E-Paper
Advertisement

రియల్ ఎస్టేట్ బూమ్.. దేశంలో ఇళ్ల అమ్మకాలు జోరు.. 19 శాతం పెరుగుదల, హైదరాబాద్‌ మాటేంటి?

రియల్ ఎస్టేట్ బూమ్.. దేశంలో ఇళ్ల అమ్మకాలు జోరు.. 19 శాతం పెరుగుదల, హైదరాబాద్‌ మాటేంటి?
Advertisement

Real Estate: ఇరాన్ యుద్ధం ప్రభావం ఇప్పుడిప్పుడు తగ్గుముఖం పడుతోంది. ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్నాయి. ఇలాంటి అనిశ్చితి నెలకున్నా.. దేశీయ రియల్ ఎస్టేట్ సెక్టార్‌పై ఏ మాత్రం పడలేదు. హౌసింగ్ సేల్స్ 19 శాతం పెరిగాయి. మరి హైదరాబాద్ మార్కెట్ మాటేంటి? ఇక్కడా ఇళ్ల విక్రయాలు జోరందుకున్నాయని ప్రాప్‌ఈక్విటీ నివేదిక చెబుతోంది.

దేశంలో రియల్ ఎస్టేట్ బూమ్..  ఇళ్ల అమ్మకాలు జోరు

Advertisement

ఇరాన్ యుద్ధం ప్రభావం దేశీయ రియల్‌ ఎస్టేట్ సెక్టార్‌‌పై ఏ మాత్రం ప్రభావం చూపలేదు. ఫలితంగా దేశంలో ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలు జోరందుకున్నాయి. 2026-27 ఏడాది తొలి క్వార్టర్‌లో ఇళ్ల విక్రయాలు భారీగా పెరిగాయి. వివిధ వర్గాల నుంచి డిమాండ్ ఉండడంతో సేల్స్ పెరిగినట్లు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ ప్రాప్‌ఈక్విటీ రిపోర్ట్ తెలియజేసింది.

దేశంలోని 9 ప్రధాన నగరాల్లో ఇళ్ల-ఫ్లాట్ల అమ్మకాలు ఏప్రిల్-జూన్ సమయంలో 1,12,458 యూనిట్లుగా నమోదైంది. గతేదాడి ఇదే కాలంతో పోలిస్తే హౌసింగ్ సేల్స్ 19 శాతం పెరిగాయి. దేశంలో గతేడాది ముంబై, నవీ ముంబయి, థానే, ఢిల్లీ-ఎన్‌సీఆర్, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, పుణె, కోల్‌కతాల్లో కలిపి 94,864 ఇళ్లు/ఫ్లాట్లు అమ్ముడైనట్లు పేర్కొంది. వీటిల్లో ఎక్కువగా ఈసారి హౌసింగ్ సేల్స్ దక్షిణాది నగరాల్లో కనిపించింది.

Advertisement

దక్షిణాదిలో బెంగుళూరు టాప్, సెకండ్ ప్లేస్‌లో హైదరాబాద్

కొత్త నివాస గృహాల సరఫరా వార్షికంగా 43 శాతం పెరిగింది. ఇప్పుడు 1,17,609 యూనిట్లకు చేరుకున్నాయి. మార్కెట్ సెంటిమెంట్ సానుకూలంగా ఉందని ప్రాప్‌ఈక్విటీ ఫౌండర్ అంచనా వేశారు. దక్షిణాది మార్కెట్లు సత్తా చాటుతున్నాయని చెప్పుకొచ్చారు. దక్షిణ నగరాలు వృద్ధి వేగానికి నాయకత్వం వహించగా, బెంగళూరు అత్యంత బలమైన మార్కెట్‌గా అవతరించింది.

నగరాల వారీగా ఇళ్ల విక్రయాలు ఒక్కసారి చూద్దాం. నవీ ముంబైలో హౌసింగ్ సేల్స్ 61 శాతం పెరిగాయి. 6833 యూనిట్ల నుంచి 11,029 యూనిట్లకు చేరాయి. బెంగళూరులో ఇళ్ల అమ్మకాలు మూడు నెలల కాలంలో 47 శాతం వృద్ధిని నమోదైంది. గతేదాడి ఈ సమయంలో 14676 యూనిట్లుగా ఉండేది. ఇప్పుడు 21,516 కు చేరింది.

ALSO READ: బంగారం-వెండి పతనం.. ఇంకా పడే ఛాన్స్, 2025 తర్వాత తొలిసారి ఆ స్థాయికి 

ముంబై సిటీలో హౌసింగ్ సేల్స్ 32 శాతం పెరిగింది. 8006 యూనిట్ల నుంచి 10561 యూనిట్లకు చేరింది. థానే, పూణేలలో వరుసగా 10, 9 శాతం వృద్ధి నమోదైంది. వీటికి విరుద్ధంగా కోల్‌కతా, ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లు గృహ విక్రయాలలో వరుసగా 23, 14 శాతం క్షీణించాయి.  ఈ ఏడాది బెంగాల్ ఎన్నికల ప్రభావం కచ్చితంగా చూపవచ్చని ఓ అంచనా.

బెంగుళూరు తర్వాత హైదరాబాద్ 22 శాతం పెరుగుదలతో రెండోస్థానంలో నిలిచింది. గతేడాది 11,815 ఇళ్లు అమ్ముడుపోగా ఈ ఏడాది 14410 యూనిట్లకు చేరుకున్నాయి. చెన్నై 18 శాతం పెరుగుదలతో 6,323 యూనిట్లను నమోదు చేసింది. ఢిల్లీ-NCR, కోల్‌కతాల్లో విక్రయాలు 10082, 3414 యూనిట్లుగా ఉన్నాయి.

Related News

30 ఏళ్లు వచ్చేలోపు..ఈ 7ట్రిక్స్ పాటిస్తే, మీ ఫ్యూచర్ సెట్టైనట్టే!

మీకు 4-5 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయా? ఎక్కువ అకౌంట్లు ఉంటే జరిగే నష్టాలు ఇవే!

క్రెడిట్ కార్డ్ Vs వర్సెస్ బ్యాంక్ లోన్.. అత్యవసర సమయంలో ఏది బెటర్?

మీ బంగారంపై ఉన్న హాల్‌మార్క్ అసలైనదా? లేదా ?ఇలా గుర్తించండి!

ఒక్క ఏడాదిలోనే రూ.3.2 లక్షల నుంచి రూ.40 లక్షల ప్యాకేజీకి.. ప్రభుత్వ కాలేజీ విద్యార్థి కెరీర్ సూపర్ ఫాస్ట్

గోల్డ్ లోన్ చెల్లించినా మీ బంగారాన్ని బ్యాంక్ తిరిగి ఇవ్వకపోతే ఏం చేయాలి? ఇది తెలుసుకోండి

బ్యాంకుకు వెళ్లకుండానే..ఫోన్ నంబర్ మార్చుకోవడం ఎలా? సింపుల్ ప్రాసెస్ ఇగో!

పదేళ్ల తర్వాత ఆదివారం బ్యాంకులు ఓపెన్.. నగదు విత్‌డ్రా పరిమితులు తొలగింపు, సమ్మెలో 7.5 లక్షల మంది

Big Stories

Advertisement
×