BigTV English

Hero Motocorp Price: వాహనదారులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరగనున్న హీరో బైక్స్ ధరలు..!

Hero Motocorp Price: వాహనదారులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరగనున్న హీరో బైక్స్ ధరలు..!

Hero MotoCorp Price Increase: దేశంలోని అతిపెద్ద ద్విచక్ర వాహన సంస్థ హీరో మోటోకార్ప్ తన కస్టమర్లకు బ్యాడ్ న్యూస్ చెప్పింది. జూలై 1 నుంచి ధరలు పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. దీని ప్రకారం మీరు జూన్ 30 లోపు హీరో టూ వీలర్లను కొనుగోలు చేస్తే తక్కువ ధరకే లభిస్తాయి. ఇన్‌పుట్ ధర పెరగడం వల్ల ద్విచక్ర వాహనాల ధరలను పెంచాల్సి వచ్చిందని హీరో మోటోకార్ప్ తెలిపింది. వచ్చే నెల నుండి మీరు కొత్త హీరో బైక్ లేదా స్కూటర్ కొనుగోలు చేయడానికి ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. కొన్నేళ్ల క్రితం వరకు వాహనాల ధరలు ఏడాదికి ఒక్కసారి మాత్రమే పెరిగేవని, కానీ ఇప్పుడు ఏడాదికి రెండు, మూడు సార్లు ధరలు పెంచుతున్నారు.


హీరో మోటోకార్ప్ బైక్‌లు, స్కూటర్ల ధరలను రూ. 1500 వరకు పెంచింది. ఇది జూలై 1 నుండి అమలులోకి వస్తుంది. ధరల పెరుగుదల అనేది మోడల్, దాని వేరియంట్‌లపై ఆధారపడి ఉంటుంది. అంటే బైక్ ఎంత ఖరీదైతే అంత ధర పెరుగుతుంది. ప్రస్తుతం హీరో వద్ద 100సీసీ నుంచి ప్రీమియం బైక్‌లు ఉన్నాయి. కంపెనీ స్కూటర్ పోర్ట్‌ఫోలియో కూడా చాలా పెద్దది. కంపెనీ నిరంతరం అనేక కొత్త మోడల్స్‌ను తీసుకొస్తుంది.

Also Read: Auto Expo 2025: ఈ ఐదు కార్లపైనే అందరిచూపు.. మైండ్ బ్లాక్ చేస్తున్న రేంజ్.. దుమ్ములేచిపోద్ది!

 

హీరో మోటోకార్ప్ టాప్ మోడల్స్

  • Splendor Plus
  • HF Deluxe
  • HF100
  • Glamour Bike
  • Passion
  • Super Splendor

స్ప్లెండర్ ప్లస్ నెం.1 బైక్‌గా అవతరించింది. మే నెలలో బెస్ట్ సెల్లింగ్ బైక్‌ల జాబితాలో స్ప్లెండర్ ప్లస్ ముందంజలో ఉంది. గత నెలలో 3,04,663 యూనిట్ల స్ప్లెండర్ విక్రయించగా, గతేడాది మే నెలలోనే 3,42,526 యూనిట్ల స్ప్లెండర్ అమ్ముడైంది. ప్రస్తుతం ఈ బైక్ మార్కెట్ వాటా 36.03 శాతం. కస్టమర్‌లు ఈ బైక్‌ను ఎంతగానో ఇష్టపడుతున్నారు. కాబట్టి ఈ బైక్‌లోని టాప్ ఫీచర్ల గురించి తెలుసుకుందాం.

Also Read: స్కూటర్లకు LPG కిట్లు.. గ్యాస్ ఎలా నింపుతారు? మైలేజీ ఎంత ఇస్తుందో తెలుసా?

ఇంజన్ గురించి మాట్లాడితే బైక్ 100cc సింగిల్-సిలిండర్ ఇంజన్‌ను కలిగి ఉంది. ఇది 7.9 bhp పవర్, 8.05 Nm టార్క్‌ను రిలీజ్ చేస్తుంది. ఈ ఇంజన్ 4 స్పీడ్ గేర్‌బాక్స్‌తో అమర్చబడి ఉంటుంది. ఈ ఇంజన్‌లో ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీతొ తీసుకొచ్చారు. ఇంజన్ పవర్, పర్ఫామెన్స్ పరంగా ఇది చాలా బెటర్ బైక్.

Tags

Related News

ICICI Bank New Rules: కస్టమర్లకు ICICI బిక్ షాక్.. కనీస బ్యాలెన్స్ రూ.10 వేలు కాదు.. అంతకుమించి.. పేదోళ్ల సంగతి ఏంటో?

Digital Rent Agreement: ఈ రూల్ తెలియకుండా ఇల్లు అద్దెకు ఇస్తే రూ. 5000 జరిమానా కట్టక తప్పదు..

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Gold Particles: మురుగునీటి నుంచి భారీగా బంగారం ఉత్పత్తి.. లక్షల్లో సంపాదన..? ఎక్కడో తెలుసా?

Free Tempered Glass: టెంపర్డ్ గ్లాస్ డబ్బులు పెట్టి కొంటున్నారా? ఇకపై ఫ్రీగా పొందండిలా!

Jio Cheapest Plan: జియో చీపెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్, దీనితో లాభమేంటో తెలుసా?

Big Stories

×