Daaku Maharaj :ప్రముఖ డైరెక్టర్ బాబీ కొల్లి (Bobby Kolli)దర్శకత్వంలో నటసింహ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) నటిస్తున్న తాజా చిత్రం ‘డాకు మహారాజ్’. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకరా స్టూడియోస్ బ్యానర్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంక్రాంతి రేసులో నిలిచిన ఈ సినిమా ఈనెల 12వ తేదీన విడుదల కాబోతోంది. మరోవైపు విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాలు వేగంగా చేపట్టింది. అందులో భాగంగానే ఈరోజు సాయంత్రం రాయలసీమ అనంతపురంలో ‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. అలాగే ఈ సినిమాలోని బాలకృష్ణ పాత్రకు సంబంధించి డాకు గెటప్ లో ఉన్న భారీ కటౌట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాదు ఈ కార్యక్రమానికి మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) కూడా చీఫ్ గెస్ట్ గా రాబోతున్నట్లు ప్రకటించారు.
ఇలా ఒకవైపు అన్ని ఏర్పాట్లు పూర్తయి, ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరగబోతుందని అందరూ అనుకునే లోపే.. సడన్ గా ఈవెంట్ ను క్యాన్సిల్ చేస్తూ.. బాలకృష్ణ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.. నిన్న సాయంత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి దర్శనంలో భాగంగా టికెట్ క్యూ లైన్ లో తొక్కిసలాట జరిగింది. భక్తుల మధ్య జరిగిన ఈ తొక్కిసలాటలో ఏకంగా 6 మంది భక్తులు ప్రాణాలు కోల్పోగా.. మరి కొంతమందికి గాయాలయ్యాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని బాలకృష్ణ ఒక ప్రకటన విడుదల చేశారు. “తిరుపతిలో జరిగిన తొక్కిసలాట కారణంగా భక్తులు చనిపోయారు. ఈ విషాదకర సందర్భంలో అనంతపురంలో జరగాల్సిన డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపడం సముచితం కాదు అనే ఉద్దేశంతోనే రద్దు చేస్తున్నామని” ఆయన తెలిపారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్..
ఈ విషయం తెలిసి అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన హీరోని, నాయకుడిని కళ్ళారా చూడాలని, కలవాలి అని ఎంతోమంది ఎన్నో రకాల ప్లాన్లు వేసుకున్న విషయం తెలిసిందే. అయితే నిన్న జరిగిన తొక్కిసలాట కారణంగానే ఇప్పుడు ఈవెంట్ క్యాన్సిల్ అయింది. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ బాధలో కూడా నందమూరి, బాలయ్య అభిమానులు ఒక సెంటిమెంట్ ను వెతుక్కోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
బాధలో కూడా సెంటిమెంట్ వెతుక్కుంటున్న అభిమానులు..
అసలు విషయంలోకి వెళితే.. నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్(Jr.NTR ) ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఆరేళ్ల గ్యాప్ తీసుకొని సోలో హీరోగా ‘దేవర’ సినిమా చేశారు.అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా అన్ని ఏర్పాట్లు చేసి చివర్లో సడన్ గా క్యాన్సిల్ చేశారు. అయితే ఇలా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగకుండానే.. ఈ సినిమా ఏకంగా రూ.500 కోట్లు కలెక్షన్ వసూల్ చేసి రికార్డు సృష్టించింది. ఇప్పుడు బాలయ్య సినిమాకి కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయింది. కాబట్టి ఈ సినిమా కూడా రూ.500 కోట్లు రాబడుతుందని, ఇది బాలయ్య కెరియర్ లోనే తొలిసారి రూ.500 కోట్లు రాబట్టిన మూవీగా నిలుస్తుందని నందమూరి అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
దేవర సెంటిమెంట్ బాబాయ్ మూవీకి రిపీట్..
అంతేకాదు ఇక్కడ రెండవ సెంటిమెంట్ ను కూడా వారు గుర్తు చేస్తూ ఉండడం గమనార్హం. అసలు విషయంలోకి వెళ్తే.. హైదరాబాద్లో ఎన్టీఆర్ దేవర మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలనుకున్నారు. అయితే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరికొన్ని గంటల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ మొదలు పెట్టాల్సి ఉంది. కానీ అనుకోని రీతిలో అభిమానులు ఎక్కువ సంఖ్యలో రావడంతో, రోడ్డులన్నీ బ్లాక్ చేశారు. దాంతో తొక్కిసలాట జరిగింది. ఇక ఎన్టీఆర్ వస్తే తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని పోలీసులు చెప్పడంతో ఎన్టీఆర్ తో సహా చిత్ర బృందం ఎవరూ కూడా అక్కడికి రాలేదు. దాంతో ఈవెంట్ క్యాన్సిల్ అయింది. అలా తొక్కిసలాట జరగడం, ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడం.. ఈ రెండు చిత్రాలకి కూడా సేమ్.. కాబట్టి ఎన్టీఆర్ దేవర లాగే బాలకృష్ణ డాకు మహారాజ్ కూడా సక్సెస్ అవుతుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మరి అభిమానుల సెంటిమెంట్ ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.