Big Stories

Elon Musk: మోదీతో ఎలాన్ మస్క్ భేటి.. భారత్‌లో 2-3 బిలియన్ డాలర్ల పెట్టుబడులు..!

Elon Musk to meet PM Modi: ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ త్వరలోనే భేటి కానున్నారు. భారత పర్యటనలో భాగంగా ఎలాన్ మస్క్ మోదీతో సమావేశమై పలు విషయాలపై చర్చించనున్నారు. దేశంలో టెస్లా కార్ల ప్లాంట్ ఏర్పాటుతో పాటుగా మరిన్ని రంగాల్లో మస్క్ పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

ఎస్క్ భారత్ పర్యటనలో భాగంగా టెస్లా కార్ల ప్లాంట్ కోసం దాదాపు 2 నుంచి 3 బిలియన్ డాలర్ల పెట్టుబడిపై ఓ కీలక ప్రకటన చేయనున్నారు. ఇప్పటికే ప్లాంట్ లను ఏర్పాటు చేసేందుకు టెస్లా బృందాలు భారత్ లోని పలు రాష్ట్రాల్లో పర్యటనలు చేస్తున్నాయి.

- Advertisement -
Elon Musk to meet PM Modi
Elon Musk to meet PM Modi

తాజాగా ఈ బృందాలు మూడు రాష్ట్రాల్లో ప్లాంట్ ల ఏర్పాటుకు అనువుగా ఉన్నట్లు సంస్థకు నివేదించినట్లు తెలుస్తోంది. ప్లాంట్ల ఏర్పాటు కోసం మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలను సూచించినట్లు సమాచారం. వీటిని ఏర్పాటు చేసే ప్రాంతాలపై కూడా వీరు చర్చించుకున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం భారత్ లో ఈవీ తయారీలో టాటా గ్రూప్ టాప్ లో ఉంది. అయితే గతేడాది దేశంలో ఈవీల అమ్మకాలు కేవలం 3 శాతం మాత్రమే. కాగా, భారత్ మాత్రం 2030 నాటికి దేశంలో వీటి అమ్మకాలను 30 శాతానికి పెంచడమే లక్ష్యంగా పెట్టుకుంది.

అయితే అమెరికా, చైనాలో టెస్లా కార్ల అమ్మకాలు నెమ్మదించడంతో మస్క్ చూపులు.. అభివృద్ధి భాటలో దూసుకుపోతున్న భారత్ పై పడ్డాయి. దీంతో గత కొన్నేళ్లుగా టెస్లా అమ్మకాలను భారతీయ మార్కెట్లోకి ప్రవేశ పెట్టాలని మస్క్ ప్రయత్నాలు చేస్తున్నారు.

ప్రస్తుతం భారత్ స్వదేశీ ఉత్పత్తులను పెంచడానికి ప్రయత్నాలు చేస్తోంది. దీంతో ఇతర దేశాల్లో తయారై భారత్ లోకి దిగుమతి చేస్తే భారీగా వాటిపై సుంకాలను విధిస్తోంది. దీంతో భారత్ లోకి టెస్లా కార్లను దిగుమతి చేయకుండా.. సొంతంగా ఇక్కడే ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి టెస్లా ప్లాన్స్ చేస్తోంది.

Also Read: గూగుల్ షాకింగ్ నిర్ణయం.. మరోసారి ఉద్యోగుల తొలగింపు

దీనిలో భాగంగానే మస్క్.. ప్రధాని మోదీతో భేటి కానున్నారు. వచ్చే సోమవారం వీరిద్దరూ సమావేశమై.. 2 నుంచి 3 బిలియన్ డాలర్ల పెట్టుబడులు గురించి చర్చించనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్టర్ ద్వారా తెలిపారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News