India’s Longest Non-Stop Train: భారతీయ రైల్వేలో కొన్ని రైళ్లు వేగానికి, మరికొన్ని సుదూర ప్రయాణానికి గుర్తింపు తెచ్చుకున్నాయి. ఇంకొన్ని మాత్రం మార్గమధ్యంలో చాలా తక్కువ స్టేషన్లలో ఆగుతూ ప్రయాణికులను గమ్యస్థానానికి చేరుస్తాయి. అయితే, దేశంలో అత్యతంత దూరం ఆగకుండా వెళ్లే రైలు ఏది? ఎంత దూరం వెళ్తుంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ముంబై నుంచి బయలుదేరిన తర్వాత దాదాపు 500 కిలోమీటర్ల వరకు ఎక్కడా ఆగకుండా వెళ్లే ఓ రైలు కూడా ఉంది. అదే ముంబై సెంట్రల్–హాపా దురంతో ఎక్స్ ప్రెస్.12267, 12268 రైలు నంబర్లతో నడిచే ఈ ఎక్స్ ప్రెస్‌కు ముంబై సెంట్రల్ నుంచి బయలుదేరిన తర్వాత మొదటి షెడ్యూల్డ్ ప్యాసింజర్ హాల్ట్ అహ్మదాబాద్ జంక్షన్. అంటే ఈ రెండు స్టేషన్ల మధ్య ప్రయాణికుల కోసం మధ్యలో ఎక్కడా స్టాప్ ఉండదు. ఈ దూరం ఇంచుమించు 500 కి.మీ ఉంటుంది.
ముంబై సెంట్రల్ నుంచి బయలుదేరే 12267 దురంతో ఎక్స్‌ప్రెస్ షెడ్యూల్ ప్రకారం రాత్రి 10:50 గంటల సమయంలో ప్రయాణం ప్రారంభిస్తుంది. మరుసటి రోజు ఉదయం 4:45 గంటలకు అహ్మదాబాద్ చేరుకుంటుంది. అంటే, ముంబై సెంట్రల్ నుంచి అహ్మదాబాద్ వరకు సుమారు 5 గంటల 50 నిమిషాల పాటు మధ్యలో ప్యాసింజర్ హాల్ట్ లేకుండా ప్రయాణిస్తుంది. రాత్రి సమయంలో ఈ రైలు నాన్ స్టాప్ గా ఇంత దూరం దూసుకెళ్లడం ప్రత్యేకతగా చెప్పొచ్చు. ఈ రైలు ముంబై, గుజరాత్, సౌరాష్ట్ర ప్రాంతాల మధ్య ప్రయాణికులకు కనెక్టివిటీ అందిస్తుంది.
ఈ రైలు కేవలం ముంబై–అహ్మదాబాద్ మధ్యే నడవదు. దీని పూర్తి ప్రయాణ మార్గం సుమారు 814 కిలోమీటర్లు ఉంటుంది. ముంబై సెంట్రల్ నుంచి ప్రారంభమై హాపా వరకు ఈ రైలు ప్రయాణిస్తుంది. ఈ రైలుకు సంబంధించిన ముఖ్యమైన మరో విషయం పశ్చిమ రైల్వే పరిధిలో నడవడం. ముంబై సెంట్రల్ నుంచి బయలుదేరిన వెంటనే అహ్మదాబాద్ వరకు ఉన్న సుదీర్ఘ నాన్‌స్టాప్ సెక్షన్ ప్రయాణికులకు ప్రత్యేక అనుభూతిని అందిస్తుంది.
భారతీయ రైల్వేలో వేలాది రైళ్లు వివిధ మార్గాల్లో సేవలు అందిస్తున్నాయి. వాటిలో ప్రతి రైలుకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ముంబై సెంట్రల్–హాపా దురంతో ఎక్స్‌ప్రెస్‌కు మాత్రం ముంబై నుంచి అహ్మదాబాద్ వరకు దాదాపు 500 కిలోమీటర్ల నాన్‌స్టాప్ ప్రయాణం అందరినీ ఆకట్టుకుంటుంది.
Read Also: ఇండియన్ బుల్లెట్ రైలు భూకంపాన్ని ముందే పసిగడుతుందా? అదిరిపోయే సేఫ్టీ సీక్రెట్ ఇదే!