ఎలుగు బంట్లు, ఏనుగులు తమ పిల్లలకు ఏమైనా అపాయం కలిగే అవకాశం ఉందని భావిస్తే, రియాక్షన్ చాలా సివియర్ గా ఉంటుంది. కోపంలో అవి ఏం చేస్తాయో కూడా ఊహించడం కష్టం. తాజాగా సదరన్ ఆఫ్రికాలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. సరస్సులో పడవ ప్రయాణం చేస్తున్న టూరిస్టులపై ఏనుగు దాడి చేసింది. పర్యాటకులు ప్రాణ భయంతో కాసేపు అల్లాడిపోయారు. అదృష్టం బాగుండి, ఏనుగు వెనక్కి వెళ్లిపోవడం, బతుకు జీవుడా అంటూ బయటపడ్డారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజాగా బోట్స్ వానాకు కొంత మంది అమెరికన్, బ్రిటిష్ టూరిస్టులు వెళ్లారు. అక్కడ చిత్తడి నేలల్లో పడవలో ఎంజాయ్ చేయాలనుకున్నారు. అందరూ కలిసి నాటు పడవలు ఎక్కి, అక్కడున్న సరస్సులో ఎంజాయ్ చేశారు. తిరిగి వస్తున్న క్రమంలో అక్కడే తన పిల్లలతో ఉన్న తల్లి ఏనుగు వీరి పడవను చూసింది. తమ పిల్లలకు ఎక్కడ ముప్పు వాటిల్లుతుందోనని, పడవ మీద దాడి చూసేందుకు దూసుకొచ్చింది. అప్పటికీ పడవ నడిపే వ్యక్తి ఏనుగు దాడి నుంచి తప్పించేందుకు పడవను వేగంగా ఒడ్డుకు చేర్చే ప్రయత్నం చేశాడు. కానీ, ఏనుగు వేగంగా దూసుకొచ్చి పడవను తొండంతో విసిరికొట్టింది. ఈ దాడిలో పడవలోని వాళ్లంతా నీళ్లలో పడిపోయారు. టూరిస్టులతో పాటు గైడ్లు, పడవ నడిపే వ్యక్తి కూడా బురదలో పడిపోయారు. పక్కనే ఉన్న మరో పడవ మీద కూడా దాడి చేసింది. ఈ దాడిలో కాసేపు పర్యాటకులు భయాందోళనకు గురయ్యారు. ఏనుగు పర్యాటకుల మీద దాడి చేయకుండా అక్కడి నుంచి వెనక్కి వెళ్లిపోవడంతో అందరూ ప్రాణాలతో బయటపడ్డారు.
ఏనుగు దాడిలో పర్యాటకులు, వారిని షూట్ చేసే సిబ్బంది కూడా నీళ్లలో పడిపోయారు. ఈ సందర్భంగా తమ ఫోన్లు, కెమెరాలతో పాటు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు నీళ్లలో పడిపోయాయి. అనుకోని ఈ దాడి కారణంగా పెద్ద మొత్తంలో నష్టం కలిగినట్లు టూరిస్టులు వెల్లడించారు. వస్తువులు పోయినా, ప్రాణాలకు ఇబ్బంది కలగకపోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
The moment an elephant charged at tourists in Botswana 🇧🇼 Okavango Delta on Saturday.
American and British tourists escaped after a bull elephant overturned their canoes and briefly held a woman underwater. She escaped with help from her husband. Credit: CNP pic.twitter.com/RCqSuFeOX4
— Weather Monitor (@WeatherMonitors) September 29, 2025
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొంత మంది నెటిజన్లు అయ్యో పాపం అంటుంటే, మరికొంత మంది ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. “ప్రశాంతంగా తమ బతుకు తాము బతుకుతున్న ఏనుగుల దగ్గరికి వెళ్తే, పరిస్థితి ఇలాగే ఉంటుంది. అందుకే, వాటికి ఇబ్బంది కలిగించకుండా ఉంటే మంచిది” అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. “టెర్మినేటర్ ఎలిఫెంట్” అంటూ మరో వ్యక్తి రాసుకొచ్చాడు. “ఏనుగుల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. లేదంటే ఇలాంటి పరిణామాలే ఎదురవుతాయి” అని ఇంకో వ్యక్తి రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఘటనపై నెట్టింట జోరుగా చర్చ జరుగుతోంది.
Read Also: కొండ మీది నుంచి కొడుకును విసిరేసిన ఇన్ఫ్లుయెన్సర్, ఆ తర్వాత ఏం జరిగిందంటే?