BigTV English

Phone Tapping Case: బీఆర్ఎస్ పక్కా ప్లాన్! ప్రభాకర్ రావు నోరు తెరిస్తే వాళ్లకు జైల్లో చిప్పకూడే?

Phone Tapping Case: బీఆర్ఎస్ పక్కా ప్లాన్! ప్రభాకర్ రావు నోరు తెరిస్తే వాళ్లకు జైల్లో చిప్పకూడే?

Phone Tapping Case: తెలంగాణ లో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. కీలక నిందితుడు ప్రభాకర్ రావు యూఎస్ నుంచి భారత్ కి వస్తుండటంతో.. ఈ కేసు ఒక కొలిక్కి వచ్చినట్టేనా? ఏంటీ కేసు? దీని పూర్వాపరాలు ఎలాంటివి. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు విదేశాలకు వెళ్లడానికి గల కారణాలేంటి? ఇప్పుడాయన రావడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది? జూన్ 5న ప్రభాకర్ రావు విచారణ సందర్భంగా ఫోన్ ట్యాపింగ్ కేసు ఒక పరిశీలన.


14 నెలలుగా USలో ప్రభాకర్ రావు

బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వచ్చే యత్నంలో భాగంఫోన్ ట్యాపింగ్ లో కీలక నిందితుడు, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు ఎట్టకేలకు భారత్ వస్తున్నారు. గత 14 నెలలుగా అమెరికాలో ఉన్న ఆయన.. ఫైనల్లీ ఇండియా చేరుకుంటున్నారు. జూన్ ఐదున విచారణకు హాజరుకానున్నారు. ఈ దిశగా ప్రత్యేక దర్యాప్తు బృందానికి సమాచారం ఇచ్చారు.


ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు

ప్రభాకర్ రావు భారత్ కి రానుండటంతో.. పూర్తి విచారణకై ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం. ఇప్పటికే అందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంది. ఇక్కడిలాంటి పరిస్తితి ఉంటే… ప్రభాకర్రావు భారత్ కి రావడం అనే ఎపిసోడ్లో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి.

మే 9న సుప్రీంని ఆశ్రయించిన ప్రభాకర్ రావు

ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇస్తేనే ఇండియా వస్తానని హైకోర్ట్ లో పిటిషన్ దాఖలు చేశారు ప్రభాకర్ రావు. ఈ కేసులో ఇరు పక్షాల సుదీర్ఘ వాదనలు విన్న కోర్టు.. మే 2న తీర్పునిచ్చింది. ప్రభాకర్ రావు ముందస్తు బెయిలు ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది. ఈ తీర్పును సవాలు చేస్తూ ప్రభాకర్ రావు మే 9న సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తనపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదనీ.. తాను కేవలం చికిత్స నిమిత్తం మాత్రమే అమెరికా వచ్చాననీ.. ముందస్తు బెయిల్ వస్తే స్వదేశానికి తిరిగి వస్తానని ఆయన తరఫు న్యాయవాది అపెక్స్ కోర్టుముందు విన్నవించారు.

తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకూ..

ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీం కోర్టు.. ఈ కేసులో తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకూ ప్రభాకర్ రావును అరెస్టు చేయకూడదంటూ.. దర్యాప్తు బృందాన్ని ఆదేశించింది. దీంతో ప్రభాకర్ రావు భారత్ వచ్చేందుకు మార్గం సుగమం అయ్యింది. ఇప్పటికే ప్రభాకర్ రావు పాస్ పోర్టును కేంద్రం రద్దు చేసింది. అయితే సుప్రీం ప్రభాకర్ రావు పాస్ పోర్టు పునరుద్దరించాలని ఆదేశించింది. దీంతో ఎమర్జెన్సీ ట్రాన్సిట్ పర్మిట్ కోసం.. అమెరికాలోని ఇండియన్ ఏంబసీని కలిశారు ప్రభాకర్ రావు. సింగిల్ ఎంట్రీ పర్మిట్ తో ప్రభాకర్ రావు తిరిగి హైదరాబాద్ వచ్చేలా తెలుస్తోంది.

ప్రభాకర్ రావు విచారణతో కేసులో స్పష్టత

ఫోన్ ట్యాపింగ్ కేసు వెలుగులోకి వచ్చిన వెంటనే ప్రభాకర్ రావు.. దేశం విడిచి వెళ్లారు. సంవత్సర కాలం పైగా ఆయన అమెరికాలోనే ఉన్నారు. పాస్ పోర్టు వచ్చిన 3 రోజుల్లోగా తిరిగి భారత్ రావాలని సుప్రీం ఆదేశించడంతో.. ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. సిట్ సైతం ప్రభాకర్ రావును డీటైల్ గా విచారించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ విచారణలో ప్రభాకర్ రావు ద్వారా లభించే సమాచారం ద్వారా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.

తెలంగాణ రాజకీయాల్లో జోరుగా చర్చ

ప్రభాకర్ రావు తిరిగి భారత్ వస్తుండటంతో తెలంగాణ రాజకీయాల్లో చర్చ జోరందుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో తర్వాత పరిణామం ఏం జరగనుందో అన్న ఉత్కంఠ మొదలైంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన కీలక నేతలు, స్వపక్షంలోని అసంతృప్తి నేతల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుర్తించింది. దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించింది. ఈ విషయం ముందుగా పసిగట్టిన రిటైర్డ్ ఐపీఎస్ ప్రభాకర్ రావు అమెరికా వెళ్లిపోయినట్టు తెలిసింది. ప్రభాకర్ రావు తిరిగి వచ్చేలోగా కేసులో సంబంధమున్న అధికారులందరినీ ఇప్పటికే అరెస్టు చేసి సమగ్ర విచారణ చేపట్టింది. ప్రభాకర్ రావు విచారణ కూడా పూర్తయితే.. ఈ కేసు ఒక కొలిక్కి వస్తుందన్న ఆశాభావంతో ఉంది దర్యాప్తు బృందం.

2016లో ఇంటెలిజెన్స్ DIGగా ప్రభాకర్ రావు

2016లో ప్రభాకర్ రావు ఇంటెలిజెన్స్ డీఐజీగా నియమితులయ్యారు. తన అధ్వర్యంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఏర్పాటు చేశారు. ఇందుకు ప్రణీత్ రావుకు బాధ్యతలు అప్పగించారు. ఈ బృందంలో రిటైర్డ్ అదనపు డీసీపీ రాధాకిషన్, అదనపు ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావు, రిటైర్డ్ అదనపు ఎస్పీ వేణుగోపాలరావుతో పాటు సీఐ భూపతి సైతం ఉన్నారు. వీరిలో ఏ1 ప్రభాకర్ రావు తప్ప అందరినీ అరెస్టు చేసింది.. దర్యాప్తు బృందం.

రేవంత్ తో సహా సినీ వ్యాపార ప్రముఖుల ఫోన్ ట్యాపింగ్

ఇంతకీ వీరిలో ఎవరెవరిది ఏయే పాత్ర అని చూస్తే.. నాటి ప్రతిపక్ష నాయకుడు, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డితో పాటు సినీ, వ్యాపార ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేశారు. ఈ మొత్తం వ్యవస్థకు సుప్రీం గా ప్రభాకర్ రావు వ్యవహరించగా.. ప్రణీత్ రావు చీఫ్‌ గా వ్యవహరించారు. ఇక తనకు అందిన సమాచారాన్ని గ్రౌండ్ లెవల్లో రాధాకిషన్ రావు పని చేసినట్టు తమ కన్ఫెక్షన్ స్టేట్మెంట్లో ఒప్పుకున్నారు.

తీవ్రవాద కార్యకలాపాల్లో కీలకంగా ఫోన్ ట్యాపింగ్

మాములుగా ప్రభుత్వ అనుమతితో చట్ట ప్రకారమే.. ఫోన్ ట్యాపింగ్ జరుగుతూ ఉంటుంది. దీన్ని తీవ్రవాద కార్యకలాపాల కట్టడికి ఎక్కువగా వాడుతుంటారు. వీటికి కూడా అతి పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. కానీ చట్ట వ్యతిరేకంగా విదేశాల నుంచి ఎక్వీప్మెంట్ తెప్పించారనీ.. సొంత ప్రయోజనాల కోసం ఈ మొత్తం వ్యవహారం నడిచినట్టుగా ఆరోపించారు పోలీసులు. వీరంతా కలసి బీఆర్ఎస్ ను తిరిగి అధికారంలోకి తేవడానికే ఈ ప్రయత్నం చేశారన్నదే ప్రధాన ఆరోపణ.

ఇప్పటి వరకూ ఫోన్ ట్యాపింగ్ లో జరిగిన కీలక పరిణామాలేంటి?

ఇప్పటి వరకూ ఫోన్ ట్యాపింగ్ లో జరిగిన కీలక పరిణామాలేంటి? ఈ ఇష్యూ ఎలా బయట పడింది? ఎవరెవరి అరెస్టు ఎప్పుడెప్పుడు జరిగింది? విచారణలో ఏం బయట పడింది? ఈ మొత్తం ఎపిసోడ్ లో కీ పాయింట్స్ ఏంటి? చట్టం ఏం చెబుతోంది? ఫోన్ ట్యాపింగ్ మెయిన్ టార్గెట్ ఏంటి?

ఇక్కడే బుక్ అయిన ప్రణీత్ రావు

1988లో నాటి కర్ణాటక సీఎం హెగ్డే ఈ ఆరోపణలపై రాజీనామాగత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడంతో.. తమ అక్రమాలు ఎక్కడ బయట పడతాయో అన్న ఆందోళన కొద్దీ.. ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు ధ్వంసం చేసే యత్నం చేశారు.. ప్రణీత్ రావు. ఇక్కడ ఆయన అడ్డంగా దొరికిపోయారు. 2023 డిసెంబర్ 4వ తేదీ తన ఇంటెలిజెన్స్ ఆఫీస్ లో ట్యాపింగ్ యంత్రాన్ని.. ధ్వంసం చేయడం, హార్డ్ డిస్కులు తీస్కెళ్లడంతో ఈ వ్యవహారం మొత్తం వెలుగులోకి వచ్చింది. దీనిపై కేసు నమోదయ్యి దర్యాప్తు ప్రారంభమైంది.

సుమారు 50 హార్డ్ డిస్క్ లు లేకుండా చేసే యత్నం

అప్పటికి ప్రణీత్ రావు సిరిసిల్ల డీఎస్పీగా ఉన్నారు. తానే స్వయంగా SIB సీసీ కెమెరాలు ఆపేశారు. అక్కడి వార్ రూములోని సుమారు 50 హార్డ్ డిస్కులు లేకుండా చేయడానికి ప్రయత్నించారు. దీనిపై పంజగుట్ట పోలీస్టేషన్లో మార్చి పదిన కేసు పెట్టారు. మార్చి 12న ప్రణీత్ అరెస్ట్ జరిగింది. ఆ తర్వాత ఒక్కో అధికారినీ అరెస్టు చేసుకుంటూ వచ్చారు.

విచారణలో నేరాన్ని అంగీకరించిన అందరూ

ఇక విచారణలో ఏం బయట పడిందో చూస్తే.. దాదాపు అందరూ నేరాన్ని అంగీకరించారు. అయితే ఇదంతా తాము చేయడానికి గల కారణం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకేనంటూ వారు చెప్పుకొచ్చారు. ఆ ఉన్నతాధికారి మరెవరో కాదు.. ప్రభాకరరావు రిటైర్డ్ ఐపీఎస్. అలాంటి ప్రభాకర్ రావు గానీ వస్తే ఈ కేసులోని చిక్కుముడులు విడిపోయేలా తెలుస్తోంది.

200 మీటర్ల దూరంలో ఉండి కాల్స్ వినే వెసలుబాటు

ఈ ఫోన్ ట్యాపింగ్ మెయిన్ టార్గెట్ ప్రత్యర్ధుల ఆర్ధిక మూలాలు గుర్తించడం.. కట్టడి చేయడం. సుమారు 200 మీటర్ల దూరంలో ఉండికాల్స్ వినగలిగేలా. ఈ టెక్నాలజీ.. సెట్ చేశారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కి టెక్నికల్ కన్సల్టెంట్ గా ఉన్న రవిపాల్ అనే వ్యక్తి ఇజ్రాయెల్ నుంచి ఈ పరికరాల తరలింపులో సహకరించినట్టు గుర్తించారు. ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ పేరిట వీటిని దిగుమతి చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇంటి దగ్గరే ఉంటూ.. ఆయన ప్రతి కాల్ విన్నట్టు సమాచారం.

2018లో టీడీపీ అభ్యర్ధి రూ. 70 లక్షలు స్వాధీనం

ఈ మొత్తం వ్యవహారం ద్వారా సాధించింది ఏంటంటే.. ఎన్నికల వేళ డబ్బు కదలికలపై నిఘా పెట్టడం. ప్రత్యర్ధి పార్టీ లీడర్ల డబ్బు సీజ్ చేయడం. 2018- ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధికి చెందినవిగా చెబుతోన్న 70 లక్షల రూపాయలు ఇలాగే స్వాధీనం చేసుకున్నారు. 2020- దుబ్బాక ఉప ఎన్నిక టైంలో రఘునందనరావుకు చెందిన కోటి రూపాయల మొత్తం ఇలాగే స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. 2022- మునుగోడు ఉప ఎన్నిక టైంలో కోమటిరెడ్డి అనుచరులపై నిఘా పెట్టి మూడు కోట్లు స్వాధీనం చేసుకున్నట్టూ గుర్తించారు.

2023 చివర్లో నాయకులు, వ్యాపారుల ఫోన్లు ట్యాప్

ఎన్నికల వేళ బీఆర్ఎస్ కి అవసరమయ్యే డబ్బును పోలీస్ టాస్క్ ఫోర్స్ వాహనాల్లో తరలించినట్టు తెలుసుకున్నారు.. వ్యాపారులు, నాయకుల ఫోన్లపై నిఘా పెట్టి ఈ సమాచారం ఆధారంగా వారి నుంచి డబ్బు వసూళ్లు చేసినట్టు గుర్తించారు.. సినీ ప్రముఖులు, పలువురు లీడర్ల కుటుంబ సభ్యులు, సొంత పార్టీ లీడర్లు, పోలీసు ఉన్నతాధికారుల ఫోన్ కాల్స్ కూడా విన్నట్టు ఆరోపణలున్నాయి. 2023 చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వివిధ నాయకులు, వ్యాపారులు ఇతర ప్రముఖుల ఫోన్లు సైతం ట్యాప్ అయినట్టు విచారణలో తేల్చారు.

1988లో నాటి కర్ణాటక సీఎం హెగ్డే ఈ ఆరోపణలపై రాజీనామా

టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం ఫోన్ ట్యాపింగ్ నేరం. ఇప్పటి వరకూ భారత్ లో ఈ దిశగా కేసులు పెట్టలేదు. దీన్నిబట్టీ చూస్తే దేశంలోనే తొలిసారి.. ఈ కేసుపెడుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ ఐటీ సెక్షన్ 66 కింద, ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 2007, సెక్షన్ 419 ఏ కింద ఇతరుల గోప్యతా హక్కు హరించడం నేరం. 1988లో కర్ణాటక కర్ణాటక ముఖ్యమంత్రి హెగ్డే ఈ ట్యాపింగ్ ద్వారానే రాజీనామా చేయాల్సి వచ్చింది.

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×