Intinti Ramayanam Today Episode September 29th : అవని ఆ ఫోటోని ఎందుకు నీ గదిలో పెట్టుకున్నావు నువ్వు నా కొడుకు ఫోటో ని ఎందుకు నీ గదిలో పెట్టావు అని భానుమతి అడుగుతుంది. మావయ్య గారి ఫోటోని నా గదిలో ఎందుకు పెట్టానంటే అంటూ అవని మళ్లీ అబద్ధం చెప్తుంది కానీ భానుమతికి మాత్రం అవనిపై ఎక్కడో అనుమానం అయితే పెరుగుతూ వస్తుంది.. అయినా మావయ్య గారి ఫోటోని ఎందుకు నీ గదిలో ఎందుకు పెట్టుకున్నావు అని పార్వతి కూడా అడుగుతుంది. మావయ్య గారి ఫోటోని అందుకే అక్కడ పెట్టాను అని ఏదో ఒకటి చెప్తుంది అయితే పల్లవి మాత్రం అవని అడ్డంగా దొరికిపోయింది అని ఆలోచిస్తూ ఉంటుంది. ఈ దెబ్బతో అవని ఇంకా నిజం చెప్పాల్సి వస్తుంది అని పల్లవి చాలా సంతోషంగా ఉంటుంది కానీ అవని మాత్రం తెలివిగా పార్వతికి నమ్మిస్తుంది. ఎన్నిసార్లు దొరుకుతావని అనుకున్న కూడా నువ్వు మాత్రం అస్సలు దొరకకుండా ఇంట్లో తెలివిగా ఆలోచిస్తున్నావేంటి అవని అంటూ పల్లవి అవని పొగిడేస్తూ ఉంటుంది. అయితే అవని చెప్పిన మాట విని ఇంట్లోని వాళ్ళందరూ కూడా ఆమెకు సపోర్ట్ చేసిన సరే.. భానుమతి మాత్రం అనుమానంగా ఉండడంతో ఆ ఫోటోని తెచ్చి అక్కడ పెడతానని అవని అంటుంది. మొత్తానికి ఎక్కడున్న ఫోటోని అక్కడే తీసుకొచ్చి పెట్టడంతో ఇంటికే కల వచ్చిందని పార్వతి చాలా మురిసిపోతూ ఉంటుంది..
తన ఫ్రెండు అక్కని కోర్టుకు తీసుకొని వెళ్తాడు శ్రీకర్ ఆమె ఆస్తి కోసం చేసిన ప్రయత్నాలన్నీ కూడా శ్రీకర్తె లిసిపోతాయి. ఇక లేడి ఆస్తికోసం తన మరిది రాగానే ఆ కాగితాలను తీసుకొని అక్కడి నుంచి ఉడయిస్తుంది శ్రీకర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు.. ఆ వ్యక్తి మాత్రం మా వదిన లేడీ కాదు మాయలేడి నువ్వు అతను కలిసి నా ఆస్తిని కొట్టేయాలని ప్లాన్ చేశారా అని అతను అనగానే శ్రీకర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక మా వదిన ఒక మోస గత్తె అని నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను. నేను మొదటినుంచి చెప్తున్నాను వినకుండా ఆస్తి కోసమేదంతా చేశావు నీకు మా వదినకి సంబంధం ఉంది. మీరిద్దరూ కలిసిన ఆస్తిని కొట్టేయాలని చూస్తున్నారు అని అనడంతో నాకు కొంచెం టైం ఇవ్వండి నేను చూసుకుంటాను అని శ్రీకర్ అంటాడు.
మీనాక్షి అందరిని భోజనానికి పిలుస్తుంది. ఇంకా ఎవరు భోజనానికి రాలేదు అని ఆలోచిస్తూ ఉంటుంది అయితే ఒక్కొక్కరుగా వచ్చి నాకు ఆకలిగా లేదు నేను తినను అని చెప్పేసి వెళ్ళిపోతారు. అయితే భానుమతి కూడా నాకొద్దు నేను తినను అని చెప్పి వెళ్ళిపోతుంది.. ఎందుకు వీళ్ళు అందరూ తినకుండా వెళ్ళిపోతున్నారు అని ఆలోచిస్తూ ఉంటుంది మీనాక్షి అయితే అప్పుడే అక్కడికి వచ్చిన ఆరాధ్యను చూసి నువ్వు కూడా భోజనం చేయవా ఎందుకు చేయవు అని మీనాక్షి అడుగుతుంది.. నేను భోజనం చేయను అని ఆరోగ్య కూడా చెప్పడంతో మీనాక్షి ఎందుకు అడుగుతుంది. నేను నానమ్మ వాళ్ళు వచ్చిన తర్వాత తింటాను అని ఆరాధ్య అంటుంది. అప్పుడే అందరు ఇంట్లోకి వచ్చే భోజనానికి రండి అని మీనాక్షి పిలుస్తుంది. కానీ ఎవరు భోజనం చేయకపోవడంతో ఆరాధ్య కూడా నాకు వద్దు అని అంటుంది.
అత్తయ్య గారికి ఎలాంటి హెల్త్ ప్రాబ్లం లేదు కాబట్టి మనమంతా సంతోషించాల్సిన విషయం అని అవని అనగానే అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. అయితే లోపలికి వెళ్లిన పార్వతి నాకోసం వీళ్ళు ఎవరు భోజనం చేయకుండా బాధపడి పోతున్నారా అంటూ చాలా బాధపడిపోతూ ఉంటుంది. వీలు నా గురించి తినకుండా ఉండడం నాకు ఇష్టం లేదు వీళ్ళని ఎలాగైనా సరే తినడానికి పిలవాలి అని పార్వతి అందరిని పిలుస్తుంది. అయితే పార్వతి పిలిచినందుకు అందరూ వచ్చి ఇష్టం లేకపోయినా సరే భోజనం చేస్తారు. పల్లవి అత్తయ్య ఇంత సంతోషంగా ఉంటే నేను అసలు తట్టుకోలేకపోతున్నాను ఎలాగైనా సరే ఈమె చచ్చిపోయేలా చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అవని అక్కయ్య గారు సంతోషంగా ఉన్నప్పుడు తనకి మావయ్య గారు చనిపోయారు అన్న విషయాన్ని చెప్పాలి అని ఫిక్స్ అవుతుంది..
తను ఆరోగ్యంగా ఉండడానికి ఈ టాబ్లెట్లు వేసుకోవాలి.. కానీ నేను ఇచ్చే టాబ్లెట్ వేసుకుంటే ఆరోగ్యం పూర్తిగా పాడవుతుంది అని పల్లవి ఇంకొక టాబ్లెట్ తీసుకుని వచ్చి అవన్నీ ముందరే పార్వతికి ఇస్తుంది. అది తెలుసుకున్న అవని పల్లవి చెంపలు వాయించేస్తుంది ఎందుకు టాబ్లెట్లు మార్చేసావు అంటూ కోపంతో రగిలిపోవడంతో పాటుగా చెంప పగిలేలా కొడుతుంది. అందరూ ఎందుకు పల్లవిని కొడుతున్నావు టాబ్లెట్ ఒకటే కదా మారింది. కానీ నువ్వు ఎందుకు అసలు చెప్పకుండా కొట్టేస్తున్నావు అని అడుగుతారు. అవని నీయంతగా ఆపడానికి ప్రయత్నించినా సరే తను మాత్రం అస్సలు ఆగకుండా పల్లవిని కొడుతూనే ఉంటుంది. ఇక అవని అందరికీ అనుమానం వస్తుంది అని టాబ్లెట్ మారిందని కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాను అందుకే కొట్టాను సారీ పల్లవి అని ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తుంది.. ఇక మొత్తానికి పల్లవి పై అందరికీ అనుమానం మొదలవుతుంది.. అవని పల్లవి పై అనుమానం మొదలవుతుంది ఎలాగైనా సరే నన్ను వాడుకొని అన్ని అబద్ధాలు మోసాలు చెప్పింది కదా ఇప్పుడు అశ్విని విషయంలో కూడా అదే చేస్తున్నా అని అవని అనుకుంటుంది. అశ్విని ఒకసారి కలిస్తే పల్లవి గురించి అంత నిజం తెలిసిపోతుంది అని అవని అనుకుంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…
Also Read : మంగళవారం మూవీ లవర్స్ కు పండగే.. డోంట్ మిస్…