OTT Movie : కొన్ని సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు క్రేజీగా ఉంటాయి. ఊహించని ట్విస్టులు, బెదరగొట్టే థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో స్టోరీ హీట్ పెంచుతుంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా, ప్రశాంతంగా ఉన్న ఒక జంట జీవితంలోకి, ఒక సైకో ఎంట్రీ ఇవ్వడంతో అసలు కథ మొదలవుతుంది. ప్రతిక్షణం ఈ సినిమా సస్పెన్స్ తో సీట్ ఎడ్జ్ థ్రిల్ ని ఇస్తుంది. అయితే ఈ సినిమా పెద్దలకు మాత్రమే. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే …
‘డెడ్లీ వర్చ్యూస్: లవ్. హానర్. ఓబే’ (Deadly Virtues: Love.Honour.Obey). 2014లో వచ్చిన హారర్ థ్రిల్లర్ సినిమా. ఆట్ డి జాంగ్ దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో మాజ్కో, మ్యాట్ బార్బర్, ఎడ్వర్డ్ ఆక్రౌట్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2014 ఏప్రిల్ 11న ఇమాజిన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్ అయింది. ఆ తరువాత 2015లో థియేటర్లలో విడుదల అయింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
డిన్నా ఆమె భర్త రాబర్ట్ ఒక అందమైన ఇంట్లో సంతోషంగా జీవిస్తుంటారు. వాళ్ళు ఒకరిని ఒకరు గాఢంగా ప్రేమించుకుంటూ ఉంటారు. అయితే వీళ్ళ జీవితం ఒక్కసారిగా తలకిందులు అవుతుంది. ఒక రోజు రాత్రి, ఒక విచిత్రమైన సైకో వాళ్ల ఇంట్లోకి ఒక వస్తాడు. అతను వచ్చిరాగానే రాబర్ట్‌ను కట్టేసి కొడతాడు. డిన్నాను కూడా బెదిరిస్తాడు. ఈ సైకో మనిషి డిన్నాతో వీకెండ్ మొత్తం ఒక భయంకరమైన గేమ్ ప్లే చేస్తాడు. అతను డిన్నాకు లవ్, హానర్, ఓబే అనే మూడు నియమాలు చెబుతాడు. కానీ వాటిని విచిత్రంగా ఉపయోగిస్తాడు. డిన్నా భయపడుతూ, రాబర్ట్‌ను కాపాడడానికి అతను చెప్పినట్లు చేస్తుంది. ఈ కథ సస్పెన్స్‌తో చెమటలు పట్టిస్తుంది. ఆ సైకో డిన్నాను మానసికంగా, శారీరకంగా టార్చర్ చేస్తాడు. రాబర్ట్ కట్టేసి ఉండడంతో, డిన్నా ఒంటరిగా అతని గేమ్‌లో చిక్కుకుంటుంది.
Read Also : అక్క బాయ్ ఫ్రెండ్ తో చెల్లి… నరాలు జివ్వుమన్పించే సీన్లు మావా… ఇయర్ ఫోన్స్ మాత్రం మర్చిపోవద్దు
ఆ సైకో రాబర్ట్ ప్రేమను టెస్ట్ చేస్తూ, వాళ్ల మధ్య భయాలు సృష్టిస్తాడు. డిన్నా మొదట భయపడినా, క్రమంగా ఆ సైకో మైండ్ సెట్ ని అర్థం చేసుకుని తెలివిగా నడుచుకుంటుంది. రాబర్ట్ కూడా డిన్నాను కాపాడడానికి ట్రై చేస్తాడు, కానీ అతను కట్టేసి ఉండటంతో ఏమి చేయలేని పరిస్థితి ఉంటుంది. అయితే డిన్నాను ఆ సైకో ప్రేమించడం మొదలెడతాడు. ఈ సమయంలో కథ ఊహించని ట్విస్టులు తీసుకుంటుంది. ఆ సైకో నుంచి ఈ జంట బయట పడుతుందా ? అతను ఎందుకు వీళ్ళను టార్చర్ చేస్తాడు ? ఈ క్లైమాక్స్ ఏమిటి ? అనే విషయాలను, ఈ థ్రిల్లర్ సినిమాని చూసి తెలుసుకోవాల్సిందే.