BigTV English

Arshdeep Singh : అర్ష్ దీప్ కోసం ఆ తల్లి పడ్డ కష్టం అంతా ఇంతా కాదు.. ఏకంగా 13 కిలోమీటర్లు సైకిల్ తొక్కి

Arshdeep Singh :  అర్ష్ దీప్ కోసం ఆ తల్లి పడ్డ కష్టం అంతా ఇంతా కాదు.. ఏకంగా 13 కిలోమీటర్లు సైకిల్ తొక్కి

Arshdeep Singh :  టీమిండియా టీ-20 బౌలర్ అర్ష్ దీప్ సింగ్ గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. తాను టీ-20 వరల్డ్ కప్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. తాజాగా అర్ష్ దీప్ సింగ్ గురించి ఓ వార్త వైరల్ అవుతోంది. ఇటీవల అతను తన తల్లి గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అర్ష్ దీప్ 7 ఏళ్ల బాలుడిగా ఉన్నప్పుడే తన తండ్రి ముందు తొలిసారిగా బౌలింగ్ చేశాడు. అర్ష్ దీప్ సింగ్ ప్రతిభను గుర్తించిన దర్శన్ సింగ్.. అర్ష్ దీప్ కి క్రికెట్ పై ఆసక్తి కలిగేలా చేశాడు. ఛండీగఢ్ లో కోచ్ జస్వంత్ రాయ్ ఆధ్వర్యంలో శిక్షణ తీసుకున్నాడు. అర్ష్ దీప్ కోచ్ దగ్గర కోచింగ్ తీసుకోవడానికి కారణం అతని తల్లి బల్జీత్ కౌర్. ప్రతీ రోజు ఆమె ఖరార్ నుంచి 13 కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కుతూ అర్ష్ దీప్ దీప్ ని క్రికెట్ ప్రాక్టీస్ కు చండీగఢ్ తీసుకెళ్లింది. ఆమె అలా సైకిల్ తొక్కి అర్ష్ దీప్ ని ప్రాక్టీస్ చేయించేలా చేయడంతో ప్రస్తుతం మంచి బౌలర్ గా రాణిస్తున్నాడు.


Also Read : Sanju Samson : సంజు శాంసన్ విధ్వసం.. సెంచరీతో గిల్ కు స్ట్రాంగ్ వార్నింగ్..!

ఒకవేళ తన తల్లి ఇంత దూరం ఎవ్వరూ తీసుకెళ్తారని వదిలేస్తే.. అర్ష్ దీప్ టీమిండియా క్రికెట్ లోకి వచ్చే వాడే కాదు. తన తల్లిదండ్రుల సహకారంతోనే అర్ష్ దీప్ ఇప్పుడు స్టార్ బౌలర్ గా ఎదిగాడని చెప్పవచ్చు. ప్రస్తుతం ఆసియా కప్ 2025 కి ఎంపికయ్యాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్ లో కూడా అద్భుతంగా రాణించాడు. వాస్తవానికి అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ 2025లో టీమిండియా పేసర్ టెస్ట్ మ్యాచ్ లో ఆరంగేట్రం చేస్తాడని అంతా భావించారు. కానీ ఈ యువ పేసర్ మాత్రం అన్ని మ్యాచ్ లకు బెంచ్ కే పరిమితమయ్యాడు. తొలి మూడు టెస్టులకు జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్ వంటి ప్రధాన పేసర్లు అందుబాటులో ఉండటంతో అర్ష్ దీప్ కి అవకాశం దక్కలేదు. 


మాంచెస్టర్ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్ కి ముందు ఆకాశ్ దీప్ గాయపడటంతో అర్ష్ దీప్ కి ఛాన్స్ ఇవ్వాలని టీమిండియా మేనేజ్ మెంట్ భావించింది. కానీ దురదృష్టావశాత్తూ ప్రాక్టీస్ సమయంలో అర్ష్ దీప్ చేతి వేలికి గాయం అయింది. దీంతో అతని స్థానంలో అనూహ్యంగా అన్షుల్ కాంబోజ్ కి తుది జట్టులో చోటు లభించింది. ఇక భారత జట్టుకు వైట్ బాల్ క్రికెట్ లో నిలకడగా రాణిస్తున్న బౌలర్ అర్ష్ దీప్ సింగ్. ఇప్పుడు ఒక చారిత్రాత్మక రికార్డు చేరువలో ఉన్నాడు. ఆసియా కప్ 2025లో ఈ అరుదైన రికార్డును సాధించే అవకాశం ఉంది. అర్ష్ దీప్ సింగ్ ప్రస్తుతం టీ-20 క్రికెట్ లో 99 వికెట్లు సాధించారు. ఇంకొక వికెట్ తీస్తే.. టీ-20 ఫార్మాట్ లో 100 వికెట్లు తొలి భారత బౌలర్ గా చరిత్ర సృష్టిస్తాడు. సెప్టెంబర్ 10న భారత్ యూఏఈతో తలపడనున్న విషయం తెలిసిందే. ఆ మ్యాచ్ లో రికార్డు నెలకొల్పే అవకాశముంది. 

 

Related News

Cricketers : క్రికెటర్లు చేతి వేళ్లకు టేప్ ఎందుకు వేసుకుంటారు.. దీని వెనుక రహస్యం ఏంటి

Head – Abhishek : అభిషేక్ ఒకలా.. హెడ్ మరోలా.. SRH కు ఎక్కడ దొరికార్రా మీరు..

Harshit Rana : గంభీర్ ఎంతకు తెగించాడు రా.. ఏకంగా హర్షిత్ రాణాకు వైస్ కెప్టెన్సీ?

Vimal Pan Masala : టీమిండియా స్పాన్సర్ గా గుట్కా కంపెనీ.. ఆసియా కప్ కంటే ముందు కీలక పరిణామం!

Watch Video: సిక్స్ కొట్టి గుండెపోటుతో చనిపోయిన క్రికెటర్.. వీడియో చూస్తే దిమ్మతిరగాల్సిందే

Ajinkya Rahane : కోహ్లీ, రోహిత్, పూజారా, అశ్విన్ రిటైర్మెంట్.. అజింక్య రహానేపై ట్రోలింగ్

Big Stories

×