Gold Rate Today: బంగారం ధరలు ఒక రోజు ఆకాశాన్ని తాకేలా ఎగబాకితే, మరుసటి రోజు ఊహించని విధంగా కిందికి దిగుతుంది. మార్కెట్ బోర్డులపై ప్రతి గంటకో మార్పు ఉదయం చూసిన రేటు సాయంత్రానికి మారిపోతుంది. వినాయక చవితి దగ్గర పడుతుండటంతో కొనుగోలు ఉత్సాహం పెరుగుతుండగా ఇప్పుడే కొంటే లాభమా? లేక ఇంకో రోజు ఆగితే ఇంకా తగ్గుతాయా? అనే సందేహం ప్రతి ఇంటి చర్చ. ప్రపంచ బంగారం ధరలు, రూపాయి, డాలర్ మారకం, స్థానిక డిమాండ్ ఈ మూడు ఎప్పుడు ఏ దిశలో లాగితే ఆ దిశలోనే రేటు పరుగులు పెడుతోంది. నిన్న ఆదివారం ధరలు పెరిగి షాక్ ఇచ్చినా, ఈ రోజు మాత్రం కాస్త ఊరట లభించింది.
ఆగస్టు 25, 2025 ఉదయం 10 గంటల వరకు వచ్చిన సమాచారం ప్రకారం, 10 గ్రాముల బంగారం ధర రూ.110 తగ్గి రూ.1,01,510కు చేరింది. 100 గ్రాముల బంగారం ధర కూడా రూ.1,100 తగ్గి రూ.10,15,100 వద్ద నిలిచింది. గ్రాములవారీగా చూస్తే, 24 క్యారట్ల బంగారం గ్రాము రూ.10,151, కాగా 22 క్యారట్ల రూ.9,305, 18 క్యారట్ల రూ.7,614గా ఉంది.
Also Read: Hair Mask: సిల్కీ జుట్టు కోసం.. బెస్ట్ హెయిర్ మాస్క్ !
రాష్ట్రాల్లో బంగారం ధర
దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా ఇదే ధోరణి కనిపిస్తోంది.హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై, కలకత్తాల్లో 24 క్యారట్ల ధర రూ.1,01,510గా ఉండగా, చెన్నైలో మాత్రం కాస్త ఎక్కువగా రూ.1,01,510కి తోడు 18 క్యారట్ల ధర రూ.77,700గా ఉంది. ఢిల్లీలో 24 క్యారట్ల ధర రూ.1,01,660గా, అహ్మదాబాద్‌లో రూ.1,01,560గా ఉంది. ఇలా నగరాల వారీగా చిన్న చిన్న తేడాలు ఉన్నా, మొత్తంగా ధరలు తగ్గడం వినియోగదారులకు ఊరట కలిగిస్తోంది.
పండుగ సీజన్‌లో డిమాండ్
ఈ తగ్గుదల వెనుక కారణాలు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా పడిపోవడం, రూపాయి విలువలో స్థిరత్వం ఉండడమే. అయితే పండుగ సీజన్‌లో డిమాండ్ పెరగడం వల్ల ధరలు మళ్లీ ఎగబాకే అవకాశం ఉంది. అందుకే చాలా మంది కొనుగోలుదారులు ఇప్పుడు కొనకపోతే తర్వాత మళ్లీ పెరిగితే ఏమవుతుందోనన్న ఆలోచనలో ఉన్నారు. పండుగల సమయంలో బంగారం కొనడం ఆనవాయితీ కావడంతో, చాలామంది ప్రస్తుత తగ్గుదలను ఉపయోగించుకోవాలని చూస్తున్నారు.
మొత్తానికి, ఈ రోజు వచ్చిన తగ్గుదల పసిడి ప్రియులకు ఒక చిన్న ఊరటే అయినా, మార్కెట్ పరిస్థితులు ఎప్పుడు మారుతాయో చెప్పలేం. అందుకే ధరలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో, బడ్జెట్‌కు తగ్గట్టు ఇప్పుడే కొనడం కొంతమందికి మంచిగా అనిపిస్తోంది. రాబోయే రోజుల్లో బంగారం ధరలు ఎలా కదులుతాయో ఆసక్తిగా చూడాల్సిందే.