E-Paper
Advertisement

Viral Video: సీజన్‌తో పనిలేదు.. ఈ బామ్మ దగ్గర 365 రోజులు మామిడి పండ్లు దొరుకుతాయ్, అందుకు ఏం చేస్తోందంటే?

Viral Video: సీజన్‌తో పనిలేదు.. ఈ బామ్మ దగ్గర 365 రోజులు మామిడి పండ్లు దొరుకుతాయ్, అందుకు ఏం చేస్తోందంటే?

Mango Fridge:

భారత్ లో ఎక్కువ మంది ఇష్టపడే పండ్లలొ మామిడి కూడా ఉంటుంది. కింగ్ ఆఫ్ ఫ్రూట్ గా గుర్తింపు తెచ్చుకున్న మామిడిని వేసవిలో ఎంతో ఇష్టంగా తింటారు. ఈ సీజనల్ మామిడి రుచి చూస్తూ మైమరచిపోతారు. కొంత మంది సీజన్ తో సంబంధం లేకుండా ఏడాదంతా మామిడి పండ్లను తినాలనుకుంటారు. అలాంటి మ్యాంగో లవర్స్.. మామిడి ముక్కలను ఎక్కువ కాలం నిల్వ చేయడానికి ప్రయత్నిస్తారు. అలాంటి కోవలోకి చెందుతుంది కేరళకు చెందిన ఓ బామ్మ. సాధారణంగా ఫ్రిజ్ లో నాలుగైదు మామిడి పండ్లను ఉంచుతారు. మరికొంత మంది10, 15కు పెంచుతారు. కానీ, ఈ బామ్మ ఫ్రిజ్ అంతా రకరకాల మామిడి పండ్లతో నింపేసింది. తాజాగా ఆమె ఫ్రిజ్ వీడియోను తన మనవరాలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ఫ్రిజ్ నిండా మామిడి పండ్లే!

కీర్తన స్మిత షాజీ షేర్ చేసిన ఇన్ స్టా రీల్‌ లో..ఆమె అమ్మమ్మ రకరకాల అవసరాల కోసం ఫ్రీజ్ చేసిన మామిడి పండ్లను నింపిన బోలెడు ప్లాస్టిక్ సీల్డ్ బ్యాగులను ఫ్రిజ్ లో ఉంచినట్లు చూపించింది. కీర్తన అమ్మమ్మ ఒక ప్యాకెట్ పట్టుకుని, అది ఒక  రకమైన మామిడి కూర తయారీకి ఉపయోగించే మామిడి ముక్కలు అని చెప్పింది. మరొక బ్యాగులో పండిన మామిడి ముక్కలను ఉంచింది. ఇంకో షెల్ఫ్‌ లో ఉన్న మామిడి ప్యాకెట్లను చూపిస్తూ, అవి చేపల కూరలో ఉపయోగించడానికి వాడుతామని చెప్పింది. అంతే కాదు.. అమ్మమ్మ తన మనవరాలు మరొక సెట్ తీసుకొని పప్పు, మునగకాయలు, మామిడితో కూర వండడానికి ఉపయోగించమని చెప్తుంది. ఇక ఈ రీల్ గురించి క్యాప్షన్ లో కీర్తక ఓ ఆసక్తికర విషయం చెప్పింది. “కరెంటు పోయినప్పటికీ, ఘనీభవించిన మామిడి పండ్లు 2 రోజుల వరకు చెక్కుచెదరకుండా ఉంటాయి” అని చెప్పుకొచ్చింది.

నెటిజన్లు ఏం అంటున్నారంటే?

వైరల్ వీడియోలో అమ్మమ్మ మామిడి ఫ్రిజ్ చూసి చాలా మంది మ్యాంగో లవర్స్ నోటిలో లాలాజలం వచ్చేస్తోంది. చాలా మంది తమ పిల్లల కోసం అమ్మమ్మలు, నాన్నమ్మలు ఈ సీజనల్ పండ్లను పెద్దమొత్తంలో నిల్వ చేసే అలవాటు ఉంటుందని చెప్తున్నారు. “ఫ్రిజ్‌లో మొత్తం మామిడి సీజన్ కనిపిస్తోంది” అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. “శ్రమ, ప్రణాళిక, క్రమశిక్షణ, ఆలోచన అద్భుతం” అంటూ మరో వ్యక్తి ప్రశంసించారు.  “మా అమ్మ నా కోసం ఇలాగే నిల్వ చేస్తుంది. నేను వచ్చేవరకు  కోసం వేచి ఉంటుంది. ఆమె నా కోసం ఎన్నో రకాల మామిడి పండ్లను స్టోర్ చేస్తుంది. ఆమె ప్రేమ నా మీద పండ్ల రూపంలో చూపిస్తుంది” అని ఓ నెటిజన్ రాసుకొచ్చారు.”దేశంలో మామిడికాయల కొరత ఉన్నప్పటికీ.. ఈ బామ్మను ఎలాంటి ప్రభావం చూపించదు” అని ఇంకో నెటిజన్ రాసుకొచ్చాడు. ఈ రీల్ కు ఇప్పటి వరకు మిలియన్ కు పైగా వ్యూస్ వచ్చాయి.

Read Also: సౌదీలో అట్టహాసంగా దీపావళి వేడుకలు, అసలు విషయం ఏంటంటే?

Related News

ప్రభుత్వ ఉద్యోగం సాధించాడు.. కానీ డ్యూటీలో చేరే లోపే రిటైర్ అయిపోయాడు!

ఉపాధి కూలీలకు ‘గుండు’ గండం.. యాప్‌లో విచిత్ర సమస్య!

హైదరాబాద్ మెట్రోలో బరితెగించిన యువకుడు.. సీటుపై కాళ్లు పెట్టి రచ్చ రచ్చ!

వీధి కుక్కలను ఉపయోగించి విద్యుత్ తయారీ.. ఎక్కడో తెలుసా..!

ఇదెక్కడి విచిత్రం సామి! 20 ఏళ్ల తర్వాత వచ్చిన ప్రభుత్వ ఉద్యోగం.. ట్విస్ట్ ఏంటంటే?

ఐటీ జాబ్‌కు గుడ్‌బై చెప్పి.. ఆటో నడుపుతున్న మహిళ.. నెల సంపాదన తెలిస్తే షాకే!

పక్షులు తమ గూట్లో పాముల కుబుసం ఎందుకు పెట్టుకుంటాయి? అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాకే!

వైరల్ వీడియో .. కేవలం రూ. 1600 ఖర్చుతో ఏసీ.. సామాన్యుడి టాలెంట్‌కు ఫిదా అవుతున్న నెటిజన్లు!

Big Stories

×