E-Paper
Advertisement

శ్రావణం, పెళ్లిళ్ల సీజన్ మొదలు.. పసిడి ప్రియులకు షాక్, ఇవాళ మార్కెట్లో ధర‌లు చూద్దాం

శ్రావణం, పెళ్లిళ్ల సీజన్ మొదలు.. పసిడి ప్రియులకు షాక్, ఇవాళ మార్కెట్లో ధర‌లు చూద్దాం
Advertisement

Gold Price Today: అమెరికాలో 10 ఏళ్ల బాండ్ల రాబడులు పెరగడం, జూలై నెలకు అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు, సెప్టెంబర్‌లో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచుతుందనే అంచనాల ప్రభావం అంతర్జాతీయ బంగారం మార్కెట్ పడింది. ఫలితంగా బంగారం ధరలు ఎగిసిపడ్డాయి. దేశీయ మార్కెట్లోనూ బంగారం ధర పైపైకి వెళ్తోంది.

 

శ్రావణం, పెళ్లిళ్ల సీజన్ మొదలు

Advertisement

అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలు క్రమంగా ఎగబాకుతున్నాయి. శ్రావణ మాసం సందర్భంగా చాలామంది భారతీయులు బంగారం కొనుగోళ్ల వైపు మొగ్గు చూపుతుంటారు. దీనికితోడు పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. పసిడి ధరలు ఎగబాకడంతో ఆలోచనలో పడ్డారు. ఇప్పుడు కొనుగోలు చేసే కన్నా, కొద్దిరోజులు ఆగి తీసుకోవడం బెటరనే అంచనాకు వస్తున్నారు. అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో పెట్టుబడుదారులు పుత్తడి వైపు మొగ్గు చూపుతున్నారు.

 

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు

Advertisement

స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 50 డాలర్ల మేరా పెరగడంతో ఔన్స్ బంగారం ధర 4430 డాలర్ల పైన పలుకుతోంది. స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 1.52 డాలర్లు పెరిగి ఔన్స్ వెండి రేటు 66 డాలర్ల స్థాయిలో ట్రేడింగ్ జరుగుతోంది. దేశీయంగా గడిచిన మూడురోజులు బంగారం ధరలు పెరుగుతూ వచ్చాయి. ఆగస్టు 13న అంటే గురువారం తెలుగు రాష్ట్రాల మార్కెట్ పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం -వెండి ధరలను ఒక్కసారి పరిశీలిద్దాం.

 

దేశీయ మార్కెట్లో బంగారం-వెండి థరలు

హైదరాబాద్ మార్కెట్లో రెండో రోజూ బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల మేలిమి పసిడి తులం రూ.1040 మేరా పెరిగింది. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,860 వద్ద కొనసాగుతోంది. బుధవారం రూ.1850 మేరా పెరగడంతో గడిచిన రెండురోజులుగా దాదాపు 2900 వరకు పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు మరో రూ.950 పెరిగింది. ప్రస్తుతం తులం ధర రూ.1,41,950 వద్దకు చేరింది. రెండు రోజులకు కలిపి రూ.2600 పెరిగింది.

ALSO READ: ఆన్‌లైన్ క్లాస్ బుక్ చేయమంటే.. వెబ్‌సైట్ హ్యాక్ చేసిన ఏఐ

ఏపీలోని విజయవాడ నగరంలో హైదరాబాద్ ధరలు పలుకుతున్నాయి. ఇక వెండి ధరలను పరిశీలిద్దాం. గడిచిన రెండు రోజులు ఓ రేంజ్ లో పెరిగిన వెండి, ఇవాళ అదే ధర వద్ద స్థిరంగా కొనసాగుతోంది. హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో కిలో వెండి రేటు రూ.2,60,000 వద్ద ట్రేడింగ్ జరుగుతోంది.

Related News

బాబూ ఈ డిగ్రీలు చేస్తే ఉద్యోగాల్లేవ్.. ఏఐ దెబ్బ.. తక్కువ జీతానికి చేయాల్సిందే

నలుపు vs నీలం సోలార్ ప్యానెళ్లు.. ఏది ఎక్కువ కరెంట్ ఇస్తుంది? మీ ఇంటికి ఏది బెస్ట్?

ఇది కదా SIP పవరంటే.. రూ. 9 వేలతో రూ. 3 కోట్ల సంపద.. సామాన్యులకు జాక్ పాట్!

పోస్టాఫీస్ NSC vs SBI ఎఫ్‌డీ.. మీ డబ్బుకు ఎక్కడ ఎక్కువ లాభం? 5 ఏళ్ల పెట్టుబడికి ఏది బెస్ట్?

తెల్లటి ఆధార్ తెలుసు.. మరి ఈ ‘బ్లూ ఆధార్’ కథేంటి? దీని వల్ల ఎవరికి బెనిఫిట్?

అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. సామాన్యులపై తీవ్ర ప్రభావం.. అలా చేయకపోతే సబ్సిడీ బంద్!

ఫస్ట్ టైమ్ కారు కొంటున్నారా? డీలర్లు ఈ 5 విషయాలు మీతో చెప్పరు

భారీగా బంగారం ధర పతనం.. మహిళల్లో ఆనందం, మార్కెట్లో రేటు ఎంతంటే..

Big Stories

Advertisement
×