Big Stories

400 Employees Layoff in 10 Minutes: 10 నిమిషాల్లో 400 మంది జాబులు ఔట్.. వీడియో కాల్ లో షాక్ ఇచ్చిన CEO

Layoffs
Layoffs

Bell Telecommunications Layoffs 400 Employees in Just 10 minutes: కోవిడ్ సమయంలో అన్నీ రంగాలు నష్టాల్లో కూరుకుపోతే ఐటీ పరిశ్రమ మాత్రం గణనీయమైన వృద్ధిని సాధించింది. వర్క్ ఫ్రం హోం ఆప్షన్‌తో ఐటీ ఉద్యోగులు కూడా భారీగా పెరిగారు. ఒక్కొకరు లక్షల్లో జీతాలు తీసుకున్నారు. దీంతో అటు చదువుల్లో ఇటు మార్కెట్‌లోనూ ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో రకరకాల ఐటీ కోర్సులు పుట్టుకొచ్చాయి. బడిలో కూడా ఐటీ చదువులు మొదలయ్యాయి. ఐటీ కోచింగ్ సెంటర్లు మొత్తం విద్యార్థులతో నిండిపోయాయి. రోజులు గడిచే కొద్ది లక్షల మంది ఐటీ కోర్సులు పూర్తి చేసుకొని ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్నారు.

- Advertisement -

కానీ ప్రస్తుత కాలంలో ఐటీ పరిశ్రమ కాస్త మందిగించిందlనే చెప్పాలి. తెల్లారితే ఉద్యోగం ఉంటందా లేక ఊడుతుందా అనే ప్రరిస్థితులు ఐటీ ఉద్యోగులను కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. వారి జీవితం ప్రశ్నార్ధకంగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్నా ఐటీ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి. చిన్న కంపెనీల నుంచి పెద్ద పెద్ద దిగ్గజ కంపెనీల వరకు రకరకాల కారణాలతో లే ఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. ఉద్యోగులను ఇళ్లకు పంపించేస్తున్నాయి.

- Advertisement -

ముఖ్యంగా టెక్, ఐటీ కంపెనీల్లో లేఆఫ్స్ భారీగా జరుగుతున్నాయి. ఈ కొత్త ఏడాదిలోనూ ఇప్పటికే వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. అయితే ఇదే బాటలో ప్రముఖ టెలికమ్యూనికేషన్స్ సంస్థ బెల్ నిలిచింది. ఉద్యోగులను భారీగా తొలగించింది. కేవలం 10 నిమిషాల వీడియో కాల్‌లో ఏకంగా 400 మందికిపైగా ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తున్నట్లు వెల్లడించింది. తాజాగా కంపెనీ వర్చువల్ గ్రూప్ మీటింగ్ జరగగా కంపెనీ మేనేజర్ విధుల నుంచి తొలగించిన ఉద్యోగుల వివరాలు తెలియజేశారు.

Also Read: ఇది కదా ఇండియా అంటే.. ఖండాంతరాలు దాటిన ఆల్ట్రావయొలెట్ బైక్

ఈ సందర్భంగా బెల్ సీఈఓ మిర్కో బిబిక్ మాట్లాడుతూ.. ఉద్యోగుల తొలగింపులపై కంపెనీ పునర్ వ్యవస్థీకరణ కోసం సంస్థాగత మార్పులు చేయనున్నట్లు పేర్కొన్నారు. దీంతో ఉద్యోగుల తొలగింపులు తప్పదని చెప్పారు. అంతేకాకుండా రానున్న రోజుల్లో సుమారు 4,800 మంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందని వెల్లడించారు. కంపెనీలో పని చేస్తున్న మొత్తం ఉద్యోగుల్లో ఇది కేవలం 9 శాతమనే అన్నారు. ఇందులో భాగంగానే 400 మందిని తొలగించామని అన్నారు.

మరోవైపు.. ప్రముఖ కంప్యూటర్ల తయారీ సంస్థ డెల్ కూడా లేఆఫ్స్ ప్రకటించనున్నట్లు తెలిపింది. వ్యయ భారం కారణంగా ఉద్యోగుల సంఖ్యను తగ్గించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. అయితే ఎంత మంది ఉద్యోగస్తులను తొలగిస్తారనేది ప్రకటించలేదు. గత ఏడాది డెల్ కంపెనీ ఏకంగా 6,650 మందిని తొలగించింది. ప్రస్తుతానికి డెల్‌లో 1,20,000 మంది ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News