Big Stories

Rahul Gandhi Fires on Modi: మోదీ.. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ..? బీజేపీపై రాహుల్ గాంధీ ఫైర్..!

Rahul Gandhi

- Advertisement -

Rahul Gandhi Fired on PM Modi Regarding Jobs: కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాము అధికారంలోకి వస్తే ఏటా కోట్లలో ఉద్యోగాలు కల్పిస్తామని యువతీ, యువకులను బీజేపీ ఘోరంగా మోసం చేసిందని అన్నారు. ఉద్యోగల కల్పన విషయంలో బీజేపీ ప్రజలను తప్పుదోవ పట్టించిందని ఆరోపించారు. దేశంలో ‘ఉపాధి విప్లవం’ తీసుకురావాలన్నారు.

- Advertisement -

మాయ మాటలు, వాగ్ధానాలు చేసి బీజేపీ అధికారంలో వచ్చిందని రాహుల్ గాంధీ విమర్శించారు. బీజేపీ ప్రభుత్వ గత ఎన్నికల సమయంలో తాము అధికారంలో వచ్చిన వెంటనే ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామి ఇచ్చిందని.. అది ఇప్పుడు ఏమైందని ప్రశ్నించారు.

ప్రస్తుతం ఏ రాష్ట్రాలనికి వెళ్లినాసరే యువత ఇప్పుడు మమ్మల్ని ప్రశ్నిస్తోందని తెలిపారు. ప్రధాని మోదీ జీ యువతకు ఉపాధి కల్పించడం కోసం మీ వద్ద ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా..? అన్న ప్రశ్న దేశంలో ఉన్న ప్రతి యవతీ యువకుల్లో ఉందన్నారు. ఎన్నికల ముందు చేసిన వాగ్ధానం ప్రకారం కాంగ్రెస్ పార్టీ యువ న్యాయ్ ద్వారా ఉపాధి విప్లవానికి శ్రీకారం చుట్టిందన్నారు. తమ పార్టీ హామీ ఇస్తే తప్పకుండా నెరవేరుస్తుందన్నారు.

రెండు సిద్ధాంతాల విధానాల మధ్య వ్యత్యాసాన్ని గుర్తించాల్సిన సమయం ఇది. యువత భవిష్యత్తును కాంగ్రెస్ నిర్మించడానికి చూస్తుంటే.. బీజేపీ వారిని తప్పుదోవ పట్టిచడానికి ప్రయత్నిస్తుందన్నారు. యువత బీజేపీ చెప్పే మాయ మాటలను పక్కన పెట్టి తమ విధిరాతను మార్చుకునే శక్తి వారి చేతుల్లోనే ఉందన్నారు. చదువుకున్న ప్రతి యువకుడికి ‘పెహ్లీ నౌక్రీ పక్డీ’ పథకం కింద ఏడాదికి రూ.లక్ష విలువైన ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు.

Also Read: Bjp Dilip Ghosh comments on cm mamata: వివాదాస్పద వ్యాఖ్యలు.. ఆమె తండ్రి ఎవరు?

ఎన్నికల ముందు యువతకు ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ఎందుకు అబద్ధం చెప్పారని రాహాల్ గాంధీ.. మోదీని ప్రశ్నించారు. యువ న్యాయ్ ఆధ్వర్యంలో ఉపాధి విప్లవం కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో సంకల్పించిందని రాహుల్ గాంధీ అన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం అని హామీ ఇచ్చారు. చదువుకున్న వారి చదువుకు తగ్గట్టు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. పెహ్లీ నౌక్రి పక్కీ అనే సరికొత్త పథకాన్ని అమలు చేయడం ద్వారా ఉద్యోగల నియామకాల పరీక్షల్లో ఎటువంటి పేవర్ లీకేజీలు కాకుండా చూస్తామన్నారు. ఈ విషాయాన్ని ట్వీట్టర్(ఎక్స్)లో రాహుల్ గాంధీ పోస్ట్ చేశారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News