Flipkart Big Billion Days: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అంటే షాపింగ్ లవర్స్ కోసం పండుగలా ఉంటుంది. ప్రతి సంవత్సరం ఫ్లిప్‌కార్ట్ ఈ సేల్‌ను గ్రాండ్‌గా నిర్వహిస్తుంది. ఈసారి కూడా ఆ ఆఫర్ల సందడి మొదలైంది. కానీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే – అసలు సేల్ మొదలయ్యేలోపే కస్టమర్లకు అందుబాటులోకి వచ్చేసింది ఇయర్‌లీ బర్డ్ డీల్స్ అంటే ముందుగానే కొన్ని సెలెక్ట్ ప్రొడక్ట్స్‌కి బిగ్ బిలియన్ డేస్ ధరలు వర్తిస్తాయి. ఇది నిజంగా కస్టమర్‌లకు పెద్ద గిఫ్ట్ లాంటిది.
సెప్టెంబర్ 8వ తేదీ రాత్రి 12 గంటల నుంచి ఈ ఇయర్‌లీ బర్డ్ డీల్స్ లైవ్‌కి వచ్చాయి. అంటే అర్థరాత్రి నుంచి ఫ్లిప్‌కార్ట్ యాప్ లేదా వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయితే, మనం కొన్ని ఎంపిక చేసిన ప్రొడక్ట్స్‌ని అసలు బిగ్ బిలియన్ డేస్ ప్రైస్‌కే కొనుగోలు చేయవచ్చు. సాధారణంగా కస్టమర్లు సేల్ మొదలు కావడానికి వేచి ఉండాలి. కానీ ఈసారి ఆ టెన్షన్ అవసరం లేదు. ముందుగానే షాపింగ్ చేయడానికి ఫ్లిప్‌కార్ట్ అవకాశం కల్పించింది.
ముఖ్యంగా మొబైల్స్, ల్యాప్ టాప్‌లు, హెడ్‌ఫోన్స్, స్మార్ట్‌వాచ్‌లు, హోమ్ అప్లయన్సెస్, ఫ్యాషన్, షూస్, యాక్సెసరీస్ ఇలా అనేక విభాగాల ప్రొడక్ట్స్ ఈ ఇయర్‌లీ బర్డ్ ఆఫర్లలో ఉన్నాయి. ధరలు నిజంగానే ఇంత తక్కువగా ఉన్నాయా? అనిపించేలా డిస్కౌంట్లు ఇందులో ఉండనున్నాయి.
Also Read: Viral News: మెట్రో స్టేషన్‌లో అడుక్కుంటున్న యువతి.. ఏం కష్టం వచ్చిందో?
ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, కొన్నిసార్లు మనకు ఇష్టమైన ప్రొడక్ట్ స్టాక్ అవుట్ అయిపోతుందేమోనని టెన్షన్ ఉంటుంది. దానిని దృష్టిలో పెట్టుకొని ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు ప్రీ బుక్ ఆప్షన్‌ను కూడా తెచ్చింది. అంటే మీరు ఇష్టమైన ప్రొడక్ట్‌ను కేవలం 1 రూపాయి చెల్లించి ముందుగానే బుక్ చేసుకోవచ్చు. తర్వాత అసలు సేల్ మొదలైనప్పుడు మిగతా మొత్తాన్ని చెల్లించి ఆ ప్రొడక్ట్‌ను చాలా సులువుగా కొనుగోలు చేయవచ్చు. ఇది నిజంగా చాలా సేఫ్ ఆప్షన్.
ఇలా ఇయర్‌లీ బర్డ్ డీల్స్ ద్వారా కస్టమర్లు ముందుగానే తమకు కావలసిన వస్తువులు తగ్గింపు ధరలకు తీసుకోవచ్చు. ఈ ఆఫర్లు తక్కువ రోజులు మాత్రమే అందుబాటులో ఉంటాయని తెలుస్తుంది. అందువల్ల ఆలస్యం చేస్తే మంచి డీల్స్ మిస్ కావాల్సి వస్తుంది.
మొత్తం మీద ఫ్లిప్‌కార్ట్ ఈసారి ఇయర్‌లీ బర్డ్ డీల్స్‌తో కస్టమర్లలో కొత్త ఉత్సాహం తీసుకొచ్చింది. అర్థరాత్రి నుంచే షాపింగ్ మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నవాళ్లకు ఇది గోల్డెన్ ఛాన్స్. ముఖ్యంగా ఎక్కువ డిమాండ్ ఉన్న మొబైల్స్, ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కోసం ఇది బెస్ట్ టైమ్ అని చెప్పొచ్చు. కాబట్టి మీరు కూడా ఫ్లిప్‌కార్ట్ యాప్ ఓపెన్ చేసి ఇయర్‌లీ బర్డ్ డీల్స్‌లో మీ ఫేవరేట్ ఐటమ్స్‌ని చూసి బుక్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డిస్కౌంట్లు ప్రతిసారీ రావు.