E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

నెట్‌ఫ్లిక్స్ వాడుతున్నారు సరే.. ఈ 7 సీక్రెట్స్ గురించి తెలుసా? లేదంటే చాలా మిస్ అవుతున్నట్లే!

నెట్‌ఫ్లిక్స్ వాడుతున్నారు సరే.. ఈ 7 సీక్రెట్స్ గురించి తెలుసా? లేదంటే చాలా మిస్ అవుతున్నట్లే!
Advertisement

Netflix Features: ప్రస్తుత ఓటీటీ యుగంలో నెట్‌ఫ్లిక్స్ (Netflix)కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సినిమాలు, వెబ్ సిరీస్ లను అమితంగా ఇష్టపడే చాలా మంది.. తమ ఫోన్లు, టీవీల్లో నెట్ ఫ్లిక్స్ ను వినియోగిస్తున్నారు. అయితే నెట్ ఫ్లిక్స్ లోకి వెళ్లామా? సినిమా చూశామా? అనే ధోరణిలోనే చాలా మంది యూజర్లు ఉంటారు. కానీ వారికి తెలియని ఎన్నో అద్భుతమైన ఫీచర్లు, ఆశ్చర్యపరిచే ట్రిక్స్ నెట్ ఫ్లిక్స్ యాప్ లో దాగున్నాయి. నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ అనుభవాన్ని సరికొత్త స్థాయికి తీసుకెళ్లే ఆ టాప్ – 7 సీక్రెట్ ఫీచర్స్ ఏంటో ఈ కథనంలో చూద్దాం.

సీక్రెట్ కేటగిరీ కోడ్స్

నెట్‌ఫ్లిక్స్‌లో హోమ్ పేజీలో కనిపించే రికమండేషన్స్ కాకుండా.. మీకు నచ్చిన నిర్దిష్టమైన జానర్ (యానిమే యాక్షన్, పొలిటికల్ థ్రిల్లర్స్, క్లాసిక్ మూవీస్) చూడాలనుకుంటే ఒక రహస్య మార్గం ఉంది. నెట్‌ఫ్లిక్స్‌లోని ప్రతి జానర్‌కు ఒక ప్రత్యేకమైన కోడ్ ఉంటుంది. ఉదాహరణకు యాక్షన్ కమెడీస్‌కు 43040 కోడ్ ఇస్తే… కేవలం ఆ కేటగిరీకి సంబంధించిన సినిమాలు మాత్రమే మీ స్క్రీన్ పై ప్రత్యక్షమవుతాయి.

సబ్‌టైటిల్స్ డిజైన్‌లో మార్పులు

Advertisement

చాలా మందికి డిఫాల్ట్‌గా వచ్చే తెల్లటి సబ్‌టైటిల్స్ నచ్చకపోవచ్చు. వాటి పరిమాణం, రంగు, బ్యాక్‌గ్రౌండ్ షాడో వంటివి మార్చుకునే వీలు నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. ఇందుకోసం మీ అకౌంట్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ‘Profile & Parental Controls’ క్లిక్ చేయాలి. అక్కడ ఉన్న ‘Subtitle Appearance’ ఆప్షన్‌ ద్వారా మీకు నచ్చిన ఫాంట్ స్టైల్, కలర్‌ను సెట్ చేసుకోవచ్చు.

ప్రొఫైల్‌కు ‘పిన్’ లాక్

ఇంట్లో ఒకే నెట్‌ఫ్లిక్స్ ఖాతాను కుటుంబ సభ్యులంతా వాడుతున్నప్పుడు, మీ ప్రొఫైల్‌లోకి ఇతరులు వెళ్లకుండా ప్రైవసీని మెయిన్ టెన్ చేయవచ్చు. దీనికోసం మీరు ప్రొఫైల్ లాక్ ఫీచర్‌ని ఉపయోగించవచ్చు. దీనికోసం అకౌంట్ సెట్టింగ్స్ లోకి వెళ్లి.. మీ ప్రొఫైల్‌ను సెలెక్ట్ చేయండి. ‘ప్రొఫైల్ లాక్’ ఆప్షన్‌ను ఎనేబుల్ చేయడం ద్వారా 4 అంకెల పిన్ సెట్ చేసుకోవచ్చు. దీనివల్ల మీ వాచ్ హిస్టరీ ఇతరులకు కనిపించదు.

మెుబైల్ డేటా ఆదా టిప్స్

Advertisement

మొబైల్ డేటా ద్వారా సినిమాలు చూసేవారికి ఇదొక అద్భుతమైన ఫీచర్. నెట్‌ఫ్లిక్స్ ఎక్కువ డేటాను ఖర్చు చేస్తుందని బాధపడేవారు.. యాప్ సెట్టింగ్స్‌లో ఓ మార్పు చేయడం ద్వారా ఆదా చేయవచ్చు. ఇందుకోసం నెట్ ఫ్లిక్స్ సెట్టింగ్స్ లోకి వెళ్లి ‘సెల్యూలర్ డేటా యూసేజ్’ ఆప్షన్‌ను క్లిక్ చేయండి. అక్కడ ‘ఆటోమేటిక్’ తీసేసి ‘సేవ్ డేటా’ మోడ్‌ను ఆన్ చేసుకుంటే తక్కువ డేటాతోనే ఎక్కువ కంటెంట్ ను చూడొచ్చు.

క్లియర్ వాచింగ్ లిస్ట్

కొన్నిసార్లు మనం ఏదైనా సినిమాను పొరపాటున క్లిక్ చేసినా లేదా సగం చూసి వదిలేసినా అది హోమ్ స్క్రీన్‌పై ‘కంటిన్యూ వాచింగ్’ లిస్ట్‌లో అలాగే ఉండిపోతుంది. దీన్ని తీసేయడానికి నెట్‌ఫ్లిక్స్ వెబ్ వెర్షన్‌లో అకౌంట్ లోకి వెళ్లి ‘Viewing Activity’ని ఓపెన్ చేయండి. అక్కడ మీరు చూసిన సినిమాల జాబితా కనిపిస్తుంది. మీకు నచ్చని సినిమా పక్కన ఉండే ‘హైడ్’ ఐకాన్‌పై క్లిక్ చేస్తే అది హిస్టరీ నుండి శాశ్వతంగా డిలీట్ అవుతుంది.

ఆడియో డిస్క్రిప్షన్

దృష్టి లోపం ఉన్నవారి కోసం లేదా స్క్రీన్ వైపు చూడకుండా కేవలం కథను రేడియోలా వినాలనుకునే వారి కోసం నెట్‌ఫ్లిక్స్ ‘ఆడియో డిస్క్రిప్షన్’ ఫీచర్‌ను అందిస్తోంది. ఏదైనా సినిమా ప్లే అవుతున్నప్పుడు ‘ఆడియో & సబ్‌టైటిల్స్’ ఆప్షన్‌లోకి వెళ్లి ‘ఆడియో డిస్క్రిప్షన్’ ని క్లిక్ చేయండి. అప్పుడు స్కీన్ పై ఏం జరుగుతోంది? పాత్రల హావభావాలు ఏంటి? అనేది వాయిస్ ఓవర్ రూపంలో వినిపిస్తూ ఉంటుంది.

Also Read: ఏంటీ, ‘Bluetooth On’లో ఉంటే.. ఇన్ని ఘోరాలు జరుగుతాయా? సర్వం కోల్పోవాల్సిందేనా!

సరికొత్త ఫీచర్లపై ట్రయల్స్

నెట్‌ఫ్లిక్స్ భవిష్యత్తులో తీసుకురాబోయే సరికొత్త ఫీచర్లను అందరికంటే ముందే.. వాడే వెసులు బాటు ఉంది. ఇందుకోసం అకౌంట్ సెట్టింగ్స్‌లో ‘Test Participation’ అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని ‘ON’ చేసి పెట్టుకుంటే నెట్‌ఫ్లిక్స్ ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టే కొత్త ఇంటర్‌ఫేస్ డిజైన్లు, ఫీచర్లు సాధారణ వినియోగదారుల కంటే ముందే మీకు అందుబాటులోకి వచ్చేస్తాయి.

Also Read: అమెజాన్‌ బంపరాఫర్.. సగం ధరకే రోబోటిక్ క్లీనర్లు.. ఒక్క బటన్‌తో ఇల్లంతా క్లీన్!

Related News

షావోమి మరో అద్భుతం.. దుమ్మురేపే స్మార్ట్ కుక్కర్ లాంచ్.. ఇక బుల్లెట్ స్పీడ్‌తో వంట!

జర్మనీలో చాలా ఇళ్లలో ఏసీలు ఉండవు? అసలు కారణం ఇదే!

ఏంటీ, ‘Bluetooth On’లో ఉంటే.. ఇన్ని ఘోరాలు జరుగుతాయా? సర్వం కోల్పోవాల్సిందేనా!

ఇల్లు మెరవాలా? ఈ మల్టీ-సర్ఫేస్ వ్యాక్యూమ్ క్లీనర్‌తో క్లీనింగ్ చిటికెలో!

సూపర్ ఫాస్ట్ కూలింగ్‌తో.. దుమ్మురేపుతున్న 5 బెస్ట్ స్ప్లిట్ ఏసీలు!

ఎండలైనా, వర్షాలైనా ఫుడ్ సూపర్ ఫ్రెష్! స్మార్ట్ ఫ్రిజ్‌ల లిస్ట్ మీ కోసం

రూ.35 వేల బడ్జెట్‌లో ల్యాప్‌టాప్ లాంటి టాబ్లెట్.. భారత్‌లో లాంచ్ డేట్ ఫిక్స్!

Big Stories

×