BigTV English
Advertisement

JC Prabhakar Reddy: తాడిపత్రిలో టెన్షన్.. జేసీపై ఎస్పీ ప్లాన్ ఏంటి?

JC Prabhakar Reddy: తాడిపత్రిలో టెన్షన్.. జేసీపై ఎస్పీ ప్లాన్ ఏంటి?


అనంతపురం జిల్లాలో ఫైర్ బ్రాండ్ నాయకుడు అంటే జేసీ ప్రభాకరెడ్డి ఠక్కున గుర్తొస్తారు…మనసులో ఏది ఉంచుకోరు… తన పార్టీనా , ప్రతిపక్షమా అనేది అసలు ఆలోచించరు …తనకు తప్పు అనిపిస్తే చాలు ఎవరినైనా చీల్చి చెండాడుతారు…కానీ ఇప్పుడు సడెన్ గా ఐపీఎస్ అధికారిని టార్గెట్ చేశారా నాయకుడు .. అసలు ఐపీఎస్‌ అధికారిపై జేసీకి ఎందుకు కోపమొచ్చింది?

కోపమస్తే అందరిపై విరుచుకు పడే జేసీ ప్రభాకరరెడ్డి

జేసీ ప్రభాకర్ రెడ్డి ఈ పేరు వింటే మనకు ఠక్కున గుర్తుకువచ్చేది ఫైర్ బ్రాండ్ ఇమేజ్ …ప్రస్తుతం జెసి అంటే వైల్డ్ ఫైర్ అన్నట్లుగా తాడిపత్రిలో టాక్ నడుస్తోందట. జెసి ప్రభాకర్ రెడ్డి స్వభావమే అంత …ఆయన ఏదైనా సరే ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి. అది రాజకీయ నాయకులపైనా…అధికారులపైనా కోపం వస్తే తెగ విరుచుకుపడుతుంటారు. తను అనుకుంది గట్టిగా మాట్లాడతారు. తాజాగా ఏఏస్పీపై జేసీ ప్రభాకర్‌ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి.


ASP పై ఓ రేంజ్‌లో ఫైర్ అయిన జేసీ

జేసీ ప్రభాకర్ రెడ్డి ఎప్పుడు ఎవరిమీద విరుచుకుపడతారో తెలియని పరిస్థితి… అధికారం, ప్రతిపక్షం అనే తేడా లేకుండా అందరి మీద విమర్శల దాడి చేస్తుంటారు…మొన్నటికి మొన్న జిల్లా పంచాయతీ అధికారి DPO నాగరాజు పై చిందులేశారు… అది మరచిపోకమునుపే తాడిపత్రి ASP పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు… పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఏఎస్పీ రోహిత్‌పై జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏఎస్పీ రోహిత్‌కు చదువు మాత్రమే ఉందని.. బుద్ధి, జ్ఞానం లేదంటూ జేసీ విమర్శించారు.

ఈ ఉద్యోగానికి రోహిత్ కుమార్ చౌదరి అనర్హుడని స్పష్టం చేశారు. ఏఎస్పీ కార్యాలయం ముందు తాను నిరసన చేస్తే.. రోహిత్ బయటకు రాకుండా ఇంట్లోనే దాక్కున్నాడని ఆరోపించారు. తాడిపత్రిలో ఎక్కడైనా ఘర్షణలు జరిగి రాళ్లు రువ్వుకుంటేఏఎస్పీ భయపడి పారిపోతున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి విమర్శించారు….ఇదొక్కటే కాదు ఇలా చెప్పుకుంటే పోతే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మందిపై జేసీ విరుచుకపడ్డారు

జేసీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జిల్లా ఎస్పీ జగదీష్

ఇక ఏఎస్పీ మీద చేసిన ఆరోపణలపై జిల్లా ఎస్పీ జగదీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు…ప్రభాకర్‌రెడ్డి పై చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిజాయితీగా పనిచేసే అధికారిపై బెదిరింపు ధోరణి తగదని హితవుపలికారు. ఇలా బెదిరింపు ధోరణితో మాట్లాడటం చట్టరీత్యా నేరమన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి గన్‌ లైసెన్స్‌ పైనా లీగల్‌ ప్రొసీజర్‌ ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ జగదీష్‌ పేర్కొన్నారు… పోలీస్ అధికారుల సంఘం కూడా తీవ్రంగా ఖండించింది…వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు… సీఎం చంద్రబాబు పోలీసుల గౌరవాన్ని పెంచేలా చర్యలు తీసుకుంటే జెసి ప్రభాకర్ రెడ్డి మాత్రం పోలీసులను కించపరుస్తున్నారు అని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.. అయితే దీనిపై పార్టీ JC ప్రభాకర్ రెడ్డి కామెంట్స్ ను సీరియస్ గా తీసుకొని జేసీను కంట్రోల్ చేయాలని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది..

పోలీసుల తీరుకు నిరసనగా రోడ్డుపై జేసీ ఆందోళన

తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ ప్రభాకరరెడ్డి తనయుడు జేసీ అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికైనా…ఎక్కడా తన ప్రభావం కనిపించని పరిస్ధితి ఉందని స్థానికంగా చర్చ నడుస్తోంది. మొత్తం నియోజకవర్గంలోని వ్యవహారాలన్ని జేసీ ప్రభాకర్‌ రెడ్డి చూసుకుంటున్నారట. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జేసీ చూట్టూ రాజకీయం వివాదాలు రావడం చర్చినీయంశంగా మారింది. ఆర్టీపీసీ ప్లైయాష్ విషయంలో బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో తలెత్తిన వివాదంతో స్టార్ట్ అయిన వివాదాలు ఇంకా కంటిన్యూ అవ్వడం హాట్ టాపిక్‌గా మారింది. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని నియోజకవర్గంలోకి రాకుండా అడ్డుకోవడం…ఈ విషయంలో పోలీసులకు వార్నింగ్‌లు ఇవ్వడం…తర్వాత పోలీసులకు తీరుకు నిరసనగా రోడ్డుపైనే ఆందోళన చేయడం వంటి వాటితో జేసీ వ్యవహారం చర్చినీయంశంగా మారింది.

టీడీపీ శ్రేణులకు తలనొప్పిగా మారిన జేసీ

తాడిపత్రిలో జేసీ వ్యవహారం కాస్తా కొంత ఇబ్బందిగానే ఉందని టీడీపీ శ్రేణులు అంటున్నాయి… అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేకు తండ్రి, మున్సిపల్‌ ఛైర్మన్‌గా ఉన్న జేసీ నిత్యం ఏదో వివాదంతో టీడీపీకి కొంత తలనొప్పిగా మారిందనే టాక్ నడుస్తోందట. తరచూ వివాదాలు రావడంతోనూ సీఎం చంద్రబాబు కొంత అసహనం వ్యక్తం చేసినట్లు కూడా టాక్ నడించింది. జేసీ ప్రభాకర్ రెడ్డి తన పంథా మార్చుకోకపోవడం..తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండటంతో టీడీపీ అధిష్టానం ఆయనను కట్టడి చేసే విషయంలో తర్జనభర్జనలు పడుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

జేసీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జిల్లా ఎస్పీ జగదీష్

ఒకవైపు ఆయన దూకుడు వైఖరి, ప్రత్యర్థులపై గట్టిగా పోరాడే తత్వాన్ని పార్టీ కార్యకర్తలు కొంతవరకు స్వాగతిస్తున్నా…మరోవైపు ఆయన వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగిస్తాయనే ఆందోళన కూడా వ్యక్తమవుతోందట. పోలీసులపై జేసీ చేసిన వ్యాఖ్యలు ఏ టర్న్ తీసుకుంటాయనే చర్చ జోరుగా నడుస్తోందట. పోలీస్ అధికారులపై ఆయన వ్యాఖ్యలు చేసినప్పుడు, ఎస్పీ చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం హీట్‌ను మరింత పెంచాశాయి. చూడాలి మరి ఏం చర్యలు తీసుకుంటారో.

Story by Y. Rajashekar, Big Tv

Related News

Trolling On Jagan: బీకామ్‌లో ఫిజిక్స్.. డేటాకు మైండ్ అప్లై చేస్తే ఏఐ, అయ్యో జగన్!

Weather News: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం, కాసేపట్లో కుండపోత వాన

Kurnool Bus Incident: కర్నూలు బస్సు ఘటన.. బైకర్ శివ‌శంకర్ మృతిపై సోదరుడు షాకింగ్ కామెంట్స్

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రయాణికుల జాబితా.. ఈ హెల్ప్ లైన్ నెంబర్స్‌కు కాల్ చేయండి

Bhimavaram: ఆర్ఆర్ఆర్‌పై జనసేన ఆగ్రహం.. అంత తొందర ఎందుకో?

Jagan Sharmila: షర్మిలాను చూసైనా జగన్ నేర్చుకుంటారా? వైసీపీలో కొత్త టాపిక్ ఇదే!

Kurnool Bus Accident: కర్నూల్ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు ఎక్స్‌గ్రేషియా

Big Stories

×