New Vehicles from Tata Motors: దేశంలో టాటా మోటార్స్ ప్రస్తుతం అతిపెద్ద ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థగా కొనసాగుతోంది. అంతేకాకుండా కంపెనీ తన కొత్త వెహికల్స్‌ను అనేక విభాగాలలో ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఇందులో భాగంగా టాటా మోటర్స్ దేశీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో ఈ ఏడాది చివారి నాటికి నాలుగు కొత్త ఎస్‌యూవీలను తీసుకురానుంది. ఇందులో ఈవీ కూడా ఉంది. ఈ వాహనాల పూర్తి వివరాలు తెలుసుకోండి.
టాటా పంచ్ 2021 నుండి మార్కెట్లో ఉంది. దాని ఎలక్ట్రిక్ వెర్షన్‌ను కొత్త డిజైన్‌తో తీసుకొచ్చింది. అలానే త్వరలో దీని మైక్రో ఎస్‌యూవీ లెటెస్ట్ వెర్షన్‌ను తీసుకురానుంది. ఇటీవల మొదటిసారిగా పంచ్ ఫేస్‌లిఫ్ట్, 2024 పండుగ సీజన్‌లో విక్రయించాలని కంపెనీ భావిస్తుంది. డిజైన్ గురించి చెప్పాలంటే కనెక్ట్‌టెడ్ LED DRLలు, స్ట్రైట్ హెడ్‌ల్యాంప్‌లు, కొత్త బంపర్‌లను పొందవచ్చు.
Tata కర్వ్ EV ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో టాటా మోటార్స్ నుండి అతిపెద్ద లాంచ్‌గా దీన్ని చెప్పవచ్చు. కూపే ఎస్‌యూవీ చివరిగా భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2024లో ప్రొడక్షన్-రెడీ ICE వెర్షన్‌లో ప్రదర్శించారు. ఇది ఈ ఏడాది మధ్యలో ఈవీ వేరియంట్ తీసుకురానుంది. ఆ తర్వాత కర్వ్‌ని ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు.
Also Read: బజాజ్ చేతక్ నుంచి కొత్త EV.. మేలో లాంచ్!
టాటా హారియర్, సఫారి వెహికల్ పెట్రోల్-పవర్ వెర్షన్‌లు చాలా కాలంగా ఉన్నాయి. ఈ సంవత్సరం చివరి నాటికి వాటిని విడుదల చేయాలని టాటా భావిస్తుంది. టాటా మోటార్స్ ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ ఫేస్‌లిఫ్ట్ అప్‌డేట్‌తో కొత్త పెట్రోల్ ఇంజన్‌తో ఈ వెహికల్ రావచ్చు. అయితే కొత్త ఇంజన్ అప్‌డేట్‌తో వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Also Read: బైక్‌పై రూ.లక్షల్లో డిస్కౌంట్.. రేపే లాస్ట్
కొత్త 1.5-లీటర్ tGDi 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ 2023 ఆటో ఎక్స్‌పోలో మొదటిసారి ప్రదర్శించబడిన హారియర్, సఫారీలకు పవర్‌ని ఇస్తుందది. ఈ కొత్త పెట్రోల్ వెర్షన్ 168 బిహెచ్‌పి పవర్ అవుట్‌పుట్, 350 ఎన్ఎమ్ పీక్ టార్క్‌తో వస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ , ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆఫ్షన్‌లో కొనుగోలు చేయవచ్చు.