Gold Rate Today: పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. మంగళవారం నాడు కాస్త దిగొచ్చిన బంగారం ధరలు.. ఈరోజు(జూన్ 18th)న మళ్లీపెరిగాయి. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,00,910 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 92,500 వద్ద కొనసాగుతోంది.
బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణాలు.. గ్లోబల్ మార్కెట్‌ల్లో ఉన్న అనిశ్చితి, డాలర్ మారక విలువలో మార్పులు, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్ల పెరుగుదల, పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కూడా బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావించేలా చేస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్, రష్యా వార్‌కు భిన్నంగా ఉంది ఇరాన్‌లోని పరిస్థితి. ఇజ్రాయెల్ దాడులకు.. ఇరాన్‌లోని రైలు, రోడ్డు, ఇతర రవాణా వ్యవస్థలు దెబ్బతిన్నాయి. దీంతో సరిహద్దుల వరకు స్థానికంగా ఉన్న భారతీయులు రావడం కష్టమైన పని. ఇవన్నీ గమనించే కేంద్రం..టెహరాన్ సహా ఇరాన్‌లోని దాడులు జరుగుతున్న ప్రాంతాలకు భారతీయులు దూరంగా ఉండాలని సూచించింది. మరింత సమాచారం కోసం భారతయ దౌత్య అధికారులను సంప్రదించాలని సూచిస్తోంది. ప్రస్తుతం ఇరాన్‌లో విద్యార్థులు, ఉద్యోగులు కలిపి పది వేల మంది వరకు భారతీయులు ఉన్నట్లుగా అంచనా.
బంగారం ధరలు ఇలా..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.92,500 పలుకుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,00,910 వద్ద ట్రేడ్ అవుతోంది.
విజయవాడలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.92,500 ఉండగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,00,910 వద్ద కొనసాగుతోంది.
వైజాగ్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.92,500 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,00,910 ఉంది.
రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.92,650 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర 1,01,060 వద్ద కొనసాగుతోంది.
చెన్నైలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.92,500 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,00,910 వద్ద కొనసాగుతోంది.
ముంబై, కేరళ, కోల్ కత్తాలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.92,500 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,00,910 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.
వెండి ధరలు ఇలా..
వెండి ధరలు కూడా పరుగులు పెడుతున్నాయి. ఈరోజు వెండి ధరలు చూస్తే.. చెన్నై, హైదరాబాద్, కేరళ, వైజాగ్‌లో కిలో వెండి ధర రూ.1,21,000 కి చేరుకుంది.
ముంబై, కోల్ కత్తా, బెంగళూరు, ఢిల్లీలో కిలో వెండి ధర రూ.1,11, 000 వద్ద ట్రేడ్ అవుతోంది.