E-Paper
Advertisement

శాటిలైట్ ఇంటర్నెట్ అంటే ఏంటి? అంతరిక్షం నుంచి మీ ఇంటికి నెట్‌వర్క్ ఎలా వస్తుంది?

శాటిలైట్ ఇంటర్నెట్ అంటే ఏంటి? అంతరిక్షం నుంచి మీ ఇంటికి నెట్‌వర్క్ ఎలా వస్తుంది?
Advertisement

Satellite Internet Mystery: ప్రస్తుత డిజిటల్ యుగంలో ఇంటర్నెట్ ప్రతి ఒక్కరికీ అత్యవసరంగా మారిపోయింది. ఆఫీసు పనులు, కాలేజీ అసైన్‌మెంట్లు, ఆన్‌లైన్ తరగతులు, వ్యాపారాలు.. దేనికైనా ఈ రోజుల్లో ఇంటర్నెట్ ఉండాల్సిందే. సాధారణంగా ఈ ఇంటర్నెట్ కనెక్షన్ ను వైర్లు, కేబుళ్ల ద్వారా ఇస్తారని తెలిసిందే. అయితే కొత్తగా ‘శాటిలైట్ ఇంటర్నెట్’ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అసలు శాటిలైట్ ఇంటర్నెట్ అంటే ఏంటి? అంతరిక్షం నుంచి మన ఇళ్లకు సిగ్నల్ ఎలా వస్తుందో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

అసలు శాటిలైట్ ఇంటర్నెట్ అంటే?

మనం వాడుతున్న బ్రాడ్‌బ్యాండ్ లేదా ఫైబర్ నెట్‌వర్క్ భూమి లోపల పొందుపరిచిన కేబుళ్ల ద్వారా ఇళ్లకు చేరుకుంటుంది. కానీ శాటిలైట్ ఇంటర్నెట్ విధానంలో ఎలాంటి కేబుళ్ల అవసరం ఉండదు. ఇది నింగిలో ఉండే ఉపగ్రహాల (శాటిలైట్లు) ద్వారా నేరుగా పనిచేస్తుంది. ముఖ్యంగా కొండ ప్రాంతాలు, మారుమూల గ్రామాలు, అడవులు, కేబుళ్లు వేయడానికి వీలులేని ప్రదేశాలకు ఈ ఇంటర్నెట్ ఒక కొండంత అండగా నిలుస్తుంది.

నింగి నుంచి నెట్‌వర్క్ ఎలా వస్తుంది?

Advertisement

శాటిలైట్ ఇంటర్నెట్ ప్రక్రియ పలు దశల్లో పనిచేస్తుంది. మొదటి దశలో భాగంగా ఇంటర్నెట్ సేవా సంస్థ (ISP) తన వద్ద ఉన్న గ్రౌండ్ స్టేషన్ నుంచి ఇంటర్నెట్ సిగ్నల్స్‌ను అంతరిక్షంలో ఉన్న శాటిలైట్‌కు పంపుతుంది. రెండో దశలో ఆ శాటిలైట్ సదరు సిగ్నల్‌ను తిరిగి మన ఇంటిపై లేదా గోడపై అమర్చిన డిష్ యాంటెన్నాకు ప్రసారం చేస్తుంది. ఇక మూడో దశలో డిష్ యాంటెన్నాకు అనుసంధానించిన మోడెమ్ (Modem) ఆ సిగ్నల్స్‌ను డేటాగా మారుస్తుంది. చివరిగా మోడెమ్‌కు కనెక్ట్ చేసిన వై-ఫై రూటర్ ద్వారా మన మొబైల్స్, లాప్‌టాప్‌లు, స్మార్ట్ టీవీలకు ఇంటర్నెట్ అందుతుంది.

దీనికి ఏ ఏ పరికరాలు అవసరం?

శాటిలైట్ ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకున్నప్పుడు సదరు సర్వీస్ ప్రొవైడరే కావలసిన పరికరాలను అందిస్తుంది. ఇందులో ప్రధానంగా ఒక డిష్ యాంటెన్నా, మోడెమ్ రూటర్, వాటిని కలిపే కేబుళ్లు ఉంటాయి. అయితే ఈ డిష్‌ను ఆకాశం స్పష్టంగా కనిపించేలా చెట్లు లేదా భవనాల అడ్డు లేని ప్రదేశంలో అమర్చుకోవాల్సి ఉంటుంది. ఆకాశం ఎంత స్పష్టంగా ఉంటే నెట్‌వర్క్ వేగం అంత బాగుంటుంది.

Advertisement

Also Read: ఎల్జీ కొత్త వాషింగ్ మిషన్లు.. బుర్ర బద్దలయ్యే క్రేజీ ఫీచర్లు.. మార్కెట్‌ షేక్ అవ్వడం పక్కా!

స్టార్ లింక్, జియో మధ్య పోటీ

ప్రస్తుతం భారత మార్కెట్లో కొన్ని కంపెనీలు శాటిలైట్ సేవలను అందిస్తున్నప్పటికీ రాబోయే రోజుల్లో ఈ రంగంలో పోటీ మరింత తీవ్రతరం కానుంది. ఇప్పటికీ హై-స్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులో లేని ప్రాంతాలకు ఇది ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయంగా మారుతోంది. ప్రపంచ ప్రసిద్ధ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్‌కు చెందిన ‘స్టార్‌లింక్’ (Starlink) సంస్థ కూడా భారతదేశంలో తన శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించడానికి చాలా కాలంగా కసరత్తు చేస్తోంది. అటు జియో సైతం ఇప్పటికే ఆ దశగా చర్యలు సైతం ప్రారంభించింది. ఇవి గనుక పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే దేశంలో డిజిటల్ విప్లవం మరొక మెట్టు ఎక్కడం ఖాయమని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Also Read: యూపీఐ వాడేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. భీమ్ యాప్‌లోకి కొత్తగా ‘MyUPI’ ఏఐ అసిస్టెంట్!

Tags

Related News

ఫోన్‌లో 2 సిమ్‌లు వాడితే బ్యాటరీ త్వరగా పాడవుతుందా? అసలు నిజమిదే!

ఎల్జీ కొత్త వాషింగ్ మిషన్లు.. బుర్ర బద్దలయ్యే క్రేజీ ఫీచర్లు.. మార్కెట్‌ షేక్ అవ్వడం పక్కా!

అమెజాన్ Vs ఫ్లిప్‌కార్ట్ సేల్..వస్తువులు కొనడానికి ఏది బెస్ట్?

ప్రైమ్ మెంబర్స్‌కు మాత్రమే అందే అద్భుతమైన లాభాలు!

యూపీఐ వాడేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. భీమ్ యాప్‌లోకి కొత్తగా ‘MyUPI’ ఏఐ అసిస్టెంట్!

రూమ్ చిన్నదైనా సౌండ్ మాత్రం అదుర్స్.. క్రిస్టల్ క్లియర్ ఆడియోనిచ్చే మినీ థియేటర్లు!

డేటా అక్కర్లేని వారికి గుడ్‌ న్యూస్.. Airtel, Jio, Vi నుంచి.. అత్యంత చౌకైన ప్లాన్స్ వచ్చేస్తున్నాయ్!

Big Stories

Advertisement
×