Big Stories

Google Layoffs: గూగుల్ షాకింగ్ నిర్ణయం.. మరోసారి ఉద్యోగుల తొలగింపు!

Google Lay Off’s more Employees: టెక్ దిగ్గజం గూగుల్ మరో సారి ఉద్యోగులపై వేటుకు రంగం సిద్ధం చేసింది. ఆర్థిక కారణాల దృష్ట్యా ఉద్యోగులను తొలగించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ అధికార ప్రతినిధి తెలిపారు. తొలగింపు ఈ ఏడాది అంతా కొనసాగనున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

అయితే ఇప్పటికే పలు మార్లు ఉద్యోగులను తొలగించిన గూగుల్ ప్రస్తుతం ఎంతమందిని తొలగిస్తుందనే అంశంపై క్లారిటీ ఇవ్వలేదు. ఈ తొలగింపులు అన్ని చోట్ల ఉండవని తెలుస్తోంది. కానీ కంపెనీలోని ప్రభావిత ఉద్యోగులు అంతర్గత రోల్స్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది గూగుల్.

- Advertisement -

 

ప్రభావిత ఉద్యోగుల్లో కొంతమందిని మాత్రం ఇండియా, చికాగో, అట్లాంటా, డబ్లిన్‌కు పంపనున్నట్లు అధికారి తెలిపారు. కంపెనీలో ఆయాదేశాలు పెట్టుబడులు పెడుతుండగా ఉద్యోగులను అక్కడకు పంపేందుకు గూగుల్ సిద్ధమైనట్లు సమాచారం. రెండేళ్లలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించింది గూగుల్. ఈ ఏడాది ప్రారంభంలోనే సుందర్ పిచాయ్ మరింత మందిని తొలగిస్తామని తెలిపారు. ఆయన చెప్పినట్లుగానే లేఆఫ్ ల పర్వానికి తెరలేపింది గూగుల్ .

Also Read: Imran Khan Warns: ఆమెని వదలను.. ఆర్మీ చీఫ్‌కు ఇమ్రాన్ వార్నింగ్

కంపెనీ కార్యకలాపాలు మెరుగుపరచడానికి పలు మార్పులు చేస్తున్నట్లు ప్రతినిధి తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో పెట్టుబడులు పెంచిన గూగుల్ ఈ ఏడాది మొదట్లోనే ఇంజినీరింగ్, హార్డ్‌వేర్, అసిస్టెంట్ టీమ్‌లతో సహా వందలాది మంది ఉద్యోగులను తొలగించింది. గూగుల్‌లో ఉద్యోగుల తొలగింపు ఈ ఏడు భారీగానే ఉండనున్నట్లు సమాచారం.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News