E-Paper
Advertisement

ఇది కదా SIP పవరంటే.. రూ. 9 వేలతో రూ. 3 కోట్ల సంపద.. సామాన్యులకు జాక్ పాట్!

ఇది కదా SIP పవరంటే.. రూ. 9 వేలతో రూ. 3 కోట్ల సంపద.. సామాన్యులకు జాక్ పాట్!
Advertisement

SIP Investment: మ్యూచువల్ ఫండ్లలో క్రమబద్దంగా పెట్టుబడి పెట్టే సిప్ (SIP) విధానానికి రోజు రోజుకు ఆదరణ పెరుగుతోంది. దీని ద్వారా ప్రతి నెల చిన్న మొత్తంలో పొదుపు చేస్తూ దీర్ఘకాలంలో ఊహించని రీతిలో పెద్ద మొత్తాన్ని సమకూర్చుకోవచ్చు. సిప్ లో నెలకు కేవలం రూ. 9,000 పొదుపు చేయడం ద్వారా కాలక్రమేణా రూ. 3 కోట్లకు పైగా భారీ ఆదాయాన్ని ఎలా సృష్టించవచ్చో ఈ కథనంలో చూద్దాం.

అసలు సిప్ అంటే ఏంటి?

మ్యూచువల్ ఫండ్ సంస్థలు అందించే ఒక సులభమైన, క్రమబద్ధమైన పెట్టుబడి మార్గమే ఎస్ఐపీ. ఏకకాలంలో పెద్ద మొత్తంలో డిపాజిట్ చేయడానికి బదులుగా ప్రతి నెల లేదా మూడు నెలలకొకసారి ఒక నిర్ణీత మొత్తాన్ని పెట్టుబడి పెట్టడానికి ఇది వీలు కల్పిస్తుంది. నెలకు రూ. 500 వంటి చిన్న మొత్తంతో కూడా ఎస్ఐపీని ప్రారంభించే అవకాశం ఉండటంతో సాధారణ ఆదాయ వర్గాలకు ఇది ఎంతో అనుకూలంగా మారింది.

అధిక లాభాలకు బెస్ట్..

Advertisement

బ్యాంకుల్లో చేసే రికరింగ్ డిపాజిట్ (RD) లాగే ఇందులో కూడా ప్రతి నెల మీ బ్యాంక్ ఖాతా నుండి నిర్దిష్ట మొత్తం ఆటోమేటిక్ గా సిప్ పథకానికి జమ అవుతుంది. మార్కెట్ హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టడం వల్ల దీర్ఘకాలంలో మెరుగైన లాభాలు అందుకోవడానికి సిప్ ద్వారా మార్గం సుగమం అవుతుంది.

SIP ఎలా పనిచేస్తుంది?

ఎస్ఐపీ విధానం చాలా పారదర్శకంగా, సరళంగా ఉంటుంది. బ్యాంక్ ఖాతా నుంచి ప్రతినెల నిర్ణీత మొత్తం కట్ అయినప్పుడు ఆ సమయానికి ఉన్న నెట్ అసెట్ వ్యాల్యూ (NAV) ఆధారంగా మీ ఖాతాలో మ్యూచువల్ ఫండ్ యూనిట్లు జమ అవుతాయి. ఈ విధానం ‘రూపీ కాస్ట్ యావరేజింగ్’ (Rupee-cost averaging) సూత్రంపై పనిచేస్తుంది. మార్కెట్ పతనంలో ఉన్నప్పుడు తక్కువ ధరకే ఎక్కువ యూనిట్లు, మార్కెట్ గరిష్టాల్లో ఉన్నప్పుడు తక్కువ యూనిట్లు కొనుగోలు చేస్తారు. దీనివల్ల మీ యూనిట్ల సగటు ధర తగ్గి, స్వల్పకాలిక హెచ్చుతగ్గుల ప్రభావం పెట్టుబడిపై పడకుండా ఉంటుంది. మీ పెట్టుబడిపై వచ్చే రాబడులు మళ్లీ మళ్లీ ఇన్వెస్ట్ అవ్వడం వల్ల కాలం గడిచేకొద్దీ మీ డబ్బు వేగంగా పెరుగుతూ భారీ మొత్తంగా మారుతుంది.

Advertisement

Also Read: పోస్టాఫీస్ NSC vs SBI ఎఫ్‌డీ.. మీ డబ్బుకు ఎక్కడ ఎక్కువ లాభం? 5 ఏళ్ల పెట్టుబడికి ఏది బెస్ట్?

రూ. 9 వేలతో రూ. 3 కోట్లు ఎలా సాధ్యం?

సిప్ లో నెలకు రూ.9 వేల పెట్టుబడి ద్వారా రూ.3 కోట్లకు పైగా రాబడి ఎలా సాధ్యమవుతుందో సిప్ కాలిక్యులేటర్ ద్వారా చూద్దాం. ఉదాహరణకు నెలకు రూ. 9,000 చొప్పున మొత్తం ఇన్వెస్ట్ చేసిన సొమ్ము రూ. 32,40,000 అనుకుంటే.. దానిపై అంచనా రాబడి రూ. 2,85,29,224. కాలపరిమితి తర్వాత మెుత్తం చేతికి అందే విలువ రూ. 3,17,69,224. అంటే సిప్ లో సుదీర్ఘ కాలపరిమితిలో ప్రతీ నెల రూ.9 వేలు పెట్టుబడి పెట్టడం ద్వారా మార్కెట్ లాభాలు, వడ్డీలు, చక్రవడ్డీలు కలిపి రూ. 3.17 కోట్లకు పైగా పొందే అవకాశం ఉంటుందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

ముఖ్య గమనిక: ఈ కథనం కేవలం సమాచారం కోసం మాత్రమే. దీనినే పెట్టుబడి సలహాగా పరిగణించకూడదు. డబ్బుకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకునేముందు ఆర్థిక సలహాదారులను సంప్రదిస్తే మంచిది.

Also Read: తెల్లటి ఆధార్ తెలుసు.. మరి ఈ ‘బ్లూ ఆధార్’ కథేంటి? దీని వల్ల ఎవరికి బెనిఫిట్?

Tags

Related News

నలుపు vs నీలం సోలార్ ప్యానెళ్లు.. ఏది ఎక్కువ కరెంట్ ఇస్తుంది? మీ ఇంటికి ఏది బెస్ట్?

పోస్టాఫీస్ NSC vs SBI ఎఫ్‌డీ.. మీ డబ్బుకు ఎక్కడ ఎక్కువ లాభం? 5 ఏళ్ల పెట్టుబడికి ఏది బెస్ట్?

తెల్లటి ఆధార్ తెలుసు.. మరి ఈ ‘బ్లూ ఆధార్’ కథేంటి? దీని వల్ల ఎవరికి బెనిఫిట్?

అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. సామాన్యులపై తీవ్ర ప్రభావం.. అలా చేయకపోతే సబ్సిడీ బంద్!

ఫస్ట్ టైమ్ కారు కొంటున్నారా? డీలర్లు ఈ 5 విషయాలు మీతో చెప్పరు

భారీగా బంగారం ధర పతనం.. మహిళల్లో ఆనందం, మార్కెట్లో రేటు ఎంతంటే..

స్టాక్‌మార్కెట్‌కు చమురు సెగ.. రూ. 6 లక్షల కోట్ల సంపద ఆవిరి

Big Stories

Advertisement
×