Calcium Rich Foods: కాల్షియం అనేది మన శరీరానికి అత్యంత ముఖ్యమైన ఖనిజాలలో ఒకటి. ఇది ఎముకలు, దంతాల నిర్మాణానికి అంతే కాకుండా కండరాల సంకోచానికి, నరాల పనితీరుకు కీలక పాత్ర పోషిస్తుంది. సాధారణంగా.. పాల ఉత్పత్తులు కాల్షియానికి ప్రధాన వనరుగా భావిస్తారు. పాలు, పాల పదార్థాలకు మించిన అనేక అద్భుతమైన ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. పాలు కాకుండా.. అధికంగా కాల్షియం అందించే 9 ఆహారాల గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కాల్షియం అధికంగా ఉండే ఆహారం:
నువ్వులు : చిన్నగా ఉన్నప్పటికీ.. నువ్వులు కాల్షియం యొక్క శక్తి కేంద్రం. ముఖ్యంగా .. తెల్ల నువ్వుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. కేవలం ఒక టేబుల్‌స్పూన్ నువ్వులు.. ఒక గ్లాసు పాలలో ఉండే దానికంటే ఎక్కువ కాల్షియంను అందిస్తాయి. వీటిని సలాడ్‌లపై.. వంటకాలలో లేదా నువ్వుల పచ్చడిగా తీసుకోవచ్చు. ఇలా తీసుకోవడం ద్వారా అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి.
చియా సీడ్స్: ఈ చిన్న చిన్న విత్తనాలలో కాల్షియం, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, ప్రొటీన్ అధికంగా ఉంటాయి. కేవలం రెండు టేబుల్‌స్పూన్ల చియా సీడ్స్‌లో పుష్కలంగా కాల్షియంను లభిస్తుంది. వీటిని స్మూతీస్‌లో.. పెరుగులో లేదా ఇతర ఆహార పదార్థాలలో కలిపి తీసుకోవడం చాలా ఆరోగ్యకరం.
రాగులు: రాగులు చాలా మంది ఉపయోగించే.. ఒక సూపర్‌ఫుడ్. ఇవి సహజంగా అధిక కాల్షియంను కలిగి ఉంటాయి. ముఖ్యంగా పిల్లలకు, వృద్ధులకు రాగులతో చేసిన అంబలి లేదా రాగి రొట్టెలు ఎముకల బలానికి చాలా మంచివి.
తోటకూర / లీఫ్ క్యాబేజీ: తోటకూర, కాలే వంటి ఆకుపచ్చని కూరగాయలలో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. ఒక కప్పు వండిన తోటకూర మంచి మొత్తంలో కాల్షియంను అందిస్తుంది. ఈ ఆకు కూరల్లోని కాల్షియంను శరీరం సులభంగా శోషించుకుంటుంది.
టోఫు : సోయా పాల నుంచి తయారుచేసే టోఫు, కాల్షియం సల్ఫేట్‌తో తయారు చేసే కాల్షియంకు అద్భుతమైన వనరుగా పనిచేస్తుంది. వెజిటేరియన్స్‌కు ఇది ఉత్తమమైన ప్రొటీన్, అంతే కాకుండా కాల్షియం ప్రత్యామ్నాయం.
Also Read: మనం నిద్రపోతున్నప్పుడు.. శరీరంలో జరిగే 20 మార్పులు ఇవే !
బాదం పప్పు: అన్ని గింజలలో కెల్లా బాదం పప్పులలో కాల్షియం స్థాయి ఎక్కువగా ఉంటుంది. ఒక గుప్పెడు బాదంలో కాల్షియంతో పాటు ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్ ఇ కూడా లభిస్తాయి.
ఎముకలతో కూడిన క్యాన్డ్ చేపలు: మాంసాహారులకు.. చిన్న ఎముకలతో కూడిన సార్డిన్, సాల్మన్ చేపలు కాల్షియం యొక్క అద్భుతమైన వనరులు. వాటిలోని మృదువైన ఎముకలను తినడం ద్వారా కాల్షియం లభిస్తుంది. ఇవి విటమిన్ డి, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ను కూడా అందిస్తాయి.
బ్రోకలీ : బ్రోకలీలో కాల్షియం, విటమిన్ సి, విటమిన్ కె సమృద్ధిగా ఉంటాయి. ఇందులో కాల్షియం జీవ లభ్యత ఎక్కువగా ఉండటం వల్ల,, శరీరం దీన్ని సమర్థవంతంగా గ్రహిస్తుంది.
ఎండు అంజీర్: ఎండిన అంజీర్ పండ్లు కాల్షియంతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్‌ను కూడా అందిస్తాయి. ఇవి స్వీట్‌నర్‌గా లేదా ఆరోగ్యకరమైన స్నాక్‌గా కూడా ఉపయోగపడతాయి.