Aman Sehrawat new record(Sports news today): పారిస్ ఒలింపిక్స్ లో వినేశ్ ఫోగట్ కు ఎదురైన చేదు అనుభవాన్ని మరిపించేందుకు భారత్ రెజ్లింగ్ కు కాంస్య పతకం సాధించిన అమన్ సెహ్రావత్ ఒక్క పతకం సాధించి ఎన్నో రికార్డులు బద్దలు కొట్టాడు. ముందుగా ఈసారి పురుషుల రెజ్లింగ్ భారత్ తరపున పోటీపడిన ఏకైక రెజ్లర్ కావడం. రెండోది అమన్ సెహ్రావత్ కు ఇదే తొలి ఒలింపిక్స్ కావడం. అంటే తాను కుస్తీ పడిన తొలి ఒలింపిక్స్ లోనే అమన్ పతకం సాధించాడు.
ఈ రికార్డులన్నీ పక్కన పెడితే అమన్ మరో అరుదైన రికార్డ్ సాధించాడు. ఆ రికార్డు బ్రేక్ చేయడం అంత సులువు కాదు. అదే ఒలింపిక్స్ లో పతకం సాధించిన అతిపిన్న వయస్కుడు కావడం. ఇంతకుముందు ఈ రికార్డ్ భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు పేరున ఉంది. 2016 రియో ఒలింపిక్ గేమ్స్ లో పివి సింధు తొలిసారి సిల్వర్ మెడల్ సాధించినప్పుడు.. ఆమె వయసు 21 సంవత్సరాల 1 నెల 14 రోజులు. ఇప్పుడు అమన్ సెహ్రావత్ ఒలింపిక్స్ లో పతకం సాధించిన సమయానికి అతని వయసు 21 సంవత్సరాల 24 రోజులు మాత్రమే. ఒక రెజ్లర్ కేవలం 21 సంవత్సరాల వయసులోనే ఒలింపిక్స్ వెళ్లడం.. పైగా మెడల్ సాధించడమనేది అరుదైన రికార్డ్.
11 ఏళ్లకే అనాథ.. కుస్తీ పట్ల అంకితభావం
హర్యాణాకు చెందిన అమన్ సెహ్రావత్ కు 11 ఏళ్ల వయసున్నప్పుడు అతని తల్లి అనారోగ్యం కారణంగా మరణించింది. భార్య మరణం తట్టుకోలేక అతని తండ్రి ఒక నెల వ్యవధి లోనే చనిపోయారు. అయితే అమన్ తండ్రి చనిపోయే ముందు తన కొడుకు భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియంలో కుస్తీ శిక్షణ కోసం చేర్పించాడు. తల్లిదండ్రుల మరణం తరువాత అమన్ ను తన తాత వద్ద పెరిగాడు. అమ్మానాన్నలను పోగొట్టుకున్న బాధను మరిపించడానికి తనకు కుస్తీ క్రీడ ఉపయోగపడిందని అమన్ తెలిపారు.
Also Read: ‘వినేశ్ ఫోగట్ కు న్యాయం జరుగుతుంది’.. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్!
అమన్ సెహ్రావత్ పారిస్ ఒలింపిక్స్ రెజ్లింగ్ 57 కేజీల కాంస్య పోటీలో ప్యూర్టో రీకోకు చెందిన డేరియన్ టోయి క్రుజ్ ని 13-5 తో ఓడించాడు. అమన్ విజయం పై అతనికి కోచింగ్ చేసిన వీరేంద్ర దహియా, జగ్మందర్ సింగ్ స్పందిస్తూ.. అమన్ చాలా అంకిత భావంతో కుస్తీ శిక్షణ కోసం కఠినంగా శ్రమించాడని పొందాడని చెప్పారు. 2028లో లాస్ ఏంజిల్స్ లో జరిగే ఒలింపిక్స్ అమన్ ఇంతకంటే పెద్ద విజయమే సాధిస్తాడనే నమ్మకం తమకు ఉందని తెలిపారు.
Also Read: డిగ్రీ చదవకుండానే సంవత్సరానికి రూ.5 కోట్లు సంపాదిస్తున్న యువతి.. ఎలాగంటే?..