Big Stories

Gautam Adani Vs Mukesh Ambani: జియోతో పోటీకి సిద్ధమవుతున్న అదానీ.. ఫ్రీగా 5జీ ఇంటర్నెట్..?

Gautam Adani
Gautam Adani

Gautam Adani Likely to Start 5G Internet Service: దేశంలో జియో గురించిప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టెలికాం పరిశ్రమలో జియో కొత్త చరిత్ర సృష్టించింది. అప్పటి నుంచి జియో తన ఏకపక్ష పాలన సాగిస్తోంది. జియో సిమ్‌ యూజర్లు దేశంలో ఏ మూలకు వెళ్లినా కనిపిస్తారు. జియో సిమ్‌లు గ్రామ గ్రామాలకు చేరుకున్నాయి. జియోకు పోటికిగా కూడా ఎవరూ లేరు. దీంతో అంబానీ టెలికాం రంగంలో అధిక లాభాలతో దూసుకుపోతున్నారు.

- Advertisement -

అయితే టెలికాం మార్కెట్‌లో మరో ప్రముఖ వ్యాపారావేత్త ప్రవేశించే అవకాశం కనిపిస్తుంది. అదానీ గ్రూప్స్ అధినేత గౌతమ్ అదానీ కంపెనీ టెలికాం మార్కెట్‌లోకి ప్రవేశించే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది. దేశంలో స్పెక్ట్రమ్ వేలం మే 20న ప్రారంభంకానుంది. దీనికి సంబంధించి నోటీసులను డీఓటీ మార్చి 8న పంపింది. స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నామని అదానీ గ్రూప్ సీఈవో గౌతమ్ అదానీ ఓ సమావేశంలో ప్రకటించారని అంటున్నారు. దీంతో స్పెక్ట్రమ్ వేలం ఈ సారి హాట్‌హాట్‌గా మారనుంది. గౌతమ్ అదానీ 5G ఇంటర్నెట్ సర్వీస్ హక్కులను పొందవచ్చని వ్యాపార నిపుణులు అంచనా వేస్తున్నారు.

- Advertisement -

గౌతమ్ అదానీ 5G ఇంటర్నెట్ సర్వీస్ స్పెక్ట్రమ్ కొనుగోలు విషయంపై ఇప్పటికే చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అత్యధిక బిడ్డర్ కూడా వేయాలనే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. అయితే దీని ద్వారా ఖచ్చితంగా వేగవంతమైన ఇంటర్నెట్ సర్వీస్ అదానీ గ్రూప్‌ అందిచగలదు. గౌతమ్ అదానీ టెలికాం రంగంలో ప్రవేశించి ఫ్రీ ఇంటర్నెట్ ద్వారా కస్టమర్లను అట్రాక్ట్ చేయనుంది. ఇది బయట వినిపించే గుసగుసలు మాత్రమే. దీనిపై మరో రెండు నెలల్లో పూర్తి స్పష్టత రానుంది.

Also Read: 10 నిమిషాల్లో 400 మంది జాబులు ఔట్..!

ఇందుకు సంబంధించిన ఓ ఫోటోను గౌతమ్ అదానీ Xలో షేర్ చేశారు. కానీ ఆయన అధికారికంగా మాత్రం ఇంకా ప్రకటన చేయలేదు. కొన్ని నివేదికలు అదానీ కొత్త కంపెనీతో టెలికాం రంగంలో అడుగుపెడతారని చెబుతున్నారు. దీని గురించి అదానీ సన్నిహితుల నుంచి కూడా ఎటువంటి సమాచారం లేదు. ఏదైమైనా అదానీ  ఈ మార్కెట్‌లోకి వస్తే ముఖేష్ అంబానీ, సునీల్ మిట్టల్ లాంటి వ్యాపారవేత్తల మధ్య గట్టి పోటీ ఉండనుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News