E-Paper
Advertisement

ఎల్బీ‌నగర్ పీఎస్‌లో కానిస్టేబుల్‌ ఆత్మహత్య.. అసలే ఏం జరిగింది? కుటుంబసభ్యుల ఆందోళన

ఎల్బీ‌నగర్ పీఎస్‌లో కానిస్టేబుల్‌ ఆత్మహత్య.. అసలే ఏం జరిగింది? కుటుంబసభ్యుల ఆందోళన
Advertisement

Constable suicide: కారణాలు ఏంటో తెలీదు. కాకపోతే ఎల్బీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌ ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. వెంటనే కానిస్టేబుల్‌ని ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ విషయంలో తెలియగానే కానిస్టేబుల్ కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. అసలు ఏమి జరిగింది? ఇంకాస్తా లోతుల్లోకి వెళ్తే..

ఎల్బీ‌నగర్ పీఎస్‌లో కానిస్టేబుల్‌ ఆత్మహత్య

హైదరాబాద్ సిటీలోని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్ సాయికుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్టేషన్‌లోని రెస్ట్ రూమ్‌లో రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. సాయిని గుర్తించిన మిగతా సిబ్బంది సమీపంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. సాయిని పరీక్షించిన వైద్యులు.. అప్పటికే మృతి చెందినట్టు తెలిపారు.

Advertisement

 

షాకైన కుటుంబసభ్యులు, స్టేషన్ ఎదుట ఆందోళన

పోస్టుమార్టం కోసం కానిస్టేబుల్ మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. 2024 బ్యాచ్‌కు చెందిన సాయికుమార్‌ను ఈ-కాప్స్ డ్యూటీ కోసం ఎల్బీనగర్‌ ఏసీపీ కార్యాలయానికి అటాచ్‌ చేశారు అధికారులు. స్నేహితులతో కలిసి కర్మన్‌ఘాట్‌లో ఓ రూమ్‌లో గదిలో ఉంటున్నాడు. కానిస్టేబుల్ బలవన్మరణంపై పోలీస్ స్టేషన్ సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత సాయికుమార్ కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు.

Advertisement

 

సాయి మృతిపై అధికారులు ఆరా, ఏం జరిగింది?

పీఎస్‌కు చేరుకున్న అధికారులు సాయి ఆత్మహత్యపై ఆరా తీస్తున్నారు. మంగళవారం కూడా సాయి డ్యూటీకీ హాజరయ్యాడు. ఉన్నట్లుండి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అనేదాని పై ఆరా తీస్తున్నారు. మరోవైపు కానిస్టేబుల్ సాయికుమార్ ఆత్మహత్య గురించి తెలియగానే కుటుంబసభ్యులు ఎకఎకీన ఎల్బీనగర్‌ పీఎస్‌కు చేరుకున్నారు. స్టేషన్‌ ఎదుట కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. దీనిపై సాయి కుటుంబసభ్యులు పలు ప్రశ్నలు లేవనెత్తారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సివుంది.

ALSO READ: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

Related News

మేడ్చల్‌ జిల్లాలో తీవ్ర విషాదం.. రైలు ఢీకొని 100 గొర్రెలు మృతి!

ఫార్ములా-ఈ కేసులో బిగ్ అప్‌డేట్.. కేటీఆర్ పాస్‌పోర్ట్ జప్తుకు ఏసీబీ పిటిషన్!

లారీని ఢీ కొట్టిన ట్రావెల్ బస్సు.. స్పాట్‌లో 40 మంది, ఖమ్మం జిల్లాలో ఘటన

కలలోకి ప్రియుడు రావడంతో యువతి బలవన్మరణం, శంషాబాద్‌లో విషాద ఘటన

మునుగోడు పంచాయతీ సెక్రటరీలకు ఎమ్మెల్యే మాస్ వార్నింగ్!

రాజీవ్ యువ వికాసం పథకం బిగ్ అప్డేట్.. కలెక్టర్లకు ఆదేశాలు జారీ!

హైడ్రా ప్రజావాణికి వెల్లువలా ఫిర్యాదులు.. ఒక్కరోజే ఇన్ని ఫిర్యాదులా..?

గద్వాల మున్సిపాలిటీలో రూ. 11 లక్షల గోల్‌మాల్ కలకలం!

Big Stories

Advertisement
×