BigTV English

GOLD RATE IN DUBAI: దుబాయ్‌లో బంగారం ధర చాలా చీప్.. భారత్‌తో పోలిస్తే ఎంత డబ్బు ఆదా..?

GOLD RATE IN DUBAI: దుబాయ్‌లో బంగారం ధర చాలా చీప్.. భారత్‌తో పోలిస్తే ఎంత డబ్బు ఆదా..?

GOLD RATE IN DUBAI: బంగారం.. గోల్డ్.. స్వర్ణం.. దీనికి ఉండే క్రేజీనే వేరు.. భారతదేశంలో బంగారానికి డిమాండ్ ఎక్కువ. గోల్డ్ ధర లక్ష దాటినా కొనేందుకు మాత్రం ఎవరూ వెనుకాడరు. ఇక మహిళలకు అయితే బంగారం అంటే అపరిమితమైన ఇష్టం. అయితే మన దేశంలో కన్నా దుబాయిలో బంగారం ధర చాలా తక్కువగా ఉంటుంది. అందుకే దాన్ని బంగారు నగరంగా పిలుస్తుంటారు. ప్రపంచంలోని వివిధ దేశాల నంచి పెద్ద ఎత్తున గోల్డ్ ను కొనేందకు ఇక్కడకు వస్తుంటారు. దుబాయి నగరంలోనే బంగారం ఎందుకు కొంటారు..? అక్కడ ఎందుకు గోల్డ్ రేట్లు చీప్ గా ఉంటాయి..? మన దేశం కన్నా దుబాయి తక్కువ రేటుకే ఎందుకు బంగారం దొరుకుతుంది..? పసిడి నగరంగా దుబాయి విశ్వఖ్యాతిని ఎందుకు గడించింది..? అనే దాని గురించి ఈ స్టోరీలో క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.


దుబాయ్‌లో గోల్డ్ మైన్స్ ఉన్నాయా..?

దుబాయిలో ఒక్క గోల్డ్ మైన్ కూడా లేదు.. అయినా తక్కువ ధరకే బంగారం ఎలా దొరుకుతుంది.. అనేది చాలా మందికి డౌట్. అక్కడి మార్కెట్లో లభించే బంగారం అంతా ఆఫ్రికా దేశాలు, టర్కీ, రష్యా, స్విట్జర్లాండ్ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటారు. ఇక భారత్ కు , యూఏఈతో మంచి సంబంధాలు ఉంటాయి. మన దేశం ఏటా వందట టన్నుల బంగారాన్ని దుబాయి నుంచి దిగుమతి చేసుకుంటుంది. అందుకే ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు బలోపేతంగా ఉంటాయి. మన దేశ పౌరులు కూడా దుబాయ్‌ పర్యటనకు వెళ్లినప్పుడు గోల్డ్ ను కొని తెచ్చుకుంటారు. అయితే దీనికో లిమిట్ ఉంటుంది.. ఇష్టమొచ్చినంత బంగారాన్ని తెచ్చుకునే ఆస్కారం లేదు.


దుబాయ్ నుంచి ఎంత బంగారం తెచ్చుకోవచ్చు..?

సాధారణంగా మన దేశంలో డబ్బులు ఉంటే ఎంత బంగారం అయినా కొనుక్కోవచ్చు. దీనికో లిమిట్ అంటూ ఏం ఉండదు. మన దగ్గర ఉన్న డబ్బుపై ఆధారపడి ఉంటుంది. అయితే మన దేశ పౌరులు దుబాయ్ కి వెళ్లినప్పుడు బంగారం కొనడంపై కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఆ లిమిట్ కు మించి బంగారాన్ని మనం దేశానికి తీసుకురాలేం. మనం గరిష్టంగా ఒక కిలో బంగారం వరకు భారత్ కు తీసుకుని రావొచ్చు. అయితే దీనికో రూల్ ఉంది. ఆరు నెలలు విదేశాల్లో గడిపిన వారికి మాత్రమే ఈ రూల్ వర్తిస్తుంది. ఈ బంగారంపై అన్ని రకాల టాక్సెస్ పే చేయాలి. గోల్డ్ కొనుగోలు సర్టిఫికెట్లన్నీ కస్టమ్స్ అధికారులకు చూపించాల్సి ఉంటుంది. కేజీ కంటే ఎక్కువ బంగారం ఎట్టి పరిస్థితిల్లో తీసుకురాకూడదు.

మహిళలు ఎంత కొనొచ్చు..?

భారతదేశానికి చెందిన స్త్రీలు, అలాగే 15 ఏళ్ల లోపు బాలలు గరిష్టంగా 40 గ్రాముల గోల్డ్ లేదా.. రూ.1లక్ష విలువైన పసిడి ఆభరణాలను దుబాయి నుంచి కొనుక్కొని తీసుకురావొచ్చు. దీనికి ఎలాంటి టాక్స్ పే చేయాల్సిన పని లేదు.

పురుషులు ఎంత కొనొచ్చు..?

భారతదేశానికి చెందిన పురుషులు గరిష్ఠంగా 20 గ్రాముల గోల్డ్ లేదా రూ.50 వేల విలువైన పసిడి ఆభరణాలను ధరించి దుబాయ్ నుంచి కొనుక్కొని తీసుకురావొచ్చు. దీనికి కూడా ఎలాంటి టాక్స్ పే చేయాల్సిన పని లేదు.

ఎందుకు అక్కడ బంగారం ధర తక్కువ..?

ఇక ముఖ్య విషయానికి వస్తే.. అసలు భారత్ లో కన్నా దుబాయిలో బంగారం ధర చాలా తక్కువ. దీని మెయిన్ రీజన్ అక్క ట్యాక్స్ విధానం. దుబాయిలో బంగారం అమ్మకాలపై జీఎస్టీ (గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్) ఉండదు. కానీ ప్రతి అమ్మకంపై 5 శాతం విలువ గల వ్యాట్ (వాల్యూ యాడెడ్ ట్యాక్స్) ఉంటుంది. వ్యాట్ పై ఫుల్ రీఫండ్ కూడా ఉంటుంది. అయితే దీన్ని పొందాలంటే నిర్థిష్ట కాలపరిమితి అంటూ ఉంటుంది. అంటే ఫైనల్ గా ఎలాంటి ట్యాక్స్ లేకున్నా దుబాయి నగరంలో బంగారాన్ని కొనొచ్చు. వీటన్నింటి వల్లే దుబాయ్ గోల్డ్ సిటీగా పేరుపొందింది.

భారత్‌తో పోలి చూస్తే ఎంత డబ్బు ఆదా..?

భారత్, దుబాయ్ నగరాల్లో బంగారం కొంటే ఎంత డబ్బు ఆదా అవుతుందంటే…. దుబాయ్ నగరంలో పది గ్రాముల బంగారం లేదా రూ.లక్ష విలువైన బంగారాన్ని కొనుగోలు చేస్తే దాదాపు రూ.3500 నుంచి రూ.4వేల వరకు డబ్బు ఆదా చేసుకోవచ్చు. అదే మీరు 40 గ్రాముల బంగారం లేదా రూ.4లక్షల విలువైన బంగారాన్ని కొనుగోలు చేస్తే 15 నుంచి రూ.16వేల వరకు డబ్బును ఆదా చేసుకోవచ్చు. అంటే దుబాయ్ లో కిలో బంగారం కొంటే.. రూ.4 లక్షల డబ్బు ఆదా చేసుకోవచ్చన్న మాట. అయితే బంగారాన్ని కొనేటప్పుడు అక్కడ బరీఖ్ సర్టిఫికేషన్ జారీ చేసిన గోల్డ్ ను చూసి మరీ తీసుకోవాలి. మనదేశంలో బంగారానికి ఉండే హాల్ మార్క్ లాంటిదే.. బరీఖ్ సర్టిఫికేషన్..

ALSO READ: Police Jobs: భారీగా పోలీస్ ఉద్యోగాలు.. టెన్త్ పాసైతే అప్లై చేసుకోవచ్చు.. పూర్తి వివరాలివే..!

Related News

Post Office Scheme: రూ. 5 లక్షల పెట్టుబడితో రూ. 10 లక్షల ఆదాయం.. వెంటనే ట్రై చేయండి!

BSNL Offers: రోజూ 2జీబీ డేటా, 160 రోజుల వ్యాలిడిటీ.. సెప్టెంబర్ లో BSNL బెస్ట్ రీఛార్జ్ ప్లాన్ ఇదే!

Jio Offers: జియో రీఛార్జ్ చేసుకోండి, క్రేజీ క్యాష్ బ్యాక్ ఆఫర్ పట్టేయండి!

Gold Rate: భారీగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతో తెలిస్తే షాక్..!

Credit Card Limit: క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామనే ఆఫర్ చూసి ఆశపడుతున్నారా…అయితే ఇది మీ కోసం…

Big Stories

×