E-Paper
Advertisement

అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. సామాన్యులపై తీవ్ర ప్రభావం.. అలా చేయకపోతే సబ్సిడీ బంద్!

అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. సామాన్యులపై తీవ్ర ప్రభావం.. అలా చేయకపోతే సబ్సిడీ బంద్!
Advertisement

October New Rules: సాధారణంగా ప్రతీ నెల ప్రారంభంలో కొన్ని కీలక మార్పులు చోటుచేసుకుంటూనే ఉంటాయి. ఈ క్రమంలోనే అక్టోబర్ 1 నుంచి సైతం కొత్త రూల్స్ రాబోతున్నాయి. ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులు, బ్యాంక్ ఖాతాదారులు, జనన మరణ ధ్రువీకరణ పత్రాలు అవసరమైన వారిపై ఈ రూల్స్ ప్రారంభం చూపనున్నాయి. ఇంతకీ ఆ మార్పులేంటో ఈ కథనంలో చూద్దాం.

ఎల్పీజీ సబ్సిడీకి బయోమెట్రిక్

అక్టోబర్ 1 నుంచి సబ్సిడీ ధరకే వంటగ్యాస్ సిలిండర్ పొందేందుకు ప్రతీ వినియోగదారుడు బయోమెట్రిక్ ఆధార్ ప్రక్రియను పూర్తి చేసుకోవడం తప్పనిసరి. అర్హులైన పేదలకు మాత్రమే గ్యాస్ సబ్సిడీ చేరేలా చూడటానికి, అక్రమ కనెక్షన్లను ఏరివేసి సిలిండర్ల పక్కదోవ పట్టకుండా అరికట్టడానికి పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఈ చర్యలు చేపట్టింది. ఇప్పటికే సెప్టెంబర్ 19 నాటికి దేశంలో దాదాపు 89.9 శాతం మంది (27.43 కోట్ల మంది) ఈ ప్రక్రియ పూర్తి చేశారు. ఆధార్ ఆధార్ అనుసంధానం పూర్తయిన వారు మళ్లీ చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

బ్యాంక్ వడ్డీ రేట్లలో పారదర్శకత

Advertisement

బ్యాంక్ డిపాజిటర్లకు మేలు చేకూరేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిబంధనలను సవరించింది. సమానమైన డిపాజిట్లకు సంబంధించి అన్ని శాఖల్లోనూ, అందరి వినియోగదారులకూ ఒకే విధమైన పారదర్శక వడ్డీ రేట్లను అందించాలని స్పష్టం చేసింది. అక్టోబర్ 1 నుంచి ఒకే బ్యాంక్‌కు చెందిన వేర్వేరు శాఖలు తమ ఇష్టానుసారంగా వేర్వేరు వడ్డీ రేట్లను ఆఫర్ చేయడానికి వీలుండదు. వడ్డీరేట్లపై ఎలాంటి బేరసారాలు లేకుండా ఖాతాదారులకు వెల్లడించాలి.

జనన, మరణ నమోదు కఠినతరం

జనన, మరణ నమోదు ప్రక్రియలో అక్రమాలను నిరోధించేందుకు నిబంధనలను కేంద్రం మరింత కఠినతరం చేసింది. అక్టోబర్ 1 నుంచి సంవత్సరం దాటి రెండు సంవత్సరాల లోపు చేసే రిజిస్ట్రేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే నమోదు చేయనున్నారు. ఒకవేళ రెండు సంవత్సరాల కంటే ఎక్కువ ఆలస్యమైతే నమోదు ప్రక్రియ జరగడానికి జుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ ఆర్డర్ తప్పనిసరి కానుంది.

Advertisement

Also Read: ఈ 5 రకాల వ్యక్తులతో స్నేహం చేస్తే మీ జీవితం నాశనమే.. ప్రశాంతంగా ఉండేందుకు ఈ జాగ్రత్తలు పాటించండి

రూల్స్ విషయంలో జాగ్రత్త..

మెుత్తంగా ఈ కొత్త మార్పుల నేపథ్యంలో సబ్సిడీ వినియోగదారులు తమ ఆధార్ స్టేటస్‌ను సరిచూసుకోవడం, డిపాజిటర్లు వడ్డీ వివరాలను గమనించడం, జనన-మరణ సర్టిఫికెట్ల నమోదులో జాగ్రత్త వహించడం ఎంతో ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: నార్మల్ ప్యాసింజర్ లా వెళ్తూ.. రైలులో సివిక్ సెన్స్ లేని వాళ్లకి మొట్టికాయలు వేసిన ఆదా శర్మ!

Tags

Related News

ఫస్ట్ టైమ్ కారు కొంటున్నారా? డీలర్లు ఈ 5 విషయాలు మీతో చెప్పరు

భారీగా బంగారం ధర పతనం.. మహిళల్లో ఆనందం, మార్కెట్లో రేటు ఎంతంటే..

స్టాక్‌మార్కెట్‌కు చమురు సెగ.. రూ. 6 లక్షల కోట్ల సంపద ఆవిరి

అక్టోబర్ 1 నుంచి ఫిక్స్‌డ్ డిపాజిట్‌ రూల్స్‌లో మార్పులు.. రిజర్వ్ బ్యాంక్ కొత్త నిబంధనలు ఇవే

సామాన్యులకు బిగ్ రిలీఫ్.. బ్యాంకుల సమ్మె వాయిదా, డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించిందా?

ఫిక్స్‌డ్ డిపాజిట్లకు పెట్టుబడి ప్రత్యామ్నాలు వెతుకుతున్న భారతీయులు.. ఎందుకంటే?

30 ఏళ్లు వచ్చేలోపు..ఈ 7ట్రిక్స్ పాటిస్తే, మీ ఫ్యూచర్ సెట్టైనట్టే!

Big Stories

Advertisement
×