E-Paper
Advertisement

పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ రిలీఫ్.. నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు! అదెలా సాధ్యం?

పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ రిలీఫ్.. నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు! అదెలా సాధ్యం?
Advertisement

EPFO: బ్యాంకులు, ఎల్ఐసీ, ఈపీఎఫ్‌ఓ.. ఇలా ఏ సెక్టార్ చూసినా క్లెయిమ్ చేయని వేల కోట్ల రూపాయలు కేంద్రం వద్ద ఉన్నాయి. ప్రతీ ఏటా వాటి గురించి ప్రభుత్వం చెబుతోంది. దీన్ని గమనించిన ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ- EPFO ఆ సొమ్మును అసలైన హక్కుదారులకు చేర్చేందుకు ఓ అడుగు ముందుకేసింది. ఆయా ఖాతాదారులు ఎలాంటి అప్లికేషన్లు పెట్టుకోకుండా సంబంధిత వ్యక్తి ఖాతాలోకి జమ కానున్నాయి. నమ్మడానికి విచిత్రంగా ఉన్నా ముమ్మాటికీ నిజం.

పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ రిలీఫ్- కొందరు ఉద్యోగులు.. జాబ్‌లు మారడం లేకుంటే పాత కంపెనీల నుంచి పీఎఫ్ నిధులను క్లెయిమ్ చేసుకోకపోవడం వల్ల రెండు దశాబ్దాలుగా దాదాపు 31.86 లక్షల ఇన్‌యాక్టివ్ ఖాతాలు క్రియేట్ అయ్యాయి. వాటిలో ఏకంగా రూ.10,903 కోట్లు క్లెయిమ్ కాకుండా నిరుపయోగంగా పడి ఉన్నాయి. ఈపీఎఫ్‌ఓ తీసుకొచ్చిన కొత్త ఆటోమేటిక్ సిస్టమ్‌తో ఆ తరహా ఖాతాదారులకు పెద్ద ఉపశమనం లభించనుంది. ఇన్‌యాక్టివ్ పీఎఫ్ ఖాతాల నుంచి సొమ్ము ఉపసంహరించుకోవాలంటే ఖాతాదారులు స్వయంగా అప్లై చేయాలి. ఇప్పుడు ఆ శ్రమ అవసరం లేదు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఆటోమేటిక్ రీఫండ్ సిస్టమ్ ద్వారా సంబంధిత ఖాతాదారులు ఎలాంటి ఫారంలు నింపాల్సిన పని లేదు.

Advertisement

బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు! నిరుపయోగంగా ఉన్న ఖాతాలను గుర్తించింది ఈపీఎఫ్‌ఓ. ఆధార్‌తో అనుసంధానమైన సదరు వ్యక్తి బ్యాంక్ ఖాతాలకు వడ్డీతో సహా సొమ్మును నేరుగా బదిలీ చేయనుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో పైలట్ ప్రాజెక్ట్‌కు కేంద్ర కార్మిక-ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఆమోదముద్ర వేశారు. తొలి దశలో రూ.1,000 లేకుంటే అంతకంటే తక్కువ నిధులున్న ఇన్‌యాక్టివ్ ఖాతాలను గుర్తించారు. ఇలాంటి దాదాపు 7.11 లక్షల ఖాతాలను గుర్తించారు. ఇప్పటికే 1.18 లక్షల సబ్‌స్క్రైబర్ల ఖాతాల వివరాల పరిశీలన జరిగింది. ఆయా ఖాతాల వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసినట్టు తెలుస్తోంది. రేపో మాపో వారి ఖాతాల్లో నిధులు జమకానున్నాయి. ఈ ప్రక్రియను పారదర్శకంగా మార్చేందుకు పీఎఫ్‌ వినూత్న టెక్నాలజీని వినియోగించింది.

టెక్నాలజీ ద్వారా ప్రయోగం-ఆధార్‌తో లింకైన పీఎఫ్ ఖాతాదారుల బ్యాంక్ ఖాతాలతో సరి పోల్చింది. సదరు వ్యక్తి బ్యాంక్ ఖాతాలోకి రూపాయి జమ చేసి ఖాతా నిజమైనదో కాదో నిర్థారించింది. సి-డాక్-C-DAC సంస్థ ఈపీఎఫ్‌ఓ ఐటీ ప్లాట్‌ఫాంను అప్‌గ్రేడ్ చేసే పనిలో నిమగ్నమైంది. కొత్త తీసుకొచ్చిన ప్లాట్‌ఫామ్‌లో సిస్టమ్ జెనరేటెడ్ క్లెయిమ్ అనే ఫీచర్‌ను యాడ్ చేసింది. నిరుపయోగంగా ఉన్న ఖాతాల క్లెయిమ్‌లను ప్రాసెస్ చేస్తుంది. ఈ తరహా అప్‌గ్రేడ్ ప్రక్రియ ఆగస్టు చివరికి పూర్తికానుంది. ఆ తర్వాత నిధులు బదిలీ ప్రారంభం కానుందని సమాచారం. తొలుత పీఎఫ్ ఖాతాలో రూ.1,000 వరకున్న ఖాతాలపై ఈ ప్రయోగం సక్సెస్ అయితే మిగతా వాటికి విస్తరించనుంది. వెయ్యి కంటే ఎక్కువ సొమ్ము ఉన్న 24.76 లక్షల ఇన్‌యాక్టివ్ ఖాతాల నిధులను ఈ తరహాలో ఆటోమేటిక్‌గా ఖాతాదారుల అకౌంట్లకు రీఫండ్ చేయనుంది.

Advertisement

ALSO READ: ఒకే ఏడాదిలో పలుమార్లు ఉద్యోగాలు మారారా? ఐటిఆర్ ఫైల్ చేసేటప్పుడు ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి

Related News

1980 నుంచి 2026 వరకు.. తులం బంగారం ఎంత పెరిగిందో తెలుసా? లెక్కలు చూస్తే షాకే!

మళ్లీ సమ్మె చేయనున్న బ్యాంకు ఉద్యోగులు.. అసలు సమస్య ఇదే

పుత్తడి ప్రియులకు షాక్.. అమాంతంగా పెరిగిన ధర, నేడు మార్కెట్లో ధరలు ఇవే

ఐఫోన్ 18 ప్రో తక్కువ ధరలో కావాలా? ఈ దేశాల్లో కొంటే ఇండియా కంటే చీప్

పిఎఫ్ సెటిల్మెంట్ ఆలస్యం చేస్తే వడ్డీ తప్పదా? EPFO కేసులో మండిపడిన కోర్టు

SBI తప్పిదం.. రోజుకు రూ.5 వేలు చెల్లించాలన్న కోర్టు, ఇలా మీకూ జరిగిందా?

మార్కెట్లో ఎగిసిన ముడి చమురు ధర.. బ్రెంట్ క్రూడ్ 102 డాలర్లు, భారత్‌‌లో ధరలు పెరిగే ఛాన్స్

పసిడి ప్రియులకు పంగడే.. దిగొస్తున్న లోహాల ధరలు, తులం ఎంతంటే..

Big Stories

Advertisement
×