Indrakeeladri Stampede: దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా.. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ దర్శనానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. ప్రతి ఏటా దసరా పండుగ నాడు ఈ ఉత్సవాల్లో.. భక్తుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. ఈసారి కూడా పండుగ రోజులు కావడంతో ఇంద్రకీలాద్రిపై భక్తులతో కిక్కిరిసిపోయింది. అయితే తాజాగా అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్‌లో నిల్చున్న భక్తుల మధ్య తోపులాట జరిగి, పెద్ద గొడవకు కారణం అయ్యింది.
తోపులాటకు దారితీసిన పరిణామాలు
అమ్మవారి దర్శనం కోసం ఉదయం నుంచి భక్తులు పొడవైన క్యూలైన్లలో నిలబడ్డారు. ఈ క్రమంలో ముందు వెళ్ళాలన్న తొందరలో కొందరు భక్తులు ఒకరిపై ఒకరు నెట్టుకోవడం ప్రారంభించారు. దీంతో భక్తుల మధ్య మాటా పెరిగి పెద్ద గొడవకు దారితీసింది.
ఇద్దరు భక్తులు ఒకరిపై ఒకరు దాడికి కూడా దిగారు. వారిని ఆపడానికి ప్రయత్నించిన మరికొందరు కూడా ఈ గొడవలో జోక్యం చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తమైంది.
భక్తుల భయం
అక్కడ జరిగిన తోపులాట కారణంగా.. క్యూలైన్‌లో ఉన్నభక్తులు తీవ్రంగా భయపడ్డారు. ఎవరికి ఏమవుతుందో అన్న ఆందోళనతో కొంతసేపు అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది. కొందరు భక్తులు గొడవను మొబైల్ ఫోన్లలో రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేయగా, అది మరింత చర్చనీయాంశమైంది.
పోలీసులు రంగప్రవేశం
సమాచారం అందుకున్న వెంటనే ఆలయ భద్రతా సిబ్బంది, పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గొడవ చేసిన భక్తులను పక్కకు తీసుకెళ్లి కఠిన హెచ్చరికలు జారీ చేశారు.
అధికారులు చేసిన ఏర్పాట్లు
దసరా ఉత్సవాల నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై.. భారీగా భక్తులు వస్తారని ముందే అంచనా వేసి అధికారులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తుల రాకను దృష్టిలో ఉంచుకుని అదనపు పోలీసులు నియమించారు. అయితే, క్యూలైన్‌లో అనూహ్యంగా ఏర్పడిన తోపులాట కారణంగా కొంతసేపు ఉధృిక్తత నెలకొంది. ఈ సంఘటన తరువాత అధికారులు మరింత కఠినమైన భద్రతా చర్యలు చేపట్టారు.
Also Read: కత్తితో రౌడీ షీటర్ వీరంగం.. పరిగెత్తించి.. పరిగెత్తించి
అదృష్టవశాత్తు పోలీసులు సమయానికి జోక్యం చేసుకోవడంతో.. ఎలాంటి అపశృతి జరగలేదు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు మరింత జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇస్తున్నారు.
ఇంద్రకీలాద్రిపై భక్తుల తోపులాట
అమ్మవారి దర్శనానికి వెళ్లే క్రమంలో క్యూలైన్లలో గొడవ పడిన భక్తులు
ఈ క్రమంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకునేంతగా ఇద్దరు భక్తుల మధ్య వాగ్వాదం
పోలీసుల రాకతో సద్దుమణిగిన గొడవ pic.twitter.com/LSTrxeoTQQ
— BIG TV Breaking News (@bigtvtelugu) October 1, 2025