E-Paper
Advertisement

బంగారం ధరలకు భారీ షాక్.. ఒక్కరోజు రూ. 5 వేలకు పతనం! ధరలు ఎలా ఉన్నాయి.

బంగారం ధరలకు భారీ షాక్.. ఒక్కరోజు రూ. 5 వేలకు పతనం! ధరలు ఎలా ఉన్నాయి.
Advertisement

Gold Price Today: అంతర్జాతీయ పరిణామాలు బంగారం-వెండి ధరలపై పడ్డాయి. ఫలితంగా రోజు రోజుకూ ఆయా లోహాల ధరలు పతనం అవుతున్నాయి. తాజాగా ఒక్కరోజులోనే ఐదు వేలకు పైగా బంగారం ధరలు పతనమయ్యాయి. దీంతో కొనుగోలుదారుల్లో ఒకటే ఆనందం మొదలైంది. ఈ పతనం ఇంకా ఎప్పటివరకు కొనసాగుతోంది? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.

బంగారం-వెండి ధరలకు భారీ షాక్

అంతర్జాతీయ పరిణామాలు విలువైన లోహాలపై పడింది. ఫలితంగా బులియన్ మార్కెట్లో ధరలు ప్రతీ రోజూ పతనం అవుతున్నాయి. తాజాగా శుక్రవారం బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. దేశీయ మార్కెట్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ఏకంగా రూ.5120  తగ్గింది.  ప్రస్తుతం రూ.1,25,570 ల వద్ద ట్రేడింగ్ జరుగుతోంది. అదే 22 క్యారెట్ల బంగారంపై రూ.4700 మేరా తగ్గి, రూ.1,15,100 లావాదేవీలు జరుగుతున్నాయి.

ఒక్కరోజు రూ. 5 వేలకు పతనం!

Advertisement

బంగారం బాటలోనే వెండి ధరలు నడుస్తున్నాయి. కిలో వెండిపై రూ.5,000 దిగి వచ్చింది. హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర ప్రస్తుతం  రూ.1.75 లక్షల వద్ద కొనసాగుతోంది.  ఉన్నట్లుండి ధరలు ఈ స్థాయిలో తగ్గుదల నమోదు కావడంతో కొనుగోలుదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇక అంతర్జాతీయ మార్కెట్‌ విషయానికి వద్దాం. స్పాట్‌ గోల్డ్‌ ఔన్సు ధర ప్రస్తుతం 3546 డాలర్లు వద్ద ట్రేడింగ్ జరుగుతోంది. కొంతకాలంగా 4 వేల డాలర్ల పైనే ఉన్న ధర ఏకంగా 500 డాలర్లు పతనమైంది. వెండి ధర ఔన్సు 41.84 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇక కమొడిటీ ఎక్స్ఛేంజ్‌లో గోల్డ్‌ ఫ్యూచర్స్‌ డిసెంబరు డెలివరీ 10 గ్రాముల రేటు రూ.1.22 లక్షలు పలుకుతోంది. అదే కిలో వెండి రూ.1.49 లక్షలు వద్ద లావాదేవీలు జరుగుతున్నాయి.

Advertisement

ALSO READ: EPFOలో కీలక మార్పులు.. ఇకపై ప్రతి నెలా జీతం PF నుంచే, ఖాతాలో కనీస నిల్వలు తగ్గింపు

బలపడిన అమెరికన్ డాలర్, పెరిగిన బాండ్ దిగుబడులు, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ నుండి వడ్డీ రేట్లు పెంపు తప్పదన్న వార్తల నేపథ్యంలో ఇన్వెస్టర్లు విలువైన లోహాల షేర్లు అమ్మకాలకు పాల్పడ్డారు. దీంతో రోజు రోజుకూ పతనం దిశగా నడుస్తోంది. శుక్రవారం ఉదయం ట్రేడింగ్‌లో బంగారం, వెండి ధరలు 6.6 శాతం వరకు పడిపోయి భారీ పతనం చవి చూశాయి. డిసెంబర్‌లో ఫెడ్ వడ్డీ రేట్ల తర్వాత ఓ క్లారిటీ రావచ్చని అంటున్నాయి బులియన్ వర్గాలు.

Related News

భారత్ దగ్గర వేల కోట్ల విలువైన బంగారం.. ఎక్కడ దాచిపెడతారో తెలుసా?

EPFOలో కీలక మార్పులు.. ఇకపై ప్రతి నెలా జీతం PF నుంచే, ఖాతాలో కనీస నిల్వలు తగ్గింపు

రూ.5 లక్షలు సేవింగ్స్ ఉంటే పెట్టుబడి కోసం ఇలా ప్లాన్ చేయండి.. చార్టర్డ్ అకౌంటెంట్ చేసిన సూచనలు

ఒక్క చోటే అంత బంగారమా? ఏకంగా ఏడు లక్షల కోట్లు.. లక్ అంటే వాళ్లదే!

బ్యాంకులో క్యాష్ డిపాజిట్ చేస్తున్నారా?ఈ 4 రూల్స్ తెలియకపోతే..ఇబ్బందులు తప్పవు!

ముంచుకొస్తున్న నిరుద్యోగ ముప్పు.. రెండేళ్లలో శాశ్వతంగా ఉపాధికి దూరం.. ఏఐ పరిశోధకుడి సంచలన హెచ్చరిక!

నెలకు రూ. 10 వేలు పెడితే చాలు.. ఏకంగా రూ.55 లక్షలు మీ సొంతం, ఈ స్కీమ్ గురించి తెలుసా?

Big Stories

Advertisement
×