BigTV English

Best Mileage Bikes: తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న బైక్‌లు ఇవే..!

Best Mileage Bikes: తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న బైక్‌లు ఇవే..!

Best Mileage Bike with Low Price: ప్రస్తుతం మార్కెట్‌లో ఆటోమొబైల్స్‌దే హవా నడుస్తోంది. వాహన ప్రియులు ముఖ్యంగా మంచి సామర్థ్యవంతమైన బైక్‌లను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటి పరిస్థితిలో.. తక్కువ ధరలో మంచి శక్తివంతమైన ఇంజిన్‌, మైలేజీ కలిగిన బైక్‌ను కొనుక్కోవాలని ప్లాన్ చేస్తున్నవారు ఇక్కడ కొన్ని బైక్‌లు పరిశీలించవచ్చు. దాదాపు 125 సీసీ సెగ్మెంట్‌లో ఉన్న నాలుగు బైక్‌లు తక్కువ ధరలో అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


TVS Raider 125

ప్రస్తుతం టీవీఎస్ రైడర్ బైక్‌‌కు మార్కెట్‌లో సూపర్ డూపర్ డిమాండ్ ఉంది. ఈ టీవీఎస్ బైక్ 125 సిసి సెగ్మెంట్‌లో అందుబాటులో ఉంది. ఇది 124.8 సీసీ సామర్థ్యం గల ఇంజన్‌ను కలిగి ఉంది. 11.4 bhp, 11.22 న్యూటన్ మీటర్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్‌ ఒక లీటర్ పెట్రోల్‌తో దాదాపు 67 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది. దీని ధర రూ.95 వేల ఎక్స్-షోరూమ్ ధర నుండి మొదలవుతుంది. టాప్ వేరియంట్‌ను రూ.1.03 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో కొనుగోలు చేయవచ్చు.

Hero Xtreme 125 r

హీరో ఎక్స్‌ట్రీమ్ 125ఆర్ బైక్ అద్భుతమైన లుక్, డిజైన్‌తో వాహన ప్రియుల్ని ఆకట్టుకుంటోంది. దేశంలోనే అతి పెద్ద ద్విచక్ర వాహన తయారీదారు హీరో మోటోకార్ప్ ద్వారా ఇది అందించబడుతుంది. ఈ బైక్‌లో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 124.7 సిసి సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను అమర్చారు. దీని కారణంగా బైక్ 10.5 న్యూటన్ మీటర్ల టార్క్‌తో సహా 11.4 బిహెచ్‌పిని పొందుతుంది. ఈ బైక్ లీటర్ పెట్రోల్‌తో దాదాపు 66 కి.మీ మైలేజీని అందిస్తుంది. దీని ధర కూడా రూ.95 వేల నుంచి రూ.99,500 ఎక్స్ షోరూమ్ వరకు ఉంటుంది.


Also Read: ఎలక్ట్రిక్ స్కూటర్లపై ఆఫర్ల వర్షం.. వీటిని వదలొద్దు!

Bajaj Pulsar NS125

యూత్‌ని అట్రాక్ట్ చేయడంలో బజాజ్ పల్సర్‌ బైక్‌ ఎప్పుడూ ముందుంటుంది. అందువల్లనే కంపెనీ కొత్త కొత్త మోడళ్లను తీసుకొస్తుంది. అయితే బజాజ్ పల్సర్‌ 125ని ఎన్ సిరీస్‌లో అమ్మకానికి అందుబాటులోకి తెచ్చింది కంపెనీ. ఈ బైక్‌లో 124.45 సిసి సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను అమర్చారు. దీని కారణంగా బైక్ 12 పిఎస్, 11 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మైలేజీ పరంగా కూడా ఈ బైక్ దుమ్ముదులిపేస్తుంది. ఒక లీటర్ పెట్రోల‌తో ఈ బైక్ దాదాపు 65 కి.మీ ప్రయాణం చేస్తుంది. దీని ధర రూ.1లక్ష ఎక్స్ షోరూమ్‌గా ఉంది.

Honda SP125

125 సిసి సెగ్మెంట్‌లో ఎస్‌పి 125ని హూండా కూడా మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఈ బైక్ లీటర్ పెట్రోల్‌కు 60 కి.మీ మైలేజీని అందిస్తుంది. ఇందులో కంపెనీ 123.94 సిసి ఇంజన్‌ను అందించింది. దీని కారణంగా ఇది 10.72 బిహెచ్‌పి, 10.9 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కాగా దీని ధర రూ.86 వేల ఎక్స్ షోరూమ్ నుంచి స్టార్ట్ అవుతుంది. అందువల్ల తక్కువ ధరలో మంచి శక్తివంతమైన బైక్‌ను కొనుక్కోవాలని అనుకున్నట్లయితే వీటిని పరిశీలించవచ్చు.

Tags

Related News

SBI Card New Rules: కార్డ్ యూజర్లకు ఎస్‌బీఐ ఝలక్.. కోటి ఆఫర్ పోయినట్టే

FMCG Sales: పండగలకు స్టాక్ పెంచిన FMCG.. సామాన్యులకు లాభమా? నష్టమా?

DMart: ఇక డి-మార్ట్ కు వెళ్లాల్సిన పని లేదు.. ఇలా చేస్తే నేరుగా ఇంటికే సరుకులు!

Personal Finance: 45 సంవత్సరాలకే రిటైరయ్యి పెన్షన్ పొందుతూ లైఫ్ హాయిగా గడపాలని ఉందా..అయితే ఇలా ప్లాన్ చేసుకోండి..

Central Govt Scheme: విదేశాల్లో చదవాలని ఉందా… అయితే కేంద్ర ప్రభుత్వం అందించే రూ. 40 లక్షల లోన్ కోసం ఇలా అప్లై చేసుకోండి.

Mobile Recharge: ఎయిర్ టెల్ లోని ఈ ఆఫర్ తో రీచార్జ్ చేస్తే Netflix, Prime Video, Zee5, JioHotstar ఫ్రీగా చూసే ఛాన్స్..

Big Stories

×