Rajendra Prasad : నటకిరీటి రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad ) గత కొంతకాలంగా కాంట్రవర్సీ మాటలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఈమధ్య కాలంలో మరీ ఎక్కువగా హీరో, హీరోయిన్లు, కమెడియన్ల పై అభ్యంతరకర కామెంట్లు చేస్తూ అటు అభిమానులలో కూడా వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. అందులో భాగంగానే ఇటీవల ఎస్వీ కృష్ణారెడ్డి(SV Krishna Reddy) పుట్టినరోజు వేడుకలలో భాగంగా ప్రముఖ కమెడియన్ అలీ (Comedian Ali) ని ఉద్దేశించి ఆయన ఉపయోగించిన అసభ్యకర పదజాలం అటు సోషల్ మీడియాలో ఇటు అభిమానులలో పూర్తి అసహనానికి గురిచేసింది. వెంటనే రాజేంద్రప్రసాద్ క్షమాపణ చెప్పాలి అని కూడా కొంతమంది కామెంట్లు చేశారు. అయితే ఈ మాటలు రాజేంద్రప్రసాద్ వరకు చేరడంతో దీనిపై స్పందించిన ఆయన.. క్షమాపణ చెప్పకపోగా..” నేను ఇలాగే మాట్లాడుతాను. నేను మారను. ఏం చేసుకుంటారో చేసుకోండి”.. అంటూ కాస్త గట్టిగానే సమాధానం చెప్పారు.
రోజాపై కూడా రాజేంద్రప్రసాద్ అసభ్యకర పదజాలం..
దీంతో రాజేంద్రప్రసాద్ పైన విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.. కమెడియన్ అలీ స్పందిస్తూ..” ఆయన తల్లి లాంటి కూతురు పోయిన పుట్టెడు దుఃఖంలో ఉన్నారు. ఆయన గొప్ప ఆర్టిస్టు. ఆయన కావాలని మాట్లాడిన మాటలు కాదు. సరదాగా ఆ మాటలు ఆయన నోటి నుండి వచ్చాయి. దయచేసి మీడియా దీనిని ఎక్కువ నెగెటివిటీ చేయకండి.. ఇక్కడితో ఆపివేయండి” అంటూ కామెంట్లు చేశారు. అయితే రాజేంద్రప్రసాద్ ఆ వేడుకలో అలీని మాత్రమే కాదు ప్రముఖ సీనియర్ స్టార్ హీరోయిన్, మాజీ మంత్రి రోజా (Roja) పై కూడా అసభ్యకర పదజాలం ఉపయోగించడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రాజేంద్రప్రసాద్ తన మాటల్లో భాగంగా..”దాన్ని కూడా ఇండస్ట్రీకి నేనే పరిచయం చేశాను” అంటూ కామెంట్ చేశారు. సాధారణంగా ఎంతటి వారైనా సరే మహిళలను గౌరవించాలి. అందులోనూ రోజా ఒక స్టార్ హీరోయిన్, పైగా మాజీ మంత్రి. అలాంటి ఆవిడను పట్టుకొని బహిరంగంగా దాన్ని దీన్ని అని సంబోధించడం అటు ఎవరికీ కూడా నచ్చడం లేదు.
రోజా స్పందించకపోవడం వెనుక కారణం?
ఈ మాటలు విన్న తర్వాత అలీ లాగే రోజా కూడా ఏదైనా స్పందించి అటు పాజిటివ్ గానో ఇటు నెగిటివ్ గానో కామెంట్లు చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పటివరకు రోజా ఆ మాటలపై స్పందించకపోవడంతో పలు రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పైగా రాజేంద్రప్రసాద్ వేదికపై మాట్లాడేటప్పుడు శ్రీకాంత్ (Srikanth)పక్కనే ఉన్న ఈమె ఆ మాటలకు నవ్విందే తప్ప ఎటువంటి రియాక్షన్ ఇవ్వలేదు. మరి అన్ని మాటలు అన్నా.. ఆమె ఎందుకు అంత తేలికగా తీసుకుంది.. అంటూ ఒక వర్గం ఆడియన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఇక రాజేంద్రప్రసాద్ వయసులో చాలా పెద్దవారు. అంటే తప్పేముంది అని అనుకొని రోజా సైలెంట్ గా ఉన్నారా? లేక ఏదైనా స్పందిస్తే నెగెటివిటీ వస్తుందేమో? అని భయపడ్డారా అనే విషయం పై అటు నెటిజెన్స్ కూడా ఆరా తీస్తున్నారు. మొత్తానికైతే రాజేంద్రప్రసాద్ మాటలకు రోజా నుండి ఏదైనా స్పందన వస్తుంది అనుకున్నవారికి మాత్రం నిరాశ మిగిలిందని చెప్పవచ్చు. మరి ఇప్పటికైనా రోజా రాజేంద్రప్రసాద్ తనపై చేసిన కామెంట్స్ కి స్పందిస్తుందేమో చూడాలి.
ALSOR EAD:Tollywood: ఆ పార్ట్ కి సర్జరీ చేయించుకోమని బలవంత పెట్టారు.. చైల్డ్ యాక్టర్ ఎమోషనల్ కామెంట్!