E-Paper
Advertisement

భారీగా బంగారం ధర పతనం.. మహిళల్లో ఆనందం, మార్కెట్లో రేటు ఎంతంటే..

భారీగా బంగారం ధర పతనం.. మహిళల్లో ఆనందం, మార్కెట్లో రేటు ఎంతంటే..
Advertisement

Gold Price Today: అంతర్జాతీయ పరిణామాలు, చమురు ధరలు పెరగడం, డాలర్ బలపడడం వంటి కారణాలు బులియన్ మార్కెట్‌పై పడింది. ఫలితంగా బంగారం, వెండి ధరలు భారీగా పతనమవుతున్నాయి. మహిళల్లో ఆనందాలు మిన్నంటాయి. ధరలు ఇంకా దిగి వస్తుందని ఆశతో ఎదురు చూస్తున్నారు.

అంతర్జాతీయ పరిణామాలు బులియన్ మార్కెట్ పై

అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో బంగారం-వెండి ధరలు పతనం అవుతున్నాయి. చమురు ధరలు అమాంతంగా పెరగడంతో మదుపరులు అటువైపు మొగ్గు చూపారు. చమురు మంటలతో ద్రవ్యోల్బణ భయాలు, ఫెడ్‌ వడ్డీ రేట్ల పెంపు అంచనాలతో విలువైన లోహాలకు గిరాకీ తగ్గుతోంది. ఈ క్రమంలో పసిడి, వెండి ధరలు ఒత్తిడికి గురవుతున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం-వెండి ధరలు పతనం

Advertisement

సెప్టెంబర్ 28న అనగా సోమవారం బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. ప్రపంచ మార్కెట్‌ కామెక్స్‌లో బంగారం ఫ్యూచర్స్ ఔన్సుకు సుమారు 4,230 లకు పడిపోయింది. అంతకుముందు ధర 4,321 డాలర్లు ఉండగా, వార్త రాసే సమయానికి ఔన్సుకు 96 డాలర్లు తగ్గిపోయింది. ప్రస్తుతం 4,224 వద్ద ట్రేడింగ్ జరుగుతోంది. ఈ ఏడాది ఆరంభంలో బంగారం ధర ఔన్సుకు 5,586 డాలర్ల గరిష్ట స్థాయికి చేరుకుంది. కామెక్స్ వెండి ఫ్యూచర్స్ ఔన్సు దర 64 డాలర్ల వద్ద ప్రారంభమైంది. వార్త రాసే సమయానికి వెండి ఔన్సుకు 2 డాలర్లు 40 తగ్గింది. ప్రస్తుతం 62 వద్ద అమ్మకాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది ఆరంభంలో వెండి ధర ఔన్సుకు 121.79 డాలర్ల గరిష్ఠ స్థాయికి చేరుకుంది.

దేశీయ మార్కెట్లో ఒక్కసారిగా పతనం

సోమవారం ఉదయం 10 గంటలకు సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,50,170కు పడిపోయింది. నిన్నటితో పోలిస్తే ఏకంగా రూ. 2510 మేరా తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 2300 మేరా తగ్గింది. ప్రస్తుతం రూ.1,37,650కు చేరుకుంది.  కిలో వెండి ధర రూ.5 వేలు తగ్గి ప్రస్తుతం రూ.2.45 లక్షల వద్ద ట్రేడింగ్ జరుగుతోంది. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,50,320 ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,37,800 వద్ద ఉంది. ఇక ముంబై, కోల్‌కత్తా, బెంగుళూరు ధరలు ఢిల్లీ కంటే రూ.200 తగ్గాయి. చెన్నైలో అయితే దాదాపు ఢిల్లీ స్థాయిలోనే అటు ఇటుగా ధర కొనసాగుతోంది. వెండి ధర కూడా దాదాపు అదే స్థాయిలో కొనసాగుతోంది.

Advertisement

ALSO READ: స్టాక్‌మార్కెట్‌కు చమురు సెగ.. రూ. 6 లక్షల కోట్ల సంపద ఆవిరి

 

Related News

ఫస్ట్ టైమ్ కారు కొంటున్నారా? డీలర్లు ఈ 5 విషయాలు మీతో చెప్పరు

స్టాక్‌మార్కెట్‌కు చమురు సెగ.. రూ. 6 లక్షల కోట్ల సంపద ఆవిరి

అక్టోబర్ 1 నుంచి ఫిక్స్‌డ్ డిపాజిట్‌ రూల్స్‌లో మార్పులు.. రిజర్వ్ బ్యాంక్ కొత్త నిబంధనలు ఇవే

సామాన్యులకు బిగ్ రిలీఫ్.. బ్యాంకుల సమ్మె వాయిదా, డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించిందా?

ఫిక్స్‌డ్ డిపాజిట్లకు పెట్టుబడి ప్రత్యామ్నాలు వెతుకుతున్న భారతీయులు.. ఎందుకంటే?

30 ఏళ్లు వచ్చేలోపు..ఈ 7ట్రిక్స్ పాటిస్తే, మీ ఫ్యూచర్ సెట్టైనట్టే!

మీకు 4-5 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయా? ఎక్కువ అకౌంట్లు ఉంటే జరిగే నష్టాలు ఇవే!

Big Stories

Advertisement
×