Sanju Samson: ఆసియా కప్ 2025 ప్రారంభం కావడానికి మరో 14 రోజుల సమయం మాత్రమే ఉంది. యూఏఈ వేదికగా సెప్టెంబర్ 9 నుండి 28వ తేదీ వరకు ఆసియా కప్ టోర్నీ జరగబోతోంది. ఈ టోర్నమెంట్ కోసం ఇప్పటికే బీసీసీ జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టుకు సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్ గా వ్యవహరిస్తుండగా.. గిల్ ని వైస్ కెప్టెన్ గా నియమించారు. అయితే టీ-20 లలో గిల్ రీ ఎంట్రీ ఇవ్వడంతో వికెట్ కీపర్, బ్యాటర్ సంజూ శాంసన్ ప్లేయింగ్ లెవెన్ లో ఆడే విషయంపై అనేక అనుమానాలు నెలకొన్నాయి.
Also Read: Ipl 2026: కావ్య పాప బిగ్ స్కెచ్… ఏకంగా ఆ 4 గురు ప్లేయర్లపై వేటు.. లిస్టులో షమీ కూడా!
అభిషేక్ శర్మతో కలిసి గిల్ ఓపెనర్ గా వస్తాడనే విషయాన్ని టీమ్ ఇండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ బహిరంగంగానే ప్రకటించారు. అలాగే మరోవైపు వీరిద్దరిని ఓపెనర్ గా పంపే ప్రయత్నాలు కోచ్ గౌతమ్ గంభీర్ కూడా చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో టీమిండియాలో తన భవిష్యత్తుపై నెలకొన్న అనిశ్చితి, తనపై వస్తున్న విమర్శలకు తాజాగా సంజూ శాంసన్ తన బ్యాట్ తోనే సమాధానం ఇచ్చాడు. ఆసియా కప్ 2025 సమీపిస్తున్న వేళ.. కేరళ క్రికెట్ లీగ్ లో ఓపెనర్ గా బరిలోకి దిగిన సంజూ.. కేవలం 42 బంతుల్లోనే విద్వంసక సెంచరీ తో చెలరేగాడు.
కేరళ క్రికెట్ లీగ్ లో కొచ్చి బ్లూ టైగర్స్ కి ప్రాతినిధ్యం వహిస్తున్న శాంసన్.. ఆదివారం రోజు అరైస్ కొల్లాం సైలర్స్ తో జరిగిన మ్యాచ్ లో ఈ విధ్వంసం సృష్టించాడు. ఆదివారం ఏరీస్ కొల్లం సేలర్స్ తో జరిగిన మ్యాచ్ లో 42 బంతుల్లో 13 ఫోర్లు, 5 భారీ సిక్సర్లతో పరుగుల వర్షం కురిపించాడు. మొత్తంగా 51 బంతుల్లో 121 పరుగులు చేసి అద్భుత శతకాన్ని నమోదు చేసి జట్టుకు భరోసా ఇచ్చాడు. ఇక చివరిలో సంజు అవుట్ అయినప్పటికీ.. ఆశిక్ 18 బంతుల్లో 45 పరుగులు చేసి.. చివరి బంతికి సిక్స్ కొట్టి అనూహ్య విజయాన్ని అందించాడు. ముఖ్యంగా సంజు ప్రత్యర్థి బౌలర్లను ఉతికారేశాడు.
అతడి విధ్వంసకర బ్యాటింగ్ ధాటికి గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం బౌండరీలు చిన్నబోయాయి. మొదటి బంతి నుండే ఎటాక్ ప్రారంభించిన సంజూ.. 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ అందుకున్నాడు. తద్వారా కేరళ క్రికెట్ లీగ్ చరిత్రలో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు. ఇక 121 పరుగులు చేశాక సంజూ ని.. కొల్లాం పేసర్ బిజు నారాయణన్ అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. చివరి ఓవర్ లో కొచ్చి విజయానికి 17 పరుగులు అవసరం ఉన్న సమయంలో.. కొచ్చి బ్యాటర్ మహమ్మద్ ఆషిక్ తన జట్టుకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు.
Also Read: APL 2025: APL-2025 విజేతగా తుంగభద్ర వారియర్స్… పుష్ప రేంజ్ లో సెలబ్రేషన్స్… ప్రైజ్ మనీ ఎంత అంటే
ఇక సంజూ ఓపెనర్ గా వచ్చి సెంచరీ బాదడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆసియా కప్ లో సంజూ ని మిడిల్ ఆర్డర్ కి పరిమితం చేయొచ్చు, లేదా పూర్తిగా పక్కన పెట్టవచ్చనే వార్తలు వస్తున్న నేపథ్యంలో.. తన బ్యాట్ తో గట్టి సమాధానం ఇచ్చాడు. మరోవైపు ఇటీవల మిడిల్ ఆర్డర్ లో కూడా తన స్థానాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నించాడు సంజూ. కేరళ లీగ్ లోని గత మ్యాచ్ లో ఆరవ స్థానంలో బ్యాటింగ్ కి వచ్చి.. 22 బంతులు అడి కేవలం 13 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఆ వైఫల్యం తర్వాత ఇప్పుడు ఓపెనర్ గా వచ్చి మెరుపు సెంచరీ తో తన సత్తా చాటడం విశేషం. ఇక ఆసియా కప్ 2025 టోర్నీలో భారత జట్టు సెప్టెంబర్ 10న యూఏఈ తో జరిగే మ్యాచ్ తో తన ప్రస్థానాన్ని ప్రారంభించనుంది. అలాగే సెప్టెంబర్ 14న దాయాది పాకిస్తాన్ తో కీలక మ్యాచ్ ఆడబోతోంది. ఇలాంటి సమయంలో సంజూ సెంచరీ చేయడంతో.. ఆసియా కప్ కి ముందే అతడు ప్రమాదకరంగా మారుతున్నాడు అంటూ అభిప్రాయపడుతున్నారు భారత క్రీడాభిమానులు.
Sanju Samson smashes the fastest 50 of the Federal Bank Kerala Cricket League.
The Tiger is turning the waves into his hunting ground. 🐅⚡️#KCLSeason2 #KCL2025 pic.twitter.com/3SnLooKhIR
— Kerala Cricket League (@KCL_t20) August 24, 2025