలో రూ.25 వేల కోట్లకు పైగా పెట్టుబడులు..!

Electric Vehicles: భారతీయ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాల హవా కొనసాగుతుంది. FY2024 నాటికి దేశంలో EV వ్యాప్తి 4.7 శాతానికి చేరుతుందని ICRA తెలిపింది. వీటిలో ఎక్కువ భాగం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విభాగం ఉందని వెల్లడించింది.  అయితే ఇందులో ఈ- త్రీ వీలర్లు,  ఎలక్ట్రిక్ బస్సులు కూడా ఉన్నాయి. 2030 నాటికి దేశీయ ద్విచక్ర వాహనాల విక్రయాల్లో 25 శాతం, ప్యాసింజర్ వాహనాల విక్రయాల్లో 15 శాతం EVలు ఉంటాయని అంచనా వేసింది. ఎలక్ట్రిక్ వాహనాల విడిభాగాల ఉత్పత్తిని విస్తరించేందుకు ఆటో కాంపోనెంట్ పరిశ్రమ వచ్చే 3-4 ఏళ్లలో రూ.25,000 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టనుందని ICRA పేర్కొంది.

- Advertisement -

అయితే ఎలక్ట్రిక్ వాహనాలలో అత్యంత ఖరీదైన భాగం అయిన అధునాతన కెమిస్ట్రీ బ్యాటరీ, ఇంపోర్ట్  దిగుమతి చేసుకునే వాహన ధరలో దాదాపు 35-40 శాతం వరకు ఉంటుంది. ఇక్రా, కెపాసిటీ బిల్డింగ్, టెక్నాలజీ, ప్రొడక్ట్ మెరుగుదలల కోసం రాబోయే మూడు-నాలుగేళ్లలో EV కాంపోనెంట్‌ల కోసం కనీసం రూ. 25,000 కోట్ల కాపెక్స్‌ని ఇక్రా అంచనా వేస్తోంది.

- Advertisement -

Also Read : పోరగాండ్ల మతిపోగొడుతున్న జీప్ రాంగ్లర్.. ఈ రోజే లాంచ్..!

ఇందులో దాదాపు 45-50 శాతం బ్యాటరీ సెల్స్‌కే ఉంటుందని తెలిపారు. పీఎల్‌ఐ స్కీమ్, ఇటీవలి ఈ-వెహికల్ పాలసీ, రాష్ట్ర ప్రోత్సాహకాలు కూడా పెట్టుబడి వ్యయాన్ని వేగవంతం చేస్తాయని రేటింగ్ ఏజెన్సీ వెల్లడించింది.  2030 నాటికి దేశీయ ద్విచక్ర వాహనాల విక్రయాల్లో 25 శాతం, ప్యాసింజర్ వాహనాల విక్రయాల్లో 15 శాతం EVలు ఉంటాయని ఏజెన్సీ అంచనా వేసింది.

టూ వీలర్ కాంపోనెంట్ మార్కెట్ కూడా విస్తరిస్తోంది. 2030 నాటికి దేశీయ ఎలక్ట్రిక్ టూ-వీలర్ కాంపోనెంట్ మార్కెట్ స్పేర్‌పార్ట్స్ విలువ రూ. 1 లక్ష కోట్లు దాటుతుందని రేటింగ్ ఏజెన్సీ అంచనా వేసింది. అయితే ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కాంపోనెంట్ సెగ్మెంట్ అనుబంధ వాహనాల ఆదాయం కనీసం రూ. 50,000 కోట్లుగా అంచనా.

Also Read : గుడ్ న్యూస్.. ఇకపై వారికి కూడా హెల్త్ ఇన్సూరెన్స్..!

భారతదేశంలో ప్రస్తుతం బ్యాటరీ సెల్‌లు తయారు చేయడం లేదు. అందువల్ల అసలైన పరికరాల మాన్యుఫ్యాక్చరర్స్ OEM దిగుమతులపై ఆధారపడి ఉన్నారు. భారతదేశంలో బ్యాటరీ ప్యాక్‌ల అసెంబ్లింగ్‌ మాత్రమే చేస్తున్నారు. బ్యాటరీ సెల్‌లను స్థానికంగా అభివృద్ధి చేయడానికి ఆటోమొబైల్ ఇండస్ట్రీ నిపుణులు చర్యులు జరుపుతున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News