E-Paper
Advertisement

జబర్దస్త్ లో ఆషాడం ఆఫర్స్.. వారికి మాత్రమేనండోయ్!

జబర్దస్త్ లో ఆషాడం ఆఫర్స్.. వారికి మాత్రమేనండోయ్!
Advertisement

Jabardasth:సాధారణంగా ఆషాడం వచ్చిందంటే చాలు ఎక్కడ చూసినా ఆఫర్లే ఆఫర్లు. దుస్తులను మొదలుకొని వేసుకునే బంగారు ఆభరణాల వరకు ప్రతి దాంట్లో కూడా మనకు ఆఫర్లు లభిస్తూ ఉంటాయి. అలాంటిది ఇప్పుడు సడన్గా జబర్దస్త్ లో ఆషాడం ఆఫర్స్ అంటూ వచ్చిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జబర్దస్త్ లో ఆషాడం ఆఫర్స్ ఏంటి? అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

జబర్దస్త్ లోకి హైపర్ ఆది..

దశాబ్ద కాలానికి పైగా బుల్లితెరపై ఆడియన్స్ కి మంచి వినోదాన్ని పంచుతూ ఆకట్టుకుంటున్న ఏకైక కామెడీ షో జబర్దస్త్ (Jabardasth). ఇందులో ఎంతోమంది కమెడియన్స్ గా స్థిరపడిపోయిన వారు ఉన్నారు. ఇందులో కమెడియన్ లుగా పేరు తెచ్చుకొని సినిమాలలో అవకాశాలనందుకుంటూ దూసుకుపోతున్న వారు ఉన్నారు. హీరోలుగా, దర్శకులుగా కూడా సినిమాలలో బిజీగా మారిపోయారు. అలాంటి ఈ షో కి కామెడీ కింగ్ హైపర్ ఆది రీఎంట్రీ ఇచ్చారు. ఒకప్పుడు ఇందులో కమెడియన్ గా పనిచేసిన ఆది.. కొంతకాలం క్రితం జబర్దస్త్ ను మానేసిన విషయం తెలిసిందే. అయితే అలాంటి ఆది (Hyper Aadi) ఇప్పుడు మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.

జబర్దస్త్ లో ఆషాడం ఆఫర్స్..

Advertisement

జబర్దస్త్ లో ఆషాడం ఆఫర్స్ అంటూ.. రీ ఎంట్రీ పై హైపర్ ఆది చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. హైపర్ ఆది పెళ్లి కొడుకు గెటప్ లో మెట్ల మీద నుండి కిందికి దిగివస్తున్న షాట్ తో వీడియో ప్రారంభం అవుతుంది. ఎక్కడికైనా వెళ్తే ఇంతకుముందు జబర్దస్త్ ఎప్పుడు? శ్రీదేవి డ్రామా కంపెనీ ఎప్పుడు? అని అడిగేవాళ్లు.. కానీ ఇప్పుడు వెళ్తుంటే నీ పెళ్ళెప్పుడు అని అడుగుతున్నారు. ఒక అమ్మాయిని చూసి దగ్గరికి వెళ్లి.. పెళ్లి చేసుకుందామంటే నాకు రిచ్ అబ్బాయే కావాలని అడుగుతోంది. అందుకే రిచ్ అయిపోవాలని జబర్దస్త్ కి వచ్చాను.

ALSO READ:ట్రైలర్ తో రికార్డ్ సృష్టించబోతున్న యశ్!

ఆఫర్స్ భలే ఉన్నాయే..

Advertisement

ఎందుకంటే ఇక్కడేదో జబర్దస్త్ లో ఆషాడం ఆఫర్స్ నడుస్తున్నాయంట కదా.. ఇక్కడ ఏదో బెస్ట్ పంచ్ వేస్తే 1000 రూపాయలు.. పర్ఫార్మర్ ఆఫ్ ద డే అంటే రూ.5000, ఎక్కువ స్కిట్లు కొడితే రూ.50,000.. ఇంకా ఎక్కువ స్కిట్లు కొడితే లక్ష రూపాయలు అని ఏదో ఆషాడం ఆఫర్స్ పెట్టారంట కదా.. అందుకే వచ్చాను అంటూ తనదైన శైలిలో పంచ్ డైలాగ్ లతో అందరినీ నవ్వించే ప్రయత్నం చేశారు హైపర్ ఆది.

డబ్బులు ఇచ్చి మరీ పేదవాళ్లు కాకండి – హైపర్ ఆది

అలాగే నాగబాబు (Nagababu) గురించి మాట్లాడుతూ డబ్బులు తీసుకొని నవ్వుకొని వెళ్లే మీరు.. డబ్బులు ఇచ్చి మరీ నవ్వుకుంటున్నారా ? అంటూ అడిగిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. ఓటుకి నోటుని క్షమించని మీరు.. ఇక్కడ స్కిట్ కి నోటు ఇచ్చి మరీ ఎంకరేజ్ చేస్తున్నారా.. ? ఏది ఏమైనా ఇక్కడ డబ్బులు ఇచ్చి ఎంకరేజ్ చేసే ప్రాసెస్లో.. వాళ్లు పెద్దవాళ్ళు అవ్వకపోయినా ప్రాబ్లం లేదు కానీ మీరు పేదవాళ్లు మాత్రం అవ్వకండి సార్ అంటూ తనదైన పంచ్ ప్రాసలో అదరగొట్టేశారు ఆది. మొత్తానికి అయితే ఆది రీఎంట్రీ కి సంబంధించిన ఎపిసోడ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

Related News

Nindu Noorella Saavasam Serial Today Episode July 29th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి ప్లాన్‌ సక్సెస్‌ – పిల్లలన చంపనున్న ప్రచండ

Karthika Deepam 2 Serial Today Episode July 29th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పారిజాతం తనకు అమ్ముడుపోయిందన్న మాలిని    

Gundeninda GudiGantalu Today episode: శృతితో గొడవపడ్డ రవి.. మీనా పై బాలు ప్రశంసలు..రోహిణి ప్లాన్ సక్సెస్..

Podarillu Today Episode : చక్రీ ప్లాన్ రివర్స్.. శైలుకు పెళ్లిచూపులు.. శైలు ఇంట్లో ఇంత రచ్చనా..?

Illu Illalu Pillalu Today Episodes: విడిపోయిన ధీరజ్, ప్రేమ.. పుట్టింటికి వెళ్లిన ప్రేమ.. వల్లి ప్లాన్ సక్సెస్..

Brahmamudi Serial Today Episode July 29th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రేఖకు షాక్ ఇచ్చిన రాజు   

Intinti Ramayanam Today Episode: పల్లవి సేఫ్.. అవనిపై అక్షయ్ సీరియస్.. పల్లవిలో ఇంతమార్పేంటి..?

Big Stories

Advertisement
×