AMMA President:రాజకీయ రంగమైనా.. సినిమా రంగమైనా.. కొన్ని కొన్ని పదవులలో కేవలం మగవారు మాత్రమే చలామణి అవుతూ ఉంటారు. ఆ పదవులలో ఆడవారు ఎందుకు పనిచేయడం లేదు అనే అనుమానాలు కూడా వ్యక్తమౌతూ ఉంటాయి. అయితే ఇప్పుడు అలాంటి ఒక పదవిని ఒక నటి సొంతం చేసుకుని.. చరిత్ర రికార్డులు తిరగరాసింది. ముఖ్యంగా ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ ఉన్నప్పటికీ ఆ స్థానాన్ని అధిష్టించడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ఇలాంటి వాళ్లకు అలాంటి పదవులు ఎందుకు అని అంటున్నా.. ఇంకొంతమంది ఒక మహిళ ఈ స్థానాన్ని సాధించడం వెనక ఎంత కష్టం ఉంటుందో అర్థం చేసుకోవాలి అంటూ ఆమెకు సపోర్టుగా నిలుస్తున్నారు. మరి ఆమె ఎవరు? అసలు ఆ ఏం జరిగింది? అనే విషయం ఎప్పుడు చూద్దాం.
31 ఏళ్ల తర్వాత చరిత్ర సృష్టించిన శ్వేతా మీనన్..
ఆ ఇండస్ట్రీ ఏదో కాదు మలయాళ సినీ ఇండస్ట్రీ. ఇందులో ప్రముఖ నటి శ్వేతా మీనన్ (Swetha Menon) సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (AMMA ) ప్రెసిడెంట్ గా ఎన్నికైన తొలి మహిళ నటిగా సంచలనం సృష్టించారు. మలయాళ సినీ ఇండస్ట్రీలో 30 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న ‘అమ్మ’సంస్థలో ఇప్పటివరకు ప్రెసిడెంట్ గా పురుషులే కానీ స్త్రీలు ఆ స్థానాన్ని అధిష్టించలేదు. గతంలో ఎం జి సోమన్, మోహన్ లాల్, మమ్ముట్టి లాంటి అగ్ర తారలు మాత్రమే ఈ పదవిలో పనిచేశారు. కానీ 31 ఏళ్ల తర్వాత ఇప్పుడు వారందరినీ వెనక్కి నెట్టి.. ఒక మహిళ ఈ పదవిని చేజిక్కించుకోవడం ఇప్పుడు మలయాళ సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది..
తొలిసారి మహిళ అధ్యక్షురాలుగా శ్వేతా మీనన్..
ప్రత్యర్థి.. ప్రముఖ నటుడు దేవన్ ను ఓడించి ఆమె ప్రెసిడెంట్ పదవిని దక్కించుకున్నారు. ఇకపోతే శ్వేతా మీనన్ తో పాటు పలువురు మహిళలు కూడా ఈసారి అమ్మ సంస్థలో కీలక పదవులు చేపట్టడం గమనార్హం. ఇక్కడ జనరల్ సెక్రటరీగా కుక్కు పరమేశ్వరన్, జాయింట్ సెక్రటరీగా అన్సిబా హాసన్ ఉపాధ్యక్షురాలుగా లక్ష్మీ ప్రియా తదితరులు ఎన్నికయ్యారు. వాస్తవానికి ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల ఆరోపణలు ఎక్కువైన నేపథ్యంలో మోహన్ లాల్ పదవి నుండి తప్పుకున్నారు. అందుకే 2027లో జరగాల్సిన ఎన్నికలు ఈ ఏడాది నిర్వహించారు.. ఇకపోతే ఈమె పై కేసు నమోదు అవ్వగా ఎన్నికల్లో గెలుస్తారా? లేదా? అనేకమంది అభిప్రాయపడ్డారు. కానీ తోటి నటులు ఆమెకు అండగా నిలిచి ఆమెకు విజయాన్ని అందించారు.
శ్వేతా మీనన్ పై నాన్ బెయిలబుల్ వారెంట్..
ఇకపోతే ఇదే నెలలో ఆగస్టు 6వ తేదీన ఈమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రేసులో ముందంజలో ఉన్న శ్వేతా మీనన్ పై అడల్ట్ కంటెంట్ విక్రయిస్తూ.. ఆర్థిక ప్రయోజనం పొందుతోంది అనే కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అడల్ట్ కంటెంట్ ను ప్రమోట్ చేస్తూ.. అశ్లీలత ఎక్కువగా ఉండే సన్నివేశాలలో నటించిన కారణంగా.. ఈమెపై 2000 సమాచార టెక్నాలజీ చట్టం సెక్షన్ 67A ప్రకారం నాన్ బెయిలబుల్ వారెంట్ నమోదయింది. ఎర్నాకులం చీఫ్ జ్యుడీషియల్ కోర్టులో శ్వేతా మీనన్ అశ్లీలత ఎక్కువగా ఉండే సన్నివేశాలలో నటించి, ఆర్థిక లాభం పొందినట్టుగా కేసు నమోదు అయింది. నిజానికి ఈమె అమ్మ ప్రెసిడెంట్ గా ఉండడం చాలామందికి ఇష్టం లేదట. ఈ కారణంగానే ఏళ్ళ కిందట వచ్చిన పాత సినిమాలలోని సన్నివేశాలను ఇప్పుడు బయటకు తీసి ఆమెపై ఆరోపణలు చేస్తున్నారని ఆమె అభిమానులు వాపోయారు. అయితే ఎవరు ఎన్ని చేసినా ఆమెను అడ్డుకోలేరని ఆమె మరొకసారి నిరూపించింది.
ALSO READ:Shahrukh Khan: రోజులో 4 గంటలే నిద్ర.. షాకింగ్ కామెంట్స్ చేసిన షారుఖ్ !