E-Paper
Advertisement

ఇంటి గుమ్మం తెరవగానే అందమైన లుక్ కనిపించాలా? ఈ 7 డెకరేషన్ టిప్స్‌ ట్రై చేయండి

ఇంటి గుమ్మం తెరవగానే అందమైన లుక్ కనిపించాలా? ఈ 7 డెకరేషన్ టిప్స్‌ ట్రై చేయండి
Advertisement

Home Entrance Decoration Ideas| మన ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు ముందుగా కనిపించేది ఇంటి ప్రవేశ ద్వారమే. అందుకే ఇంటి లోపలి గదులను ఎంత అందంగా అలంకరిస్తామో, ఎంట్రన్స్ ఏరియాను కూడా అంతే అందంగా తీర్చిదిద్దాలి. అయితే చాలామంది హాల్, బెడ్‌రూమ్, బాల్కనీల అలంకరణపై శ్రద్ధ చూపిస్తారు కానీ ఇంటి గుమ్మం దగ్గర ఉండే చిన్న ప్రదేశాన్ని పట్టించుకోరు. నిజానికి ఆ చిన్న స్థలాన్ని కూడా అద్భుతంగా మార్చుకోవచ్చు. ఇందుకోసం ఖరీదైన ఫర్నిచర్ కొనాల్సిన అవసరం లేదు. కొన్ని చిన్న వస్తువులను చక్కగా అమర్చితే చాలు. మీ ఇంటి ప్రవేశ ప్రాంతం అందంగా, ఆహ్వానించేలా కనిపిస్తుంది. మరి మీ ఇంటి ఎంట్రన్స్‌ అందంగా మార్చే 7 సులభమైన డెకరేషన్ ఐడియాలు ఏమిటో తెలుసుకుందాం.

1. ఇంటి గుమ్మం దగ్గర చిన్న కన్సోల్ టేబుల్

ఇంటి తలుపు దగ్గర కొంత ఖాళీ స్థలం ఉంటే చిన్న కన్సోల్ టేబుల్ ఏర్పాటు చేసుకోండి. చెక్క లేదా మెటల్‌తో తయారైన సన్నని టేబుల్‌ ఎంచుకోవాలి. దానిపై ఇంటి తాళాలు పెట్టుకునేందుకు చిన్న ట్రే ఉంచుకోవచ్చు. అలాగే అందమైన పూలకుండీ, షోపీస్ లేదా చిన్న డెకరేటివ్ వస్తువు అమర్చండి. స్థలం ఎక్కువగా ఉంటే కింద చిన్న స్టూల్ లేదా బాస్కెట్ కూడా పెట్టుకుంటే మరింత అందంగా కనిపిస్తుంది.

2. ఎంట్రెన్స్ వద్ద ఖాళీ గోడపై అందమైన అద్దం

Advertisement

ఎంట్రన్స్ ఏరియాలో ఖాళీగా ఉన్న గోడను అందంగా మార్చేందుకు అద్దం మంచి ఎంపిక. గుండ్రటి, ఓవల్ లేదా మీకు నచ్చిన ప్రత్యేక డిజైన్‌లో అద్దాన్ని ఎంచుకోవచ్చు. కన్సోల్ టేబుల్ పైన ఏర్పాటు చేస్తే ఆ మూల మరింత అందంగా కనిపిస్తుంది. పెద్ద అద్దం పెట్టడం వల్ల చిన్న ప్రదేశం కూడా విశాలంగా కనిపిస్తుంది.

3. ఇండోర్ ప్లాంట్స్‌తో ఇంటి గుమ్మం వద్ద పచ్చదనం

ఇంటి ప్రవేశ ప్రాంతంలో మొక్కలు ఉంటే ఆ ప్రదేశం ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. ఇందుకోసం స్నేక్ ప్లాంట్, మనీ ప్లాంట్, అరేకా పామ్ వంటి మొక్కలను ఎంచుకోవచ్చు. స్థలం ఎక్కువగా ఉంటే తలుపు పక్కన పెద్ద కుండీ పెట్టండి. స్థలం తక్కువగా ఉంటే హ్యాంగింగ్ ప్లాంటర్స్ ఉపయోగించండి. అయితే మొక్కలకు సరిపడా వెలుతురు అందుతుందో లేదో చూసుకోవాలి.

4. ఫోటో ఫ్రేమ్స్, పెయింటింగ్స్‌తో గోడ అలంకరించండి

Advertisement

కుటుంబ సభ్యుల ఫొటోలను అందమైన ఫ్రేమ్స్‌లో అమర్చి ఎంట్రన్స్ గోడను అలంకరించండి. చిన్నవి, పెద్దవి కలిపి ఫోటో గ్యాలరీలా ఏర్పాటు చేయండి. ఫొటోల బదులు మీకు నచ్చిన పెయింటింగ్స్ లేదా ఆర్ట్‌వర్క్ కూడా పెట్టుకోవచ్చు. లేత రంగుల గోడలకు చెక్క లేదా ముదురు రంగు ఫ్రేమ్స్ బాగా సరిపోతాయి.

5. అందమైన లైట్స్‌తో ఎంట్రన్స్‌ వెలిగించండి

ఇంటి గుమ్మం దగ్గర వెలుతురు తక్కువగా ఉంటే వాల్ ల్యాంప్స్ ఏర్పాటు చేయవచ్చు. కన్సోల్ టేబుల్‌పై చిన్న టేబుల్ ల్యాంప్ కూడా పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ఫెయిరీ లైట్స్ ఉపయోగిస్తే సాయంత్రం వేళల్లో ప్రవేశ ప్రాంతం మరింత అందంగా కనిపిస్తుంది. వెచ్చని పసుపు రంగు వెలుతురు ప్రశాంతమైన వాతావరణాన్ని అందిస్తుంది.

Also Read: చాక్లెట్లు, బొమ్మల ఆశ చూపించి పిల్లలను మోసం చేసే వారితో జాగ్రత్త.. తల్లిదండ్రులు ఈ 7 విషయాలు నేర్పాలి

6. చెప్పులు క్రమంగా ఉంచేందుకు స్టైలిష్ షూ ర్యాక్‌

తలుపు దగ్గర చెప్పులు చిందరవందరగా ఉంటే ఇంటి అందం తగ్గుతుంది. అందుకే చిన్న లేదా సన్నని డిజైన్‌లో ఉండే షూ క్యాబినెట్‌ ఏర్పాటు చేసుకోండి. మూసి ఉంచే షూ ర్యాక్ ఎంచుకుంటే చెప్పులు బయటకు కనిపించవు. దానిపై చిన్న మొక్క లేదా పూలకుండీ పెట్టుకోవచ్చు.

7. డోర్‌మ్యాట్, నేమ్‌ప్లేట్‌తో చివరి మెరుగులు దిద్దండి

ఇంటి ప్రధాన ద్వారం ముందు అందమైన డోర్‌మ్యాట్ వేయండి. ఇంటి అలంకరణకు సరిపోయే రంగులు, డిజైన్లు ఎంచుకోండి. చెక్క, మెటల్ లేదా యాక్రిలిక్‌తో చేసిన నేమ్‌ప్లేట్ ఏర్పాటు చేయండి. సంప్రదాయ అలంకరణ ఇష్టమైతే తలుపులకు పూల తోరణం కట్టండి. స్థలం ఉంటే డోర్‌కు ఇరువైపులా చిన్న మొక్కల కుండీలు పెట్టుకోండి.

Also Read: జీవంలేని ఇంటి గోడలకు నిమిషాల్లో స్టైలిష్‌గా రెడీ చేయండి.. ఈజీ డెకరేషన్ టిప్స్ మీ కోసం

చిన్న చిన్న మార్పులతో ఇంటి ఎంట్రన్స్‌ అందంగా మార్చుకోండి

ఇంట్లో ప్రవేశ ప్రాంతాన్ని అలంకరించడానికి ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. మీకు అందుబాటులో ఉన్న స్థలం, ఇంటి ఇంటీరియర్‌కు అనుగుణంగా డెకరేషన్ వస్తువులు ఎంచుకోండి. అద్దాలు, మొక్కలు, లైటింగ్, చిన్న ఫర్నిచర్‌తో మీ ఇంటి గుమ్మానికి కొత్త అందాన్ని తీసుకురావచ్చు.

Related News

చదువుకోవాలంటే బోర్.. ఈ తేదీల్లో పుట్టిన పిల్లలకు అల్లరి, ఆటపాటలంటేనే ఇష్టం

మీకు తెలుసా రావణుడి రెండో భార్య ఎవరో.. కొండలను ఎత్తగలిగే శక్తిమంతుడు ఆమె కుమారుడు

ప్రతి చిన్న విషయానికి ఇంట్లో గొడవలు జరుగుతున్నాయా? కోపంలో ఈ 5 మాటలు అసలు చెప్పకూడదు

మంచి పెర్ఫ్యూమ్‌ కొనాలని చూస్తున్నారా? మీ పర్సనాలటీకి ఏటి సూట్ అవుతుందో ఇలా తెలుసుకోండి

పెళ్లి రోజు వధువు అందంగా, ఆరోగ్యంగా కనిపించాలా? వారం రోజులు ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి

ఘుమఘుమలాడే తెలంగాణ స్టైల్ మెంతికూర మటన్ గ్రేవీ.. ఇలా చేస్తే ముక్క వెన్నలా కరిగిపోతుంది!

తీపి, కారం కలయికతో నోరూరించే చిలగడదుంప పచ్చడి.. పిల్లల కూడా తెగ ఇష్టంతో తినేస్తారు!

Big Stories

Advertisement
×