సాధించాలనే తపన, అకుంఠిత దీక్ష సామాన్యులను అసామాన్యులుగా తీర్చుదిద్దుతాయి. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ జ్యోతి బన్సల్. కంప్యూటర్ సైన్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి.. జాబ్ కోసం అమెరికాకు వెళ్లిన ఆయన.. గ్రీన్ కార్డు పొందిన తర్వాత జాబ్ కు రిజన్ చేశాడు. ఇప్పుడు ఆయన వేల కోట్లకు అధినేతగా మారాడు. తాజాగా ఆయన గురించి ప్రఖ్యాత మ్యాగజైన్ బిజినెస్ ఇన్ సైడర్ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఇందులో ఆయన సాధారణ ఉద్యోగి నుంచి బిలియనీర్ గా ఎలా ఎదిగాడు అనే విషయాన్ని ప్రస్తావించింది.
బన్సల్.. యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ చదవుతున్న రోజుల్లోనే స్టార్టప్స్ పట్ల ఆసక్తి కనబర్చాడు. “నేను చదువుకునే రోజుల నుంచి స్టార్టప్‌ల పట్ల ఇంట్రెస్ట్ కలిగింది. అత్యుత్తమ సేవలు, సాంకేతికత, ఉద్యోగాలను అందించే కంపెనీని సాధించాలని భావించాను” అని చెప్పుకొచ్చాడు. ప్రపంచ ఆవిష్కరణల కేంద్రంగా ఉన్న సిలికాన్ వ్యాలీలో తనకంటూ ఓ అధ్యాయాన్ని లిఖించుకున్నాడు.
బన్సల్ 2000లో 21 సంవత్సరాల వయస్సులో H-1B వీసాను పొందాడు. ఆ తర్వాత దాదాపు 30 మంది ఉద్యోగులతో కలిసి సిలికాన్ వ్యాలీ స్టార్టప్ లో పని చేశాడు. అదే సమయంలో బన్సల్ తన సొంత కంపెనీని ప్రారంభించాలని భావించాడు. ఆ తర్వాత అతడికి H-1B వీసా లభించింది. ఆ తర్వాత తన ఉద్యోగాన్ని వదులుకున్నాడు. ఆ తర్వాత యాప్ డైనమిక్స్ అనే కంపెనీని ప్రారంభించాడు. 2008లో స్థాపించిన ఈ సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్ సంస్థ శరవేగంగా అభివృద్ధి చెందింది. వ్యాపారాలు అప్లికేషన్లను పర్యవేక్షించడానికి, ఆప్టిమైజ్ చేయడానికి ఎంతో సహాయపడింది.
అనేక స్టార్టప్‌ల మాదిరిగానే, యాప్ డైనమిక్స్ స్టార్టింగ్ రోజులలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. ఆ కంపెనీ తక్కువ కాలంలోనే అత్యంత వేగంగా విస్తరించింది. గరిష్టంగా దాదాపు 2,000 మందికి ఉపాధి కల్పించింది. 2017లో సిస్కో యాప్ డైనమిక్స్ ను 3.7 బిలియన్ డాలర్లకు.. అంటే భారతీయ కరెన్సీలో సుమారు రూ.24,079 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ ఒప్పందం సిలికాన్ వ్యాలీలో బన్సాల్ స్థాయిని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లింది.
బన్సాల్ ప్రస్తుతం పలు స్టార్టప్ కంపెనీలను లీడ్ చేస్తున్నారు. ఆయన తాజా కంపెనీ హార్నెస్ లో 1,300 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. సాఫ్ట్ వేర్ డెలివరీ ఆటోమేషన్ పై ఈ కంపెనీ దృష్టి పెట్టింది. ఆయన వెంచర్ క్యాపిటల్ సంస్థ, మరొక టెక్ కంపెనీని కూడా నడుపుతున్నారు. ఆయనకు గ్రీన్ కార్డు వచ్చినప్పటికీ, దాదాపు 4,000 మంది ఉద్యోగులను నియమించుకున్నాడు.
శాశ్వత నివాసిగా ఐదు సంవత్సరాలు అమెరికాలో పని చేసిన తర్వాత అతడికి అమెరికా పౌరసత్వం లభించింది. కానీ, అతడు తన ప్రొఫెషనల్ టార్గెట్ లో ఏ మార్పులు చేయలేదు. భారత్ లో స్టార్టప్ ల పట్ల ఆయనకున్న ఇష్టం.. ఇప్పుడు అమెరికాలో మల్టీ బిలియన్ డాలర్ల సంస్థను నిర్మించే వరకు తీసుకెళ్లింది. జ్యోతి బన్సాల్ స్టోరీ పట్టుదల, దృక్పథం, ప్రపంచ ఆవిష్కరణ శక్తికి నిదర్శనంగా నిలిచింది.
Read Also: అక్టోబర్ 29 లోపే సెలవులు తీసుకుని ఎంజాయ్ చేసేయ్యండి.. ఖగోళ శాస్త్రవేత్త హెచ్చరిక!