E-Paper
Advertisement

వరుణయాగంతో వర్షాలు కురుస్తాయా? పురాణాలు ఏం చెబుతున్నాయి.. శాస్త్రం ఏమంటోంది?

వరుణయాగంతో వర్షాలు కురుస్తాయా? పురాణాలు ఏం చెబుతున్నాయి.. శాస్త్రం ఏమంటోంది?
Advertisement

Varuna Yagam for Rain: తెలంగాణలో వర్షాల కోసం రాష్ట్ర ప్రభుత్వం నాగార్జునసాగర్‌ లో వరుణయాగం నిర్వహించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సతీసమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వర్షాలు సకాలంలో కురవాలని, రాష్ట్రంలో పంటలు సమృద్ధిగా పండాలని, రైతులకు ఇబ్బందులు లేకుండా ఉండాలని కోరుతూ ఇలాంటి యాగాలు నిర్వహించడం భారతీయ సంప్రదాయంలో కొత్తేమీ కాదు. అయితే, ఇక్కడ అసలు ప్రశ్న ఒక్కటే.. వరుణయాగం చేస్తే నిజంగానే వర్షాలు కురుస్తాయా?

పురాణాలు ఏం చెప్తున్నాయంటే?

హిందూ పురాణాలు, వేదాల్లో వర్షాలకు సంబంధించిన చాలా ప్రస్తావనలు ఉన్నాయి. వేద సంప్రదాయంలో వరుణుడు  వర్షాలకు అధిపతిగా భావిస్తారు. వర్షాలు కురవడం ప్రకృతి సమతుల్యతకు సంకేతంగా భావించి, దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి యజ్ఞాలు, పూజలు నిర్వహించే ఆచారం ప్రాచీన కాలం నుంచి ఉందని శాస్త్రాలు చెప్తున్నాయి. భగవద్గీతలో కూడా యజ్ఞం, వర్షం, ఆహారం, జీవన చక్రం మధ్య సంబంధాన్ని వివరించే ఘట్టాలు ఉన్నాయి. అయితే, పురాణాలు, ఆధ్యాత్మిక విశ్వాసాలు చెప్పే విషయాన్ని, ఆధునిక శాస్త్రం వేరే కోణంలో చూస్తుంది. వర్షం అనేది ప్రధానంగా నీటి ఆవిరి, వాతావరణంలోని తేమ, గాలి పీడనం, ఉష్ణోగ్రత, మేఘాల ఏర్పాటు ప్రకృతి ప్రక్రియల ఫలితంగా చెప్పుకోవచ్చు. సముద్రాలు, నదులు, సరస్సులు, భూమి నుంచి నీరు ఆవిరై పైకి వెళ్లడం.. అక్కడ చల్లబడటం.. మేఘాలుగా మారడం.. అనుకూల పరిస్థితులు ఏర్పడితే వర్షంగా భూమిపైకి పడటం సాధారణంగా జరిగే వ్యవహారం.

యాగంతో వర్షాలు కురుస్తాయా?

Advertisement

వాస్తవానికి యాగం నిర్వహించడం వల్ల నేరుగా వర్షం కురుస్తుందని నిరూపించే శాస్త్రీయ ఆధారాలులేవు. యాగంలో మంటలు, పొగ, వాతావరణంలోకి వెళ్లి వర్షం కురిసేలా చేస్తుందా? అనే అంశాలపై శాస్త్రీయంగా పరిశోధనలు జరిగినా, అవి పెద్ద స్థాయిలో వర్షపాతం కలిగిస్తాయని చెప్పడానికి తగిన ఆధారాలు లేవు.  అగాని వరుణయాగాలను పూర్తిగా కొట్టిపారేయాలా? ఇక్కడే విశ్వాసానికి, శాస్త్రానికి మధ్య ఉన్న తేడాను అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తి, సమాజం ఆధ్యాత్మిక విశ్వాసంతో యాగం చేయడం వారి నమ్మకానికి సంబంధించిన విషయం. దాని వల్ల మానసికంగా ధైర్యం రావచ్చు.సామూహికంగా ఒక ఆశాభావం ఏర్పడవచ్చు. ముఖ్యంగా రైతులు వర్షాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఇలాంటి కార్యక్రమాలు వారికి ఒక భావోద్వేగ భరోసాను ఇవ్వవచ్చు. కానీ, వర్షాలపై నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆధునిక వాతావరణ శాస్త్రాన్నే ప్రధానంగా పరిగణించాలి. వాతావరణ శాఖ అంచనాలు, ఉపగ్రహ చిత్రాలు, రాడార్ డేటా, వర్షపాతం నమూనాలు, జలాశయాల పరిస్థితి వంటి శాస్త్రీయ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని వ్యవసాయ ప్రణాళికలు రూపొందించాలి.

విశ్వాసాన్ని గౌరవిస్తూనే, ప్రకృతిని అర్థం చేసుకోవాలి!

వరుణయాగం ఒక ఆధ్యాత్మిక విశ్వాసం కావచ్చు. కానీ, వర్షం ప్రకృతి శాస్త్రం. విశ్వాసాన్ని గౌరవిస్తూనే, ప్రకృతి పరిణామాలను అర్థం చేసుకోవడానికి శాస్త్రాన్ని నమ్మడం రెండూ పరస్పర విరుద్ధమైన విషయాలు కావు. యాగం తర్వాత వర్షం కురిస్తే దాన్ని భక్తులు తమ నమ్మకానికి ఫలితంగా భావించవచ్చు. కానీ, శాస్త్రీయంగా మాత్రం ఆ వర్షానికి కారణమైన వాతావరణ పరిస్థితులను పరిశీలించాల్సిందే. ప్రస్తుతం శాస్త్ర పరిజ్ఞానం ఎంతగా పెరిగినా, ప్రకృతి ముందు మనిషి ఇంకా ఎన్నో విషయాల్లో ఆశ్చర్యపోతూనే ఉన్నాడు. అందుకే, నమ్మకం వ్యక్తిగతం.. కానీ, ప్రకృతి నియమాలు మాత్రం అందరికీ ఒకటే!

Advertisement

Read Also: నాగార్జున సాగర్ గడ్డపై వరుణయాగం.. పూర్ణాహుతిలో పాల్గొన్న రేవంత్, ఉత్తమ్ దంపతులు!

Tags

Related News

పదేళ్ల నిరీక్షణకు తెర.. భారత్‌లోకి ‘యాపిల్ పే’.. మరి యూపీఐకి సపోర్ట్ చేస్తుందా?

రూ.474 ధరకే.. 60 గంటల బ్యాటరీ లైఫ్ ఇచ్చే ఇయర్‌బడ్స్!

Airtel యూజర్లకు షాక్.. రూ. 579, రూ. 859 ప్లాన్లు గుప్‌చుప్‌గా అవుట్.. ప్రత్యామ్నాయాలు ఇవే!

డిస్కౌంట్‌లో బోట్ పవర్ బ్యాంక్..వెంటనే కొనేయండి

రూ.599కే..50 గంటల బ్యాటరీ లైఫ్,డ్యూయల్ పేరింగ్ ఇయర్‌బడ్స్!

2000 ఏళ్ల క్రితమే ‘అనలాగ్ కంప్యూటర్’.. గ్రీకులు కనుగొన్న ఈ అద్భుతం గురించి మీకు తెలుసా?

రూ.849కే బ్లూటూత్ స్పీకర్.. దీని ముందు హోమ్ థియేటర్ బలాదూర్

Big Stories

Advertisement
×