Post Office Schemes: అంతర్జాతీయ పవనాల మధ్య స్టాక్‌మార్కెట్ ఒడిదుడుకులకు లోనవుతుంది. ముఖ్యంగా ట్రంప్ సర్కార్ తీసుకున్న నిర్ణయాలు ప్రపంచ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఫలితంగా స్టాక్‌మార్కెట్ సూచీలు నేలబారు చూస్తున్నాయి. ఇక బ్యాంకులు ఇచ్చే వడ్డీ రేట్లు క్రమంగా తగ్గిపోతున్నాయి.
ఉన్న డబ్బులను కొంతైనా పొదుపు చేస్తే ఫ్యూచర్‌లో పిల్లలకు కలిసి వస్తుందని భావిస్తున్నారు మధ్య తరగతి ప్రజలు. దీంతో సామాన్యుల దృష్టి పోస్టాఫీసు పథకాలపై పడ్డాయి. ఎందుకంటే అక్కడ పథకాలన్నీ కేంద్రప్రభుత్వానివే. పెట్టుబడి భరోసా ఉండడమే కాదు.. పన్ను మినహాయింపు ఉంటుంది. ప్రస్తుతం ఓ ఐదు పథకాలపై ఓలుక్కేద్దాం.
1. పోస్టాఫీసు టైమ్ డిపాజిట్ స్కీమ్. ఈ పథకంలో ఎవరైనా పెట్టుబడి పెట్టవచ్చు. మినిమమ్ వెయ్యి రూపాయలు పెట్టుబడిగా పెట్టాలి. ప్రతీ ఏడాది వడ్డీ పెరుగుతూ ఉంటుంది. వడ్డీ ప్రతీ ఏడాది మన బ్యాంకు అకౌంట్లో పడుతుంది. ఆపై ట్యాక్స్ బెనిపిట్ కూడా ఉంటుంది. తొలి ఏడాదికి 6.9 శాతం వడ్డీ ఇస్తుంది. మరుసటి ఏడాదికి 7 శాతం, మూడేళ్లకు 7.1 శాతం, ఐదేళ్లకు 7.5 శాతం వడ్డీ ఇవ్వనుంది.
2. నేషల్ సేవింగ్ సర్టిఫికెట్ స్కీమ్. ఒక్కసారిగా పెట్టుబడి పెట్టాలి. ఈ పథకంలో ఒకేసారి పెట్టుబడి పెట్టాలి. మనకు అవసరమైనప్పుడు తీయడానికి కుదరదు. మనం పెట్టిన టైమ్ వరకు ఉండాల్సిందే. ఐదేళ్లకు వడ్డీ 7.7 శాతంగా ఉంటుంది.
3. పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్. ఇందులో వడ్డీ రేటు 7.4 శాతంగా ఉంది. ఐదేళ్లు ఉంచాల్సిందే.. అవసరమైనప్పుడు తీసుకోవాలంటే బ్యాంకు మాదిరిగా కురదరు. ఒకరు సొంతంగా 9 లక్షల వరకు పొదుపు చేయవచ్చు. జాయింట్‌గా అయితే 15 లక్షల వరకు వేసుకోవచ్చు. ప్రతీ నెల వడ్డీ మన అకౌంట్లో జమ అవుతుంది.
4. సుకన్య సంవృద్ధి యోజన పథకం. ఇది అందరికీ తెల్సిందే. కాకపోతే ఆడ పిల్లలకు మాంచి ఉపయోగం కూడా. పదేళ్ల లోపు బాలికలకు మాత్రమే. మినిమమ్ 250 రూపాయల నుంచి లక్షన్నర వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ప్రతీ నెల ఎంతో కొంత వేసుకోవచ్చు. దీనికి వడ్డీ 8.2 శాతంగా ఉంది. 18 ఏళ్ల నుంచి 21 ఏళ్లలోపు ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఈ పథకాలకు గవర్నమెంట్ భరోసా ఉంటుంది.
5. నేషనల్ సిటిజన్ సేవింగ్ స్కీమ్. ప్రభుత్వ ఉద్యోగులకు ఆదాయం వచ్చే పథకం.ఈ స్కీమ్‌కి వయస్సు 60 ఏళ్లు పైన ఉండాలి. వెయ్యి నుంచి 30 లక్షల వరకు పెట్టుబడి పెట్టుకోవచ్చు. వడ్డీ రేటు 8.2 శాతం ఉంటుంది. ప్రతీ మూడు నెలలకు వడ్డీ డబ్బులు బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. రిటైర్మైంట్ అయినవారికి బెస్ట్ బెనిఫిట్ స్కీమ్. పరిస్థితుల బట్టి వడ్డీ రేట్లు మారవచ్చు. దీనికి సంబంధించి పూర్తి డీటేల్స్ అందుబాటులో ఉన్న పోస్టాఫీసును సంప్రదించాలి.