Chicken Price Hike: మాంసం ప్రియులకు షాకింగ్.. పెరిగిన చికెన్ ధరలు.. అయితే సాధారణంగా కార్తీక మాసంలో తగ్గే చికెన్ ధరలు తెలుగు రాష్ట్రాల్లో ఈసారి తగ్గడం లేదు.. నేడు ఆదివారం కావడంతో పలు ప్రాంతాల్లో ధరలు పెరిగాయి. హైదరాబాద్ స్కిన్ లెస్ చికెన్ కిలో రూ. 210 – 250 ఉంది. కామారెడ్డిలో కిలో రూ. 260, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కిలో రూ.210 – 240, విజయవాడలో కిలో రూ. 250, ఏలూరులో కిలో రూ.220, విశాఖలో కిలో రూ. 260గా కొనసాగుతోంది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. కార్తీక మాసం హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన నెలగా పరిగణించబడుతుంది. ఈ మాసంలో శివుడు, విష్ణుమూర్తి ఆరాధనలు, నదీస్నానాలు, దీపారాధనలు, తులసి వ్రతాలు వంటి ఆచారాలు పాటించబడతాయి. ముఖ్యంగా, ఈ మాసంలో మాంసాహారాన్ని పూర్తిగా దూరంగా పెట్టుకునే సంప్రదాయం ఉంది. దీని కారణంగా చికెన్ వంటి మాంస పదార్థాలపై డిమాండ్ గణనీయంగా తగ్గుతుంది, ఫలితంగా ధరలు సాధారణంగా 20-30% వరకు పడిపోతాయి. అయితే, ప్రస్తుతం చికెన్ ధరలు తగ్గకుండా భారీగా పెరిగాయి. ఇది మాంసాహార ప్రియులకు షాక్‌గా మారింది.
పలు ప్రాంతాల్లో చికెన్ ధరలు ఇలా..
హైదరాబాద్ : 210 – 250
కామారెడ్డి : 260
ఉమ్మడి ఖమ్మం జిల్లా : 210 – 240
విజయవాడ : 250
ఏలూరు : 220
విశాఖపట్నం : 260
వరంగల్ : 230 – 245
గుంటూరు : 240 – 255
Also Read: మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు ముంచుకొస్తున్న ముప్పు..