Gold Rates: పండుగ వేళ మహిళలకు, గోల్డ్ కొనుగోలు చేసేవారికి బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే బంగారం ధరలు భారీగా పెరిగాయి. గత వారం నుంచి ధరల్లో మార్పులు చేర్పులు చోటుచేసుకుంటున్నాయి. గురువారం నాడు బంగారం ధరల్లో స్వల్ప ఊరటనిచ్చినా.. ఈరోజు(జనవరి09)న పసిడి ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 350 పెరిగి.. రూ.72,600కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.380 పెరిగి రూ.79,200 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల 8 గ్రాముల బంగారం ధర రూ.58,080 ఉంది. 24 క్యారెట్ల 8 గ్రాముల బంగారం ధర రూ.63,360 వద్ద కొనసాగుతోంది. తగ్గుతూ పోతున్న పసిడి మళ్లీ ఊపందుకోవడానికి.. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులే దీనికి కారణం అని నిపుణులు చెబుతున్నారు. ఇక పలు నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.
ఏపీ, తెలంగాణలో బంగారం ధరలు చూస్తే..
హైదరాబాద్, తెలంగాణలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.72,600 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,200 ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 72,600 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,200 వద్ద కొనసాగుతోంది.
విశాఖపట్నం, గుంటూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.72,600 ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,200 ఉంది.
పలు నగరాల్లో గోల్డ్ రేట్స్ ఇలా..
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.72,750 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,350 ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.72,600 .. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,200 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.
బెంగుళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.72,600 పలుకుతోంది.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,200 వద్ద కొనసాగుతోంది.
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.72,600 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,200 ఉంది.
కోల్ కతా, పుణె మొదలైన నగరాల్లో ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.72,600 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,200 పలుకుతోంది.
వెండి ధరలు ఇలా..
పసిడి ధరలు అమాంతం పెరుగుతుంటే.. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతూ.. సిల్వర్ ప్రియులను ఆకర్షిస్తోంది. ఈరోజు వెండి ధరలు చూస్తే.. చెన్నై, హైదరాబాద్, విజయవాడ, కేరళలో కిలో వెండి ధర రూ.1,00,000 వద్ద కొనసాగుతోంది.
ముంబై, ఢిల్లీ, కోల్ కతా, పుణె, ఇతర నగరాల్లో కిలో వెండి ధర రూ.92,500 ఉంది.